Homeఅంతర్జాతీయంUN జనరల్ అసెంబ్లీ యొక్క తీర్మానం..?

UN జనరల్ అసెంబ్లీ యొక్క తీర్మానం..?

ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని ముగించాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి.. అయినప్పటికీ… రష్యా మాత్రం యుద్దం చేస్తూనే ఉంది.. తాజాగా రష్యా యుద్దాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది..

  • ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలకాలని, వెంటనే రష్యా బలగాలు అక్కడి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలెన్ని..?
  • వ్యతిరేకంగా ఏయే దేశాలు ఓటు వేశాయి..? ఈ తీర్మానంలో భారత్ వైఖరి ఏంటి..?

ఉక్రెయిన్​పై యుద్ధాన్ని ముగించాలని డిమాండ్​ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్​ అసెంబ్లీ తీర్మానించింది. ఈ విషయంలో భారత్​ మాత్రం మరోసారి తటస్థ వైఖరి కొనసాగించి.. ఓటింగ్​కు దూరంగా ఉంది. ఈ ఓటింగ్​లో 141 దేశాలు మాస్కో దురాక్రమణను వెంటనే ముగింపు పలకాలని కోరాయి. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలకాలని, వెంటనే రష్యా బలగాలు అక్కడి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. 193 సభ్యదేశాలు ఉన్న జనరల్‌ అసెంబ్లీలో.. 141 దేశాలు తీర్మానానికి అనుకూలంగానూ, 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్‌, చైనా సహా మరో 30 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఈ సమావేశంలో ప్రసంగించిన చైనా రాయబారి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగేందుకు తాము మద్ధతునిస్తామని పేర్కొన్నారు. ఈ యుద్ధం విషయంలో బాధ్యుడిని, బాధితుడిని సమానంగా చూడలేమని.. ఐరోపా సమాఖ్య విదేశాంగ శాఖ చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ తెలిపారు.

ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. శాంతికి దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గమని పేర్కొంది. జనరల్​ అసెంబ్లీలో ప్రసంగించిన.. భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ భద్రతా మండలి ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు.

దీంతో పాటుగా తాము ఎల్లప్పుడూ శాంతికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గమని అన్నారు. ఈ సమావేశం ఏర్పాటు వెనుకున్న లక్ష్యాలను తాము పరిగణలోకి తీసుకుంటున్నామని వెల్లడించారు. శాశ్వత శాంతిని భద్రపరచాలనే ఉద్దేశంతోనే తాము ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఇది యుద్ధయగం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేసిన కంబోజ్ .. మనుషుల ప్రాణాలను పణంగా పెడితే సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం దొరకదన్నారు.

“భారత్ బహుపాక్షికతకు స్థిరంగా కట్టుబడి ఉంది. యూఎన్ చార్టర్ యొక్క సూత్రాలను సమర్థిస్తుంది. మేము ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన మార్గంగా భావిస్తాం. ఈ రోజు తీర్మానం పేర్కొన్న లక్ష్యాన్ని మేము గమనించాము, అయితే మన లక్ష్యాన్ని చేరుకోవడంలో దాని స్వాభావిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటాము. శాశ్వత శాంతిని సాధించాలనే లక్ష్యంతో మేము దూరంగా ఉండవలసి ఉంటుంది” అని భారత ప్రథినిధి కాంబోజ్ స్పష్టం చేశారు..

ఉక్రెయిన్​ యుద్ధభూమి నుంచి రష్యా బలగాలు వెనుదిరగడానికి ఇదే అనువైన సమయం అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్​ అన్నారు. ‘ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి సంవత్సరం ముగిసింది. అంతర్జాతీయ సమాజానికి ఇదో భయంకరమైన మైలురాయిగా నిలిస్తుంది. రష్యా ఐక్యరాజ్యసమితి చార్టర్​ చట్టాలను ఉల్లంఘిస్తుంది’ అని గుటెర్రస్ అన్నారు. ఈ సమావేశంలో 75కు పైగా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, దౌత్యవేత్తలు ప్రసంగించారు. భారతదేశం ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి చార్టర్​ చట్టాలను భారత్​ గౌరవిస్తుందని పునరుద్ఘాటించారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు తీరని నష్టం కలుగుతుందని… దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ సమస్యలతో కష్టపడుతున్న దేశాల పక్షాన భారత్​ ఉంటుందని వెల్లడించారు. ఉక్రెయిన్​లో మౌలిక సదుపాయాలపై రష్యా ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తుందని తెలిపారు జైశంకర్..

ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుతో ఐక్యరాజ్యసమితి తీర్మానం గురించి గత మంగళవారం… తమ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ… భారత్ జాతీయ ప్రయోజనల దృష్ట్యా ఈ ఓటింగ్ కు దూరంగా ఉంది. భారత్, రష్యాకు ఎప్పటి నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రవేశవెట్టిన తీర్మానానికి కూడా భారత్ దూరంగా ఉంది.

  • రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కాల్పుల విరమణ జరగాలని చైనా పిలుపునిచ్చింది..

శాంతి చర్చలను ప్రారంభించిన చైనా.. వివాదాన్ని ముగించడానికి 12 అంశాలను ప్రతిపాదించింది. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా తటస్థంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పశ్చిమ దేశాలే వివాదాన్ని రెచ్చగొట్టాయని ఆరోపించింది. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తొలిగించాలని, పౌరులను తరలించడానికి కారిడార్‌లు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా ధాన్యం ఎగుమతులపై ఏర్పడిన అంతరాయలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇది ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు కావాలని పేర్కొంది.

ఈ తరుణంలో ఈ యుద్ధం విరమించేలా 12 పాయింట్ల సమగ్ర నివేదిక ఇచ్చింది చైనా. యుద్ధం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిందని.. వేల మంది మరణించారని, మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని చైనా సదరు నివేదిక ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేసింది. పనిలో పనిగా.. అగ్రరాజ్యంపైనా చైనా ఆగ్రహం వెల్లగక్కింది. యుద్ధం తీవ్రత పెరిగేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా కారణమయ్యాయని నివేదికలో చైనా విమర్శలు గుప్పించింది.

అయితే తాము మాత్రం ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు చైనా తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని నొక్కి చెప్పింది చైనా. పనిలో పనిగా.. అగ్రరాజ్యంపైనా చైనా ఆగ్రహం వెల్లగక్కింది. యుద్ధం తీవ్రత పెరిగేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా కారణమయ్యాయని నివేదికలో చైనా విమర్శలు గుప్పించింది. అయితే తాము మాత్రం ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు చైనా తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని నొక్కి చెప్పింది చైనా.

అంతేగాదు ఆ 12 పాయింట్‌ పొజిషన్‌ పేపర్‌లో..”అణ్వాయుధాలను ఉపయోగించకూడదు, అలాగే అణుయుద్ధాలను చేయకూడదు, బెదిరింపులకు పాల్పడకూడదు. ఏ దేశమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన, జీవ ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, వినియోగాన్ని వ్యతిరేకించాలి” అని చైనా తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చైనా నివేదికపై ఉక్రెయిన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనాలోని ఉక్రెయిన్‌ రాయబారి ఇదొక శుభపరిణామంటూ పేర్కొన్నారు. అలాగే.. రష్యాపై చైనా ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉక్రెయిన్‌లో శత్రుత్వానికి ముగింపు పలకాలని, తన బలగాలను ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మాన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.

Must Read

spot_img