Homeఅంతర్జాతీయం పిల్లలకు రోబో టీచర్ తో పాఠాలు.. ఎక్కడంటే?

 పిల్లలకు రోబో టీచర్ తో పాఠాలు.. ఎక్కడంటే?

రోబో ప్రతిరోజు పిల్లలకు క్లాసులు చెబుతుంది. పిల్లలంతా కూడా రోబో ముందు కూర్చొని మరమనిషి చెప్తున్న పాఠాలను ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఎవరైనా ఏదైనా విషయం అర్థం కానట్టైతే ఓపికగా తెలుసుకుంటుంది. ఆపై ఆ సందేహాన్ని మరింత ఓపికగా వివరిస్తుంది. ఉన్న చోటు నుంచే పెద్ద తెరపై వీడియో ప్రెజెంటేషన్ ద్వారా కూడా అర్థం అయ్యేలా చేస్తుంది.

క్లాసులోని పిల్లలందరి క్యూ ఆర్ కోడ్ లను రీడ్ చేయడం ద్వారా అందరినీ పేర్లతో పలకరించడం వీటికి సాధ్యం..అంతే కాదు..క్లాసులో చదువు పట్ల ఎవరు శ్రధ్ద చూపిస్తున్నారో కూడా కనిపెడుతుంది. వారికి రేటింగ్ కూడా ఇచ్చి తల్లిదండ్రుల మెప్పు పొందుతుంది. తక్కువ చదివే వారి గురించి స్కూల్ హెడ్ కు మాత్రమే తెలియజేసి వారి పట్ల ఏ రకమైన శ్రధ్ద తీసుకోవాలో సూచిస్తుంది. ఓ రోబో టీచర్ అవతారం ఎత్తిందంటే తనకు తెలియని సబ్జెక్టు అంటూ ఉండదు. క్షణాలలో దాని ఆపరేటర్ సూచనల మేరకు ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని క్లౌడ్ బ్యాంక్ నుంచి తనకు కావలసిన అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడూ జ్నానం పొందుతూ జ్నానాన్ని అలుపెరుగకుండా పంచే రోబోలంటే స్కూలు పిల్లలకు కూడా గౌరవం పెరుగుతోంది.

ప్రస్తుతం ఈ 21వ శతాబ్దంలో ఎక్కడ చూసినా టెక్నాలజీ యుగం నడుస్తోంది. ప్రతిరోజు కొత్త కొత్త స్మార్ట్ ఆవిష్కరణలు ముందుకు వస్తునే ఉన్నాయి. ఈ ఆవిశ్కారాల వెనుక ఉన్నది మరెవరో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..అంటే.. క్రుత్రిమ మేధ.. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ లేదా ‘ఏఐ’ ని ఉపయోగించని రంగం అంటూ లేదు. అన్నింటా ఈ కొత్త టెక్నాలజీ ప్రాధాన్యత విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు. దీనితో ఉత్పాదకత పెరిగి, ఎక్కువ మంది చేసే పనులను కూడా రోబో అతిసునాయసంగా ఒక్కతే చేసేస్తోంది. పైగా మనిషి తీసుకునే సమయం కన్నా చాలా తక్కువ సమయంలో చేసేస్తోంది. కొన్ని షోరూమ్ లు, హోటల్స్ లలో, ఇంట్లో కొన్ని పనులు చేయడానికి ఇప్పటికే ఆర్టిఫిషియల్ రోబోలను ఉపయోగిస్తున్నారు.

రోబో ప్రతిరోజు పిల్లలకు క్లాసులు చెబుతుంది. పిల్లలంతా కూడా రోబో ముందు కూర్చొని మరమనిషి చెప్తున్న పాఠాలను ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఎవరైనా ఏదైనా విషయం అర్థం కానట్టైతే ఓపికగా తెలుసుకుంటుంది. ఆపై ఆ సందేహాన్ని మరింత ఓపికగా వివరిస్తుంది. ఉన్న చోటు నుంచే పెద్ద తెరపై వీడియో ప్రెజెంటేషన్ ద్వారా కూడా అర్థం అయ్యేలా చేస్తుంది. క్లాసులోని పిల్లలందరి క్యూ ఆర్ కోడ్ లను రీడ్ చేయడం ద్వారా అందరినీ పేర్లతో పలకరించడం వీటికి సాధ్యం..అంతే కాదు..క్లాసులో చదువు పట్ల ఎవరు శ్రధ్ద చూపిస్తున్నారో కూడా కనిపెడుతుంది. వారికి రేటింగ్ కూడా ఇచ్చి తల్లిదండ్రుల మెప్పు పొందుతుంది. తక్కువ చదివే వారి గురించి స్కూల్ హెడ్ కు మాత్రమే తెలియజేసి వారి పట్ల ఏ రకమైన శ్రధ్ద తీసుకోవాలో సూచిస్తుంది. ఓ రోబో టీచర్ అవతారం ఎత్తిందంటే తనకు తెలియని సబ్జెక్టు అంటూ ఉండదు.

క్షణాలలో దాని ఆపరేటర్ సూచనల మేరకు ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని క్లౌడ్ బ్యాంక్ నుంచి తనకు కావలసిన అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడూ జ్నానం పొందుతూ జ్నానాన్ని అలుపెరుగకుండా పంచే రోబోలంటే స్కూలు పిల్లలకు కూడా గౌరవం పెరుగుతోంది. ప్రస్తుతం ఈ 21వ శతాబ్దంలో ఎక్కడ చూసినా టెక్నాలజీ యుగం నడుస్తోంది. ప్రతిరోజు కొత్త కొత్త స్మార్ట్ ఆవిష్కరణలు ముందుకు వస్తునే ఉన్నాయి. ఈ ఆవిశ్కారాల వెనుక ఉన్నది మరెవరో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..అంటే.. క్రుత్రిమ మేధ.. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ లేదా ‘ఏఐ’ ని ఉపయోగించని రంగం అంటూ లేదు. అన్నింటా ఈ కొత్త టెక్నాలజీ ప్రాధాన్యత విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు. దీనితో ఉత్పాదకత పెరిగి, ఎక్కువ మంది చేసే పనులను కూడా రోబో అతిసునాయసంగా ఒక్కతే చేసేస్తోంది. పైగా మనిషి తీసుకునే సమయం కన్నా చాలా తక్కువ సమయంలో చేసేస్తోంది. కొన్ని షోరూమ్ లు, హోటల్స్ లలో, ఇంట్లో కొన్ని పనులు చేయడానికి ఇప్పటికే ఆర్టిఫిషియల్ రోబోలను ఉపయోగిస్తున్నారు.

ఇటు హైదరాబాద్ స్కూల్లోనూ అలాంటి ప్రయోగమే జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్లో రోబోలు టీచర్లుగా పాఠాలు చెబుతున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఒకటి కన్నా ఎక్కువ రోబోలను టీచర్లుగా ఏర్పాటుచేసింది ఈ ప్రైవేటు స్కూల్. మనుషులు చేసే పనులన్నింటినీ రోబోలు చకచకా చేసేస్తున్నాయి. మనుషులతో మాట్లాడుతున్నాయి. వారడిగే ప్రశ్నలను అర్థం చేసుకుని క్షణాలలో సమాధానాలు కూడా చెబుతున్నాయి. అయితే.. రోబోలు మనుషులు చేసే పనులన్నీ చేసేస్తే ఇక మనిషి ఉద్యోగ, ఉపాధులు తగ్గిపోతాయా? అంటే నిజమేనేమో అనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని హోటల్స్ లో కస్టమర్లు ఆర్డర్ చేసిన వంటకాలను రోబోల ద్వారా సర్వ్ చేయించి వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి.

టెక్నాలజీ డెవలప్ మెంట్ కొత్తలో ఇదో ప్రయోగం అనుకున్నాం..కానీ సర్వర్ల పొట్టకొట్టినట్లేనని అనుకోవచ్చు. అవే రోబోలు పిల్లలకు పాఠాలు చెప్పేస్తే ఇక టీచర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఎదురవుతుంది. అంతే కాదు అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. ఓ వ్యక్తి టీచర్ కావాలంటే అందుకు తగిన శిక్షణ బీఎడ్ డిగ్రీలు అవసరమవుతాయి. అవేవీ లేకుండానే సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయగానే అనర్గలంగా పాఠాలు చెబుతున్న రోబోలను చూస్తే టీచర్ల భవిశ్యత్తుపై అనుమానం వేయకుండా ఉండదు. హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వెళితే క్లాసురూముల్లో రోబోలు పలకరిస్తాయి. పక్కన టీచర్ కూడా ఉంటారు. విద్యార్థులు అడిగే సందేహాలను రోబో తీరుస్తుంది. కృత్రిమ మేధ సాయంతో ఈ రోబోలు టీచర్ గా మారాయి. హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లోనూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలను రంగంలోకి దింపింది. ఐదు నుంచి 11వ క్లాసులకు ఈ రోబోలు పాఠాలు చెబుతాయి. 30కు పైగా భాషల్లో ఇవి పాఠాలు చెప్పగలవు. అంతేకాదు విద్యార్థులకు వచ్చే డౌట్స్ ని కూడా చక్కగా క్లియర్ చేస్తాయి. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్ టాప్ ల నుంచి యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది.

