రష్యాలో కొద్ది నెలలుగా అనుమానాస్పద మరణాలు జరుగుతున్నాయి. తాజాగా ఆ దేశానికి కరోనా వ్యాక్సిన్ తెచ్చిన శాస్త్రవేత్త 47 ఏళ్ల ఆండ్రీ బొటికొవ్ ను ఓ వ్యక్తి హత్య చేసారు. శనివారం ఈ మేరకు రష్యా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదొక్కటే కాదు..ఇటీవలి కాలంలో రష్యాలో ఆ దేశ సంపన్నులు, రాజకీయ నాయకులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు.
రష్యాలో కరోనా వ్యాక్సిన్ శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ దారుణ హత్య సంచలనం స్రుష్టించింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఇలాగే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా హత్యకు గురయ్యారు. అయితే ఈ ప్రముఖుల మరణాల వెనుక రహస్యమేంటో అంతుచిక్కట్లేదు. తాజాగా మరో శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ ను ఓ వ్యక్తి హత్య చేశాడు. శనివారం ఈ మేరకు రష్యా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.మాస్కోలోని గమాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అంట్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా బొటికోవ్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు.
అతను విచారణలో నేరాన్ని అంగీకరించాడని చెబుతున్నారు. 2020లో ‘స్పుత్నిక్ వీ’ని అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల బృందంలో బొటికోవ్ ఒకరు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021లో ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్‌లాండ్’ పురస్కారంతో సత్కరించారు. బొటికోవ్‌తో నిందితుడు ఏదో విషయంలో గొడవ పెట్టుకున్నాడని, ఆ తర్వాత బెల్ట్‌తో అతడి గొంతు నులిమి అక్కడి నుంచి పారిపోయాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కొంతకాలంగా రష్యాలో ఆ దేశ సంపన్నులు, రాజకీయ నాయకులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆరుగురు రష్యన్ ఒలిగార్చ్‌లు ఆత్మహత్య చేసుకొన్నట్లు నివేదికలు గుర్తించగా.. హైకింగ్ యాక్సిడెంట్‌లో మరొకరి మృతి చెందారు.
రష్యా ఎనర్జీ సెక్టార్‌కు చెందిన ప్రముఖులే ఎక్కువగా మృతి చెందడం మిస్టరీగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆరుగురు రష్యన్ ఒలిగార్చ్‌లు ఆత్మహత్య చేసుకొన్నట్లు నివేదికలు గుర్తించగా.. హైకింగ్ యాక్సిడెంట్‌లో మరొకరి మృతి చెందారు. రష్యా ఎనర్జీ సెక్టార్‌కు చెందిన ప్రముఖులే ఎక్కువగా మృతి చెందడం మిస్టరీగా మారింది. రష్యన్ ఒలిగార్చ్‌ల మిస్టరీ డెత్స్ వివరాల్లోకి వెళ్తే.. మే 2న ఆండ్రీ క్రుకోవ్స్కీ, ఏప్రిల్ 19 సెర్గీ ప్రోటోసేన్యా, ఏప్రిల్ 18 వ్లాడిస్లావ్ అవయేవ్, మార్చి 23 వాసిలీ మెల్నికోవ్, ఫిబ్రవరి 28 మిఖాయిల్ వాట్‌ఫోర్డ్, ఫిబ్రవరి 25 అలెగ్జాండర్ త్యూల్యకోవ్, జనవరి 30 న లియోనిడ్ షుల్మాన్ లు చనిపోయారు. స్పెయిన్‌లోని ఒక విలాసవంతమైన విల్లాలో ఉరివేసుకుని కనిపించిన ప్రొటోసెన్యా, అతను కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం.
ప్రోటోసెన్యా భార్య, కుమార్తె కూడా కత్తిపోట్లతో చనిపోయినట్లు స్పానిష్ పోలీసులు తెలిపారు. స్పానిష్ మీడియా సంస్థలు టెలిసింకో, ఎల్ పంట్ అవూయి ప్రకారం ప్రోటోసెన్యా మృతదేహం పక్కన గొడ్డలి, కత్తి కనిపించినట్లు తెలిపారు. రష్యన్ ఒలిగార్చ్ తన భార్య, కుమార్తెను చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తం చేసిన టెలిసింకో. తన తండ్రి కుటుంబానికి ఎప్పటికీ హాని చేయడని డైలీ మెయిల్ మీడియా సంస్థతో ప్రోటోసెన్యా కుమారుడు ఫెడోర్ చెప్పాడు. తన తల్లిని, ముఖ్యంగా తన సోదరి మరియాను తండ్రి ఎంతగానే ప్రేమించారన్న ఫెడోర్ అన్నారు. వారికి హాని కలిగించేలా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు.
ప్రోటోసెన్యా సూసైడ్ నోట్ రాయలేదని, అక్కడున్న ఆయుధాలపై ఎలాంటి వేలిముద్రలు కూడా కనిపించలేదని రిపోర్ట్స్ తేల్చాయి. హత్య- ఆత్మహత్య థియరీని ప్రోటోసెన్యా మాజీ యజమానులు, రష్యన్ సహజ వాయువు ప్రధాన సంస్థ నోవాటెక్ ప్రశ్నించాయి. సెర్గీ ప్రోటోసెన్యా అత్యుత్తమ వ్యక్తి, కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు, సంస్థ ఏర్పాటు, అభివృద్ధికి గణనీయమైన సహకారం అందించారని నోవాటెక్ ప్రకటించాడు. దురదృష్టవశాత్తు ఆయన మృతిపై వివిధ ఊహాగానాలు మీడియాలో వెలువడ్డాయి, ఊహాగానాలకు వాస్తవానికి సంబంధం లేదని నమ్ముతున్నామని నోవాటెక్ అన్నారు. మాస్కోలోని అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమార్తెతో కలిసి శవంగా కనిపించిన రష్యన్ ఎనర్జీ సెక్టార్ దిగ్గజ సంస్థ గాజ్‌ప్రోమ్‌బ్యాంక్ మాజీ వైప్ ప్రెసిడెంట్ అవయేవ్. అవాయెవ్ తన భార్య, కుమార్తెను చంపిన తర్వాత పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు భావిస్తున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది.