Homeసినిమాఆర్.. ఆర్. ఆర్.. అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుంధా..

ఆర్.. ఆర్. ఆర్.. అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుంధా..

ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే.. ప్రాంతీయ చిత్రాలుగా చిన్న చూపు ఉండేది.. దేశ, విదేశాల్లో గుర్తింపు తక్కువగా ఉండేది.. కానీ.. గత కొంతకాలంగా తెలుగు సినిమా తన హద్దులు చెరిపేసింది.. ఇతర రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో తన సత్తాను చాటుతున్నాయి.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ అవార్డులకు సైతం నామినేట్ అవుతున్నాయి..

ఆర్. ఆర్.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.. భారత్ లోనే అత్యంత భారీ విజయం సాధించిన చిత్రంగా నిలిచింది.. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డ్ పైనే కన్నేసింది.. అంతకంటే ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లో రెండు కేటగిరీల్లో నామినేట్ అయింది.. ఏంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్..?

కొడితే ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి…’ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు ఆ సినిమాకు హాలీవుడ్‌లో వస్తున్న అవార్డులు, నామినేషన్లు చూస్తుంటే.. అలాగే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా, ఇరవైకి పైగా సంస్థలకు సంబంధించిన ఫిలిం అవార్డులకు నామినేట్ అయింది. కొన్ని అవార్డులను గెలుచుకుంది కూడా. వాటిలో ఒకటైన గోల్డెన్ గ్లోబ్అv వార్డ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా బాగా పేరుంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు రెండు విభాగాల్లో నామినేట్ అయింది రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఒక తెలుగు సినిమాగా చూస్తే ఇదొక చరిత్ర. భారతీయ సినిమాగా చూస్తే ఒక రికార్డ్. ఈ అవార్డ్‌ను గెలుచుకుంటే అది మరొక చరిత్ర అవుతుంది.

భారతీయ సినిమాకు 1959లో తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. వి.శాంతారామ్ డైరెక్ట్ చేసిన ‘దో ఆంఖే బారా హాథ్ 1957లో తీసిన సినిమా, విదేశీ భాషా విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

ఆ తరువాత మహాత్మా గాంధీ జీవితం మీద 1982లో తీసిన గాంధీ సినిమాకు ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను నిర్మించిన సంస్థల్లో నేషనల్ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ఆ ఫ్ ఇండియా ఒకటి. 1988లో మీరానాయర్ తీసిన సలాం బాంబే, 2001లో మన్సూన్ వెడ్డింగ్ సినిమాలు విదేశీ భాషా విభాగంలో నామినేట్ అయ్యాయి.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయునిగా 2009లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నిలిచారు.

స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు ‘బెస్ట్ స్కోర్’ విభాగంలో ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది.

ఇక.. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించి ‘బెస్ట్ పిక్చర్: నాన్- ఇంగ్లిష్ లాంగ్వేజ్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. ఒకవేళ ‘బెస్ట్పి క్చర్’గా నిలిస్తే ఆ అవార్డును సొంతం చేసుకున్న మరొక భారతీయ సినిమాగా రికార్డును సృష్టిస్తుంది ఆర్ఆర్ఆర్. అలాగే తొలి తెలుగు సినిమాగా చరిత్రను లిఖిస్తుంది.

ఒకవేళ ‘బెస్ట్ స్కోర్’ విభాగంలో ఆర్ఆర్ఆర్ విజేతగా నిలిస్తే గోల్డెన్ గ్లోబ్‌ను ముద్దాడిన రెండో భారతీయునిగా ఎం.ఎం.కీరవాణి నిలుస్తారు.

‘నక్కినక్కి కాదే తొక్కుకుంటూ పోవాలే…’ అని కొమురం భీమ్ పాత్రలో హీరో చెప్పినట్లుగా మిగతా సినిమాలను వెనక్కి నెడుతూ ‘ఆర్ఆర్ఆర్’ ముందుకు పోతుందా..? ‘…హీ స్కేర్స్ మీ మోర్’ అని హాలీవుడ్ సినిమా చేత అనిపించుకుంటుందా…? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

అంతర్జాతీయంగా పేరున్న ఫిలిం అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ ఒకటి.

