Homeజాతీయంవంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ..?

వంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని విలక్షన నటుడు, ఆరు అడుగుల ఆజానుబాహుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈయన ఒక నటుడు మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా..హీరోగా ఎన్టీఆర్ జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహానటుడు ఎన్టీఆర్. సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన మహానుబావుడు ఎన్టీఆర్. ఏ పాత్ర చేసిన పాత్రకు దగ్గట్టుగా పాత్రలో జీవించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో రాముడు, కృష్టుడి వేసాదారణలో అందరిని అలరించడంతో పాటు నిజంగా దేవుడు అనే వాడు ఉంటే అచ్చం ఎన్టీఆర్ లాగే ఉంటారా అనే అనుమానం కలిగేలా ఒదిగిపోయిన మహానటుడు మన ఎన్టీఆర్. సినిమాలలోనే కాదు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మహోన్నత వ్యక్తి నందమూరి. అందరిని బ్రదర్ అని పిలూస్తూ…ప్రతి తెలుగింట పెద్ద కోడుకుగా మారిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్వర్గస్థులైన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత నందమూరి కుటుంబం రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు.

సినిమాలలో ప్రేక్షకులు తనను బాగా ఆదరించారని బావించి వారి రుణం తీర్చుకోవడానికి వారిని ఆర్థికంగా మరింత బలంగా మార్చడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేశారు ఎన్టీఆర్. రాజకీయాల్లో చిరస్మరణీయుడిగా మిగిలిన మచ్చలేని మహారాజు ఎన్టీఆర్ కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెల్లో ఇంకా సజీవంగానే ఉన్నారు. అటు సినీ రంగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్.. రాజకీయరంగంలో ఇంకెవ్వరికీ సాధ్యం కానీ విధంగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29న టీడీపీ జెండాను ఎగురవేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అని ప్రకటించి పార్టీ స్థాపించి 9 నెలలు తిరగకుండానే ఎంతో ఘన చరిత్ర ఉన్న అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరుగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.

తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. దక్షిణ దృవాల వంటి బీజేపీ కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేసిన ఘనుడు ఎన్టీఆర్. ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన సారథ్యంలోనే విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచింది. గత ఏడాది జూన్ లో ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కేంద్రానికి ఎన్టీఆర్ ఖ్యాతిగురించి దేశం మొత్తం తెలిసేలా ఇండియన్ కరెన్సీపై ఆయన చిత్రం ముద్రించాలని కోరింది. ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ శుభవార్త అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం విడుదలకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన బొమ్మతో వెయ్యి రూపాయల కాయిన్ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ రానుంది. కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించడానికి భారత ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఈ కాయిన్ పూర్తిగా వెండితో రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మింట్ అధికారులు దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి నమూనాను కూడా చూపించి అధికారుల సలహా కోరారుట. ఆమె కూడా పరిశీలించి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాశనం బయటకి రాబోతోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Must Read

spot_img