కొందరు నిపుణులు ఏమంటున్నారంటే 2027కల్లా దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇన్ స్ట్రక్టర్ల స్థానంలో రోబోట్లే ఉండబోతోన్నాయి. మరి కొందరేమో రోబోలు టీచర్లకు ప్రత్యమ్నాయంగా నిలవలేవని వాదిస్తున్నారు. ఎందుకంటే అవి మనుషుల్లా విద్యార్థులకు స్పూర్తిదాయకంగా ఉండలేవని అంటున్నారు. కానీ నేటి 21 వ శతాబ్దంలో..అది కూడా చాట్ జీపీటీ రానున్న సమయంలో రోబోల శక్తి అనంతంగా పెరిగిపోనుంది.

ఏ తరగతి విద్యార్థులకు ఎలా కావాలో ఎంత సాఫ్ట్ గా ఉండాలో ఎంత కఠినంగా ఉండాలో ఆ మాదిరిగా టెయిలర్ మేడ్ రోబోలు రావడం తధ్యం..అంతే కాదు..ఇప్పటి వరకు మనం చూసినవి అచ్చం బొమ్మల్లా క్రుత్రిమంగా కనిపిస్తాయి. కానీ రాబోయే రోజులలో వచ్చే రోబోలు మనుషులకు తీసిపోకుండా ఉంటాయి. రోబోటిక్స్ ఎలాగైతే అభివ్రుద్ది చెందుతోందో అదే మాదిరగా వాటిలో షార్ప్ నెస్ కూడా పెరుగుతోంది. లేటెస్ట్ టెక్నాలజీలను కలబోసుకుని వచ్చే రోబోలు మనుషుల ఉద్యోగాలను కొల్లగడతాయనడంలో అనుమానం లేదు. ఇప్పుడు వాటికి ఏఐ టెక్నాలజీలు, చాట్ జీపీటీ, 5జీ టెక్నాలజీలు తోడవుతున్నాయి. ఎక్కడా తడుముకోకుండా ఎప్పటికప్పుడు వాటంతటవే అప్డేట్ అవుతుంటాయి.

ఒక్కో రోబోట్ కనీసం వంద భాషలపై పట్టుండేలా చేయడం చాలా ఈజీగా జరిగిపోతుంది. అయితే పిల్లలను మనుషులతో దూరం చేయడం యంత్రాలకు దగ్గరయ్యేలా చేయడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఇంకా తేలాల్సిన అంశంగా ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో ఈ విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి నివేదికలు ప్రపంచానికి అందనున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అసలే అవసరం లేకుండా కార్లు, బైకులు తయారవుతున్నాయి. దీంతో నిరుద్యోగ సమస్య ఎదురవుతోంది. యజమానులు ఒకటే ఆలోచిస్తున్నారు. ఈ విధంగా మరమనుషులను ఏర్పాటు చేసుకుంటే వారికి జీతాలు ఇవ్వనవసరం ఉండదు. కేవలం ఒక్కసారి జరిగే ఖర్చు మాత్రమే భరించాలి. ఆపై కేవలం సాఫ్ట్ వేర్, విద్యుత్తు ఖర్చులు మాత్రమే చూసుకోవాలి. మరమనుషులు అలుపన్నదే లేకుండా 24 గంటలూ, 365 రోజులూ పనిచేస్తాయి.

సమ్మెలు ఆందోళనలు ప్రమాదాలు జరగడం అన్నవి ఉండవు. ఇచ్చిన ఆదేశాలను తూ చా తప్పకుండా పాటిస్తాయి. అదే కదా మాకు కావలసింది అంటున్నారు కార్పోరేటు యజమానులు.

Must Read

spot_img