హాలీవుడ్‌లో పని చేసే కొందరు జర్నలిస్టులు 1943లో హాలీవుడ్ ఫారిన్ కరస్పాండెంట్స్ అసోసియేషన్‌ను స్థాపించారు.

గొప్ప సినిమాలు, టీవీ షోలు, నటులను గౌరవించేందుకు 1944లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను హెచ్‌ఎఫ్‌సీఏ స్థాపించింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి అవార్డులు ఇచ్చారు. నాటి నుంచి ప్రతి ఏడాది గోల్డెన్ గ్లోబ్అ వార్డ్స్‌ను ఇస్తూ వస్తున్నారు. హెచ్‌ఎఫ్‌సీఏ ఆ తరువాత హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ గా మారింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్సులు ఇస్తున్నారు. లాస్‌ఏంజలీస్‌లో పని చేసే ఎంటర్‌టైన్మెంట్ జర్నలిస్టులు హెచ్‌ఎఫ్‌‌పీఏలో సభ్యులుగా ఉంటారు. అయితే వీరు వివిధ దేశాల్లోని పత్రికలకు పని చేస్తుంటారు.

సినిమా అవార్డ్స్ లో ఆస్కార్, టీవీ అవార్డుల్లో ఎమ్సీ అవార్డ్స్.. తరువాత బాగా పేరున్న అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ఉత్తమ నటి, నటుడు, సినిమా, దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్ వంటి విభాగాల్లో అవార్డులు ఇస్తుంటారు. ఉత్తమ విదేశీ భాషా చిత్రాలు, యానిమేషన్ సినిమాల కేటగిరీలు కూడా ఉంటాయి. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ లోని యాక్టివ్, ఎమిరేటస్ సభ్యులకు మాత్రమే అవార్డుల ఎంపికలో పాల్గొంటారు.

ఓటింగ్ రెండు దశల్లో జరుగుతుంది. నామినేషన్ దశలో తొలి ఓటింగ్ జరగ్గా విజేతలను ఎంపిక చేసేందుకు తుది ఓటింగ్ నిర్వహిస్తారు.

ప్రతి ఒక్క ఓటరు ప్రతి కేటగిరిలోనూ ఎంట్రీల నుంచి అయిదు వరకు నామినేట్ చేయాల్సి ఉంటుంది. వాటికి ప్రాధాన్యత ప్రకారం నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతి విభాగంలో ఓట్లు ఎక్కువగా వచ్చిన తొలి అయిదు ఎంట్రీలను ప్రకటిస్తారు.

ఇలా ఎంపికైన నామినేషన్ల జాబితాను మళ్లీ ఓటర్లకు పంపిస్తారు. ఈసారి ప్రతి కేటగిరిలో ఒక్క నామినీకి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇలా అత్యధిక ఓట్లు వచ్చిన ఎంట్రీని విజేతగా ఎంపిక చేస్తారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక రోజు వరకు విజేతల జాబితాను రహస్యంగా ఉంచుతారు. సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబరులో నామినేట్ అయిన చిత్రాలు, నటుల జాబితాను ప్రకటిస్తారు. ఆ మరుసటి సంవత్సరం జనవరిలో అవార్డుల కార్యక్రమం ఉంటుంది. ఈసారి 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక వచ్చే సంవత్సరం జనవరి 10న జరగనుంది.

అంతర్జాతీయంగా పేరున్న ఫిలిం అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఒకటి.. అలాంటి అవార్డ్ కు రెండు కేటగిరిలలో నామినేట్ అయింది ఆర్. ఆర్. ఆర్.. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్.. ఆర్. ఆర్.. అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందో లేదో చూడాలి..

Must Read

spot_img