Homeఅంతర్జాతీయంతగ్గిన జీవిత కాలం.. మానవ అభివృద్ధి సూచిక..!

తగ్గిన జీవిత కాలం.. మానవ అభివృద్ధి సూచిక..!

కొంతకాలం క్రితం మనిసి ఆయుర్దాయం పెరిగిందన్న ఓ వార్త జనానికి ఊరట కలిగించింది. ఎందుకంటే పెరిగిన టెక్నాలజీలు, వైద్య సౌకర్యాలు మెరుగైన కారణంగా మనిషి ఆయుర్దాయం నిజంగానే గణనీయంగా పెరిగింది. ఇంతకన్నా పెరగడం అసాధ్యమనీ, ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు పరిశోధనలు ఆపివేస్తే బెటర్ అని అల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. కానీ అంతలోనే మరో వార్త కలకలం స్రుష్టించింది.

మనిషి ఆయుర్దాయం ఇంతకన్నా పెరిగే అవకాశం లేదని అల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ బ్రుందం నిర్వహించిన తాజా ఆధ్యయనం చెబుతోంది. జీవించే ప్రమాణం ఇప్పటికే పీక్స్ కు చేరిందని ఇంకా జీవితకాలాన్ని పెంచేందుకు చేసే ప్రయత్నాలు రీసెర్చ్ చేయడం వ్రుధాయేనని ఈ ఆధ్యయనం తేల్చి చెప్పింది. జీవిత కాలాన్ని పెంచడం కన్నా వ్రుద్దాప్యం ఆరోగ్యంగా గడిచేందుకు కావలసిన పరిస్తితులు స్రుష్టించుకోవడం బెటర్ అని పరిశోధకులు చెబుతున్నారు.

కానీ ఈ రెండు సంవత్సరాలుగా మరో విషయం బయటకు వచ్చింది. అదేంటో తెలుసా.. మనిషి సరాసరి ఆయుర్ధాయం మళ్లీ తగ్గిపోతోంది. అయితే అది రెండున్నరేళ్ల క్రితం మానవాళిపై విరుచుకుపడిన కరోనా కారణంగానే జరుగుతోందా అన్న అనుమానాలు వెలువడుతున్నాయి.

గత రెండున్నరేళ్లుగా పరిశీలిస్తే మనిషి సరాసరి ఆయుర్దాయం తగ్గుతోంది., ఇది షాకింగ్ న్యూస్ అనే అనుకోవచ్చు. మరి పరిస్థితి ఇలాగే ఉంటే.. రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆయుర్దాయం, విద్య, ఆర్థికాభివృద్ధి అంశాల్లో దశాబ్దాలుగా సాధించిన ప్రగతి కరోనా మహమ్మారి తరువాత తిరుగుముఖం పట్టిందని ఐక్యరాజ్య సమితి అప్పట్లోనే సూచించింది.

గత రెండున్నరేళ్లల్లో పదింట తొమ్మిది దేశాలు ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచికలో వెనక్కి జారిపోయాయి. ప్రపంచాభివృద్ధి తిరుగుబాట పట్టడానికి ప్రధాన కారణాలు కోవిడ్ 19, యుక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పుల ప్రభావాలని చెబుతున్నారు. అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ను ప్రారంభించారు.

మానవ అభివృద్ధి సూచిక అనబడే ఈ ఇండెక్స్ లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది.

అక్కడ 84 సంవత్సరాల ఆయుర్దాయం నమోదైంది, ప్రస్తుతం ఈ దేశం లైఫ్ స్పాన్ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఈ సూచికకు మరో వైపు దక్షిణ సూడాన్ ఉంది. అక్కడ కేవలం 55 సంవత్సరాల యావరేజ్ ఆయుర్దాయం ఉంటుంది. అంటే సగటున కేవలం 5.5 సంవత్సరాల సగటు ఆయుర్దాయంతో అట్టడుగున ఉంది. ఈ సూచికలో భాగమైన 191 దేశాలలో చాలావరకు 2016లో చూసిన అభివృద్ధి స్థాయిలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఆయుర్దాయంలో గణనీయమైన తరుగుదల కనిపిస్తోంది. 30 ఏళ్ల ట్రెండ్ రివర్స్ అవుతోంది. ఉదాహరణకు, అమెరికాలో 2019 నుంచి బిడ్డ పుట్టినప్పటి ఆయుర్దాయం రెండేళ్ల కంటే ఎక్కువ తగ్గిపోయింది.

మానవ అభివృద్ధి సూచికను ప్రారంభించినప్పటి నుంచి, చాలా దేశాలు ఒడిదుడుకులు, సంక్షోభాలు ఎదుర్కున్నాయిగానీ, ప్రపంచాభివృద్ధి స్థిరంగా పైకి కదిలింది. కానీ, గత ఏడాది, తొలిసారిగా ప్రపంచం మొత్తంగా ఈ సూచిక అధోముఖం పట్టింది. ఈ ఏడాది గణాంకాలు చూస్తే ఇదే ధోరణి కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే, కరోనా వైరస్, యుక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పుల ప్రభావాలు అన్ని దేశాలపై ఒకేలా లేవు.

మూడింట రెండొంతుల సంపన్న దేశాలు గత ఏడాది పుంజుకోగా, మిగిలిన దేశాలు చాలావరకు క్షీణిస్తూనే ఉన్నాయి. 2021 నాటి డేటా ఆధారంగా ఈ ఏడాది సూచిక రూపొందిస్తారు. “2022వ సంవత్సరం ధోరణి ఆందోళనకరంగానే ఉంది” అని అచిమ్ స్టైనర్ అన్నారు. స్టైనర్, యూఎన్ నివేదిక రూపొందించిన బృందంలో ఉన్నారు.

దాదాపు 80 దేశాలు సంక్షోభం అంచున ఉండడం చాలా తీవ్రమైన విషయం. పోను పోను అనేక సమస్యలు ఎదురయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం రాబోయే కొన్నేళ్లల్లో కనిపిస్తుందని అంటున్నారు పరిశోధకులు. యుధ్దాలు, ఆర్థిక సంక్షోభం, విద్యుత్ సంక్షోభం, ఆహార కరవు, నీటి కరవు, ప్రక్రుతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, వైరస్ మహమ్మారుల విజ్రుంభన..ఇలా ఒక్కటేమిటి అనేక సమస్యలు ప్రజాజీవితంపై ప్రభావం చూపించనున్నాయి.

ఈ ప్రభావమే మనిషి ఆయుర్దాయంపై కూడా పడనుందని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఏ అంశం తీసుకున్నా కరోనాకు ముందు కరోనా తరువాత అన్న లెక్కలు చూడటం పరిపాటిగా మారింది. కరోనా ప్రభావం ప్రపంచంపై అంతగా పడిందనడంలో సందేహం లేదు.

Must Read

spot_img