Homeఅంతర్జాతీయంభారత్ తో శాంతి చర్చలకు సిద్ధం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..

భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..

భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కొద్దిరోజుల క్రిందట ప్రకటించారు. ఈ నేపథ్యంలో మే నెలలో జరిగే షాంఘై భేటీకి రావాల్సిందిగా భారత్ .. పాక్ కు ఆహ్వానం పంపింది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాకున్నా.. పాక్ నిర్ణయం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

ఈ దఫా షాంఘై భేటీ భారత్ లో నిర్వహించనుండడంతో.. దీనికి హాజరవ్వాలని కేంద్రం .. పాక్ కు ఆహ్వానం పంపింది. అయితే దీనిపై పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో షాంఘై భేటీకి పాకిస్తాన్ వస్తుందో, రాదోనన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.

  • తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం పాకిస్తాన్ ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది..

తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ ను ఆదుకోవాలని కోరారు. భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో భారత్ కూడా ఆయన విజ్ఞప్తిని మన్నించేలా కనిపిస్తోంది. ఈ ఏడాది మేనెలలో గోవాలో జరిగే అత్యున్నత స్ధాయి షాంఘై సహకార సమాఖ్య (SCO) సదస్సుకు పాక్ ప్రధాని షెహబాజ్
షరీఫ్ ను అధికారికంగా ఆహ్వానించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

భారత్, చైనాతో పాటు ఉపఖండపు దేశాలు పాల్గొనే ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధానిని కూడా ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌లకు గోవాలో జరిగే ఎస్‌సిఓ సదస్సుకు సంబంధించిన ఆహ్వానాలను అందజేశారు. అయితే మిగతా దేశాలతో పాటు మాత్రమే పాకిస్తాన్ ను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

యితే ఈ సదస్సుకు పాక్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో, చైనా విదేశాంగమంత్రి క్విన్ గ్యాంగ్ హాజరవుతారో లేదో ఇంకా తేలలేదు. ఒకవేళ పాకిస్థాన్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్ణయించుకుంటే, 2011 తర్వాత ఇస్లామాబాద్ నుంచి భారత్‌కు వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఆ ఏడాది భారత్‌లో పర్యటించారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేయడంతో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇరుదేశాలూ ఒకే వేదికపై ఎలాంటి భేటీలు కావడం కానీ, హాజరు కావడం కానీ చేయలేదు.

తాజాగా మారిన పరిస్ధితుల్లో పాకిస్తాన్ భారత్ వైపు చూస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాలుగా సత్సంబంధాలు లేని పొరుగు దేశం పాకిస్తాన్ కు భారత్ ఆహ్వానం పంపించింది. మే నెలలో భారత్ లో జరిగే ఒక సదస్సులో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ మంత్రిని భారత్ ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో భారత్, పాకిస్తాన్ ల మధ్య సత్సంబంధాలు నెలకొనే దిశగా మరో అడుగు పడినట్లు తెలుస్తోంది.

మూడు యుద్ధాల అనంతరం గుణ పాఠం నేర్చుకున్నామని, భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం, పొరుగుదేశం పాకిస్తాన్ .. మంత్రిని భారత్ లో జరిగే ఒక సదస్సుకు భారత్ ఆహ్వానించినట్లు సమాచారం. