Homeఅంతర్జాతీయంషీ జిన్‌పింగ్ గుప్పిట్లో సర్వాధికారాలు...ఆమోదముద్రకు సిద్ధమైన రబ్బర్ స్టాంప్ పార్లమెంట్

షీ జిన్‌పింగ్ గుప్పిట్లో సర్వాధికారాలు…ఆమోదముద్రకు సిద్ధమైన రబ్బర్ స్టాంప్ పార్లమెంట్

పేరుకదో కమ్యూనిస్టుల అగ్రరాజ్యం.. కానీ ఎటు చూసినా నియంత్రుత్వపు పోకడలే కనిపిస్తాయి. ఎక్కడా ఎదురు ప్రశ్నించడం ఉండదు..హక్కులు నామమాత్రంగానే ఉంటాయి. భావవ్యక్తీకరణ స్వేచ్చ నిల్.. ఎక్కడా ఇంటర్నెట్ ఉండదు..ప్రభుత్వం వెల్లడించిన విషయాలే వార్తలుగా వస్తుంటాయి. అలాంటి దేశానికి జీవిత కాలపు అధ్యక్షుడిగా ఉన్నారు షీ జిన్ పింగ్..ఆయనకెదురు లేనే లేదు.. అక్కడి పార్లమెంటు కేవలం ఓ రబ్బరు స్టాంపు మాత్రమే.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

చైనా సుప్రీం లీడర్, జీవితకాలపు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గుప్పిట్లోనే సర్వాధికారాలుంటాయి. చైనాలో ఈ వారాంతంలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మొదలవుతుంది. షీ జిన్‌పింగ్ అధికారానికి అది పరాకాష్ట కాబోతోంది. అదే సమయంలో ఆయన ప్రతిపాదించబోయే నిర్ణయాలకు ఆమోదముద్రకు రబ్బర్ స్టాంప్ పేరుపొందిన డ్రాగన్ కంట్రీ పార్లమెంట్ సిద్ధమైంది. బయటకు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు షీ జిన్ పింగ్..కానీ కమ్యూనిస్ట్ పార్టీలో సర్వాధికారాలను జిన్‌పింగ్ తన గుప్పిట్లో పెట్టుకున్నారు.
ఆయనను ఎవరూ సవాలు చేసే అవకాశం కూడా లేదు. దీన్ని ప్రతిబింబించేలా పార్టీ వార్షిక సమావేశం ఉండబోతోంది. సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొనే రబ్బర్ స్టాంప్ సమావేశంగా దాని గురించి చెబుతున్నారు విశ్లేషకులు. జింగ్‌పింగ్ తన అధికారానికి తలొగ్గే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవచ్చు.

చైనా ప్రీమియర్ అంటే..ప్రధాన మంత్రి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న వ్యక్తి. అధికారంలో జిన్‌పింగ్ కన్నా ఒక్క మెట్టు కింద ఉండే వ్యక్తి. ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్‌కు ఈసారి ఉద్వాసన తప్పదని అంటున్నారు. ఆయన స్థానంలో కచ్చితంగా లీ కియాంగ్ వస్తారని సమాచారం. షీ జిన్‌పింగ్ పట్ల విధేయతలో వీరిద్దరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక దశాబ్ద కాలంగా జిన్‌పింగ్ అవినీతి అణచివేత పేరుతో ప్రత్యర్థి వర్గాలను నరుక్కుంటూ వచ్చారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ కోసం ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన కమిటీ ఇది. ఇప్పుడు ఇందులో అందరూ జిన్‌పింగ్ విధేయులే ఉన్నారు.

ఈ వారాంతంలో జరగబోయే సమావేశంలో వివిధ విభాగాధిపతులను, మంత్రులను ఎన్నుకుంటారు. పాత వాళ్లను తొలగించి, కొత్తవాళ్లను ఎన్నుకోబోతున్నారు. వీళ్లంతా కూడా జిన్‌పింగ్ క్యాంపు సభ్యులే అవుతారని అంచనా. అంటే వారికి అర్హత లేదని కాదు. కానీ, జిన్‌పింగ్‌కు ఎదురు మాట్లాడే శక్తి ఉంటుందా? అన్నప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. ఇలా అందరు విధేయులే ఉంటే జిన్‌పింగ్‌కు పనులన్నీ సులువు అవుతాయి. కానీ మరోవైపు, తన ఆలోచనలు, తన సిద్ధాంతాలే ప్రతిధ్వనిస్తూ అక్కడే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది” అని పేరు తెలియజేయడానికి ఇష్టపడని ఒక బడా వ్యాపారవేత్త అన్నారు. ఈ నేపథ్యంలో, కొత్తగా ఎన్నికయే ప్రతినిధులు చైనాను ఎటు తీసుకెళతారు? ఒకవేళ కొత్తగా లీ కియాంగ్ కొత్త ప్రీమియర్ అయితే, ఆయన కెరీర్‌లో ఉల్కాలా దూసుకెళ్లినట్టేనన్న అంచనాలున్నాయి.

షాంఘై పార్టీ సెక్రటరీగా గత ఏడాది రెండు నెలల దారుణమైన లాక్‌డౌన్ నిర్వహణలో భాగం పంచుకున్నారు. అందుకే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో రెండో స్థానానికి ఎగబాకినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. లాక్‌డౌన్ విధించినందుకు కాదుగానీ, దాన్ని పేలవంగా నిర్వహించినందుకు అనేకమంది ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. బయటకు అడుగుపెట్టే వీలు లేదు. కేవలం డోర్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉంది. అందువల్ల లక్షలాది ప్రజలు సమయానికి ఆహారం, మందులు అందక ఇబ్బందిపడ్డారు. తీవ్ర ఆహార కొరత నెలకొంది. ఆ సమయంలో చైనా ప్రజలు తమ దుస్థితిని చూపిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. చివరికి, విసిగిపోయిన జనం తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి కంచెలు విరగ్గొట్టారు.

సెక్యూరిటీ గార్డులతో గొడవపడ్డారు. జీరో కోవిడ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితికి కారణమైన వ్యక్తికి ప్రీమియర్ పదవి ఎలా కట్టబెడతారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలో లి కియాంగ్‌కు కొంత మంచి పేరే ఉంది. పార్టీ కఠినత్వాన్ని బద్దలుగొట్టగలిగిన ధృడమైన వ్యక్తిగా వ్యాపారవేత్తలు ఆయన్ను పరిగణించేవారు. “ఆయన చాలా చురుకైన వ్యక్తి. మంచి నిర్వాహకుడు కూడా. కానీ, జిన్‌పింగ్ పట్ల విధేయత వల్లే ఆయనకు ప్రీమియర్ పదవి దక్కబోతోంది. జిన్‌పింగ్ ఆయన్ను కిందకు దూకమంటే, ‘ఎంత ఎత్తు నుంచి దూకాలి?’ అని లి కియాంగ్ అడుగుతారు. అలాంటి విధేయత ఉంది” అని చైనాలోని యూరోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జోర్గ్ వుట్కే అన్నారు. వుట్కే 1990ల నుంచీ చైనాలో వ్యాపారం చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలోని అగ్రనేతలతో ఆయనకు దీర్ఘకాల పరిచయం ఉంది.

Must Read

spot_img