యుద్దం ఎవరు… ఎవరిపై చేసినా.. నష్టం ఇరువురికి తప్పదు.. ఇప్పుడు ఇదే విషయం ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యాకు సైతం అర్థం అవుతోంది.. కొన్ని నెలలుగా ఉక్రెయిన్ తో యుద్దం చేస్తోన్న రష్యా సాధించిందేమీ లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఉక్రెయిన్ పై పక్కా ప్లాన్ తో యుద్దానికి దిగిన రష్యా.. ఆ యుద్దంలో ఎందుకు గెలవలేకపోతోంది..? రష్యా సైన్యంలో అధునాతన ఆయుధాలను ఉపయోగించే సైనికులు లేకపోవడమే రష్యాకు సమస్యగా మారిందా..? యుద్దంలో గెలిచే సత్తా రష్యా సైనికులకు లేదా..?
యుద్ధం అంటే అంత ఈజీ కాదు. అది ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు బాగా తెలిసి వస్తోంది. గత ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న పుతిన్..ఇప్పటికీ సాధించింది ఏమీ లేదు. పైగా అటు నాటో దేశాల సహకారం లేకపోయినప్పటికీ… ఉక్రెయిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పుతిన్ యుద్ధానికి జనవరి 6, 7 తేదీలలో విరామం ప్రకటించాడు. కానీ అవి సాకులు మాత్రమే. కానీ యుద్దాన్ని పూర్తిగా అపే పని ఎవరూ చేయడం లేదు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు.. కానీ దాని
సారాంశం ఏమిటో ఎవరికీ తెలియదు. బయట ఏవేవో ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి కానీ. అవేవీ నిజాలు కాదు.
ప్రస్తుతం రష్యా వద్ద ఆధునిక యుద్ద పరికరాలు ఉన్నాయి. వాటిని వాడగల సైనికులు మాత్రం లేరు. ఇంజనీర్లు అంతకన్నా లేరు.. అందు కోసమే పుతిన్ రెండు రోజులపాటు యుద్ధ విరామం ప్రకటించారని ఓ పత్రిక సంచలన విషయాలు ప్రకటించింది.. దీనిని అప్పట్లో అందరూ తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు అవి నిజాలు అయ్యాయి. రష్యాకు ఆర్టీలరీ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో ఉక్రెయిన్ పై యుద్ధం లో సులువుగా విజయం సాధించవచ్చు.. కానీ వీటిని సమర్థవంతంగా ఆపరేట్ చేసేవారు లేరు.

ఇక ‘దొనెత్సక్ పీపుల్ రిపబ్లిక్’ అనే ప్రాంతం భౌగోళికంగా ఉక్రెయిన్ లోనే ఉన్నా ఈ ప్రాంతం మొత్తం రష్యన్ భాష మాట్లాడే వాళ్ళతో నిండి ఉంది.. పైగా రష్యాకు అనుకూలంగా గత పది సంవత్సరాలుగా పోరాడుతోంది.. ఇక ఈ ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది.. రష్యా వద్ద ఉన్న ఆర్టీలరీ గన్స్ మీద ఆ దేశ
సైనికులకు 20% మాత్రమే తెలుసు. హోవిట్జర్లు, రాకెట్ లాంచర్స్, డ్రోన్లు, ఫైర్ కంట్రోల్ సిస్టం ఒక దానికి ఒకటి అనుసంధానంగా పనిచేయలేకపోవడం వల్ల యుద్ధంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతోంది.. అంతేకాదు ఫార్వర్డ్ అబ్జర్వర్ అనేవి ఆర్మీకి కళ్ళు, చెవులు లాంటివి. ఒకప్పుడు వీటి కోసం మనుషులను వాడేవాళ్లు. ఇప్పుడు చిన్న చిన్న డ్రోన్లు వాడుతున్నారు. యూఏవీ లను కూడా ఉపయోగిస్తున్నారు.
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టినప్పుడు ఆర్టిలరీ గన్స్ ఫ్రంట్ లైన్ లో ఉన్నాయి.. ఫైర్ కంట్రోల్ సిస్టం కూడా తన వంతు పనిచేసింది..డ్రోన్లు కూడా ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. కానీ సకాలంలో ఆర్టిలర్ గన్స్ కు సకాలంలో సమాచారం ఇవ్వలేదు.. దీంతో రష్యాకు యుద్ధం గెలిచే అవకాశం రాలేదు. ఇప్పటికీ ఎటువంటి అనుసంధానం లేకుండానే యుద్ధం చేస్తోంది.. అక్కడ ఉక్రెయిన్ ఉంది కాబట్టి సరి పోయింది.. మరో దేశం కనుక ఆ స్థానంలో ఉంటే రష్యా కు సరిపోయేది. ఇప్పుడు ఇదే విషయం పుతిన్ కు తెలిసి వస్తోంది. ఇప్పుడు రెండు రోజులు మాత్రమే యుద్దాన్ని తాత్కాలికంగా
ఆపాడు.. కానీ తర్వాత రోజుల్లో పూర్తిగా నిలిపివేస్తాడు. అది కూడా దగ్గరలోనే ఉంది.
రష్యా – యుక్రెయిన్ యుద్ధానికి రష్యాను తప్పపట్టకూడదని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. ఆ యుద్ధం ‘‘ఇరు దేశాలకూ విషాదమే’’ అని పేర్కొన్నారు. పుతిన్ సీనియర్ మిలటరీ అధికారులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని టెలివిజన్‌లో ప్రసారం చేశారు. యుక్రెయిన్‌ను తాము ‘‘సోదర దేశం’’గానే భావిస్తున్నామని పుతిన్ ఈ సందర్భంగా చెప్పారు.
‘‘మూడో దేశాల విధానాల ఫలితంగా’’ తమ రెండు దేశాల మధ్య ఘర్షణ తలెత్తిందని, రష్యా విధానం కారణం కాదని ఆయన పేర్కొన్నారు. పుతిన్ మాటలు.. పశ్చిమ దేశాల విస్తరణను పరోక్షంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ వాదనను ఇతర దేశాలు కొట్టివేస్తూ ఉన్నాయి కూడా. సోవియట్ అనంతర రిపబ్లిక్ దేశాలను పశ్చిమ ప్రపంచం ‘‘బ్రెయిన్‌వాష్’’ చేసిందని, అందులో మొదటిది యుక్రెయిన్ అని పుతిన్ విమర్శించారు.
‘‘యుక్రెయిన్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవటానికి మేం చాలా ఏళ్ల పాటు ప్రయత్నించాం. రుణాలు ఇచ్చాం. చౌకగా ఇంధనం అందించాం. కానీ అది ఫలించలేదు’’ అని పేర్కొన్నారు. ‘‘మమ్మల్ని నిందించటానికి ఏమీ లేదు. యుక్రెయిన్ ప్రజలను మేం ఎల్లప్పుడూ సోదర జనంగానే చూశాం. నేను ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాను’’ అన్నారు పుతిన్.
పుతిన్ ప్రసంగం సందర్భంగా.. సైనికాధికారులు యుక్రెయిన్‌లో ‘‘ప్రత్యేక సైనిక చర్య’’ను 2023లో కొనసాగిస్తామని ప్రతినబూనారు. ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయటానికి రష్యా సిద్ధంగా ఉందని,దానికి పరిమితి లేదని పుతిన్ పేర్కొన్నారు. రష్యా సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాల్సిన వయసు పరిధిని పెంచాలని రక్షణ మంత్రి సెర్గీ షోయుగు ఈ సందర్భంగా ప్రతిపాదించారు.
ప్రస్తుత చట్టం ప్రకారం.18 నుంచి 27 ఏళ్ల వయసు మధ్య ఉన్న రష్యా పౌరులను తప్పనిసరిగా సైన్యంలో పనిచేయటానికి రప్పించవచ్చు. ఈ వయసు పరిమితిని 21 నుంచి 30 ఏళ్లకు మార్చాలని రక్షణ మంత్రి సెర్గీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్నారు. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రలో స్వాధీనం చేసుకున్న బెర్దియాన్స్క్, మరియుపూల్ రేవు నగరాల్లో రెండు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా సెర్గీ ప్రకటించారు. యుక్రెయిన్ పైదాడికి దిగిన రష్యా కూడా తగిన మూల్యం చెల్లించుకుంటోంది.. యుక్రెయిన్ సైనికులతో పాటు రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
యుక్రెయిన్ తో దాడులు చేస్తున్నప్పటికీ.. యుక్రెయిన్ పై విజయం సాధించడకపోవడం రష్యను కలవరపాటుకు గురిచేస్తోంది..