Homeజాతీయంరోహింగ్యాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు: మయన్మార్ ఆర్మీ చీఫ్

రోహింగ్యాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు: మయన్మార్ ఆర్మీ చీఫ్

రోహింగ్యాల సమస్య బంగ్లాదేశ్ కు భారంగా మారింది. ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే కాదు..భారత్, పాకిస్తాన్ అటు మయన్మార్ దేశాలలోనూ వీరి రక్షణ బాధ్యతను తలకెక్కించుకోవడం కష్టంగానే మారింది. అందుకే రోహింగ్యాలను వదిలించేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. బంగ్లాదేశ్ అసలే ఆర్థిక సంక్షోభంతో సమస్యలు ఎదుర్కుంటోంది. ఈ సమయంలో రోహింగ్యాలను సంవత్సరాల తరబడి మేపడం కష్టంగానే ఉంది. దాంతో తమకు చెందిన ద్వీపాలలో వారికి పునరావాసం ఏర్పాటు చేసింది. కానీ అది ఎంతో కాలం ఇలా నిర్వహించడం కష్టంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పది సంవత్సరాలు గడచిపోయాయి. దాంతో ఇక రోహింగ్యాలు కూడా తమ భవిశ్యత్తును చావో రేవో కింద తేల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా కష్టతరమైన సముద్ర ప్రయాణాలు చేసి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు.

ఈ నేపథ్యంలో వారు ప్రయాణిస్తున్న పడవలు మునిగిపోతున్నాయి. అయితే రోహింగ్యా ముస్లింలతో వెళుతున్న ఈ పడవలు సముద్రం మధ్యలోనే మాయం అవుతున్నాయి. ఎందుకంటే వాటిలో రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పైగా వాటిని స్మగ్లర్లు చట్టవ్యతిరేక శక్తులు నడుపుతున్నాయి. పునరావాస కేంద్రాలలో పనిచేసి అంతో ఇంతో సంపాదించుకున్న డబ్బులు ఈ పడవ ప్రయాణాలకు ఖర్చు చేస్తున్నారు. చుట్టూ ఎటు చూసిన కనిపించని సమయంలో ఈ దొంగ ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. విపరీతమైన చలి, చుట్టూ ఎవరూ కనిపించని స్థితిలో వందల సంఖ్యలో ఈ పడవలు భారంగా కదులుతుంటాయి. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శిబిరాల్లో పదేళ్లుగా ఇలా అక్రమంగా దేశాలు దాటించే ముఠాలకు డబ్బులు ఇస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

వారి ఈ ప్రయత్నంలో వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారే లేరు. ఎందుకంటే వారి జాతీయత మయన్మార్ తో ఉండాల్సింది. కానీ మయన్మార్ లో ప్రస్తుతం సైన్యం ప్రభుత్వాన్న నడిపిస్తోంది. రోహింగ్యాలు తమ దేశ ప్రజలు కానే కారని వారు నిర్ద్వంద్వంగా చెప్పేసారు. మరి వారు ఏ దేశానికి చెందిన వారన్నది ఐక్యరాజ్యసమితి తేల్చాల్సి ఉంది. అయితే బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చనే పాలసీతో వారు ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. ప్రమాదకర మార్గాల్లో వెళ్లి మధ్యలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, వారి ఈ ప్రయత్నాలలో సక్సెస్ కూడా ఉంది. చాలామంది మలేసియాకు వెళ్లారు. ఇక్కడ జీవితం కన్నా అక్కడ ఏదో పనిచేసుకుంటూ బాగానే జీవిస్తున్నారు. ఈ కొద్ది మందిని ఉదాహరణగా తీసుకుని రోహింగ్యాలు తాము కూడా వారి బాటలో నడుస్తున్నారు.

2022లో ఇలా ప్రమాదకరంగా వెళ్లేందుకు ప్రయత్నించిన 348 మంది సముద్ర జలాల్లో మరణించారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. 2014 తర్వాత ఇంత ఎక్కువ మంది మరణించిన ఏడాది ఇదేనని వారంటున్నారు. బంగ్లాదేశ్‌లో వారి జీవితాలకు భరోసా లేదు. అక్కడ ఎటు నుంచి చూసినా ఉపాధి అవకాశాలు కూడా లేవు. ఎలాగోలా మలేసియాకు వెళ్లిన తర్వాత తమ జీవితం మారుతుందని రోహింగ్యాలు భావిస్తున్నారు. దశాబ్దాలుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్ లో జీవిస్తున్న రోహింగ్యా ముస్లింలను మళ్లీ వెనక్కి తీసుకునేందుకు వీరి సొంత రాష్ట్రమైన మియన్మార్ తిరస్కరిస్తోంది.2017లో రఖాయిన్ స్టేట్‌లో మియన్మార్ సైన్యం జరిపిన భారీ సైనిక చర్యను వారు మరచిపోలేకపోతున్నారు. అప్పట్లో ఐరాస దీన్ని ”ఊచకోత”గా కామెంట్ చేసింది.

అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో దాదాపు పది లక్షల మంది రోహింజ్యా ముస్లింలు జీవిస్తున్నారు. 4,400 డాలర్లు..అంటే మన కరెన్సీలో అయితే 3.64 లక్షల రూ.లు ఇచ్చే రోహంగ్యాలను బంగ్లాదేశ్ పునరావాస కేంద్రాల నుంచి మలేసియా తీసుకెళ్తామని అక్రమంగా దేశాలను దాటించే ముఠాలు ఆశలు పెడుతున్నాయి. ఇందుకోసం వారు నానా రకాలుగా కష్టపడుతున్నారు. దాచుకున్న బంగారాన్ని అమ్ముకుంటున్నారు. సముద్రాన్ని దాటేందుకు గత ఏడాది మొత్తంగా 3,500 రోహింజ్యా శరణార్థులు ప్రయత్నించారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ చెబుతోంది. రోహింగ్యాలు ప్రస్తుతం ఏ దేశానికీ చెందినవారు కాకపోవడంతోపాటు నేరస్థుల ముఠాల సాయంతో వెళ్లిన వారిని వెతికేందుకు వారి కుటుంబాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి.

Must Read

spot_img