Homeసినిమాఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుల పంట..

ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుల పంట..

టాలీవుడ్ ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుల పంట పండించేందుకు సిద్ధం అయ్యింది. దర్శక ధీరుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విదేశాల్లోనూ రికార్డులను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో వున్న ఈ సినిమాకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. అయితే సినిమా ఈ సాంగ్ కోసం చిత్రయూనిట్ చాలానే కష్టపడింది.

మన నాటు నాటు కు అంతర్జాతీయ స్థాయి పురస్కారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. కీరవాణి సంగీతానికి.. రాజమౌళి టేకింగ్ తో పాటు ఇద్దరు హీరోల డాన్స్ ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా నాటు నాటు ను ఈ స్థాయికి తీసుకు వెళ్లాయి అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు నాటు నాటు అవార్డు దక్కించుకుంది కానీ.. ఆ పాట మేకింగ్ కోసం ఎంత కష్టం అయ్యిందో ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క ప్రమోషన్ సమయంలో హీరోలు, రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్దం జరుగుతున్న ఉక్రెయిన్ లో ఈ పాట ను చిత్రీకరించారు.

పాటలో కనిపించే ప్యాలస్ నిజమైనది.. ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసం. అక్కడ చిత్రీకరణకు అనుమతులు దక్కించుకుని చిత్రీకరణ కు చాలా కష్టాలు పడ్డామని ఆ సమయంలో రాజమౌళి పేర్కొన్నారు. ఇక ఈ పాటలోని హుక్ స్టెప్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఏకంగా 80 వర్షన్ లను రికార్డ్ చేశాడని.. చివరకు హీరోలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని స్టెప్స్ వేయడంను కన్ఫర్మ్ చేయడం జరిగింది.

ఇక ఈ పాటలో ఇద్దరు హీరోలు సింక్ అయ్యేలా స్టెప్స్ చేయడానికి.. దుమ్ము రావడానికి కూడా టేక్ ల మీద టేక్ లు తీసుకున్నారట. ఇద్దరు హీరోల యొక్క స్టెప్స్ సింక్ అయ్యేలా ఏకంగా 18 టేక్ లను తీసుకున్నట్లుగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ పాట సమయంలో రాజమౌళి పై కోపం వచ్చిందని కూడా సరదాగా ఎన్టీఆర్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు అంత కష్టం మర్చిపోయినట్లు అవుతుంది. కష్టానికి ప్రతిఫలం దక్కిందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Must Read

spot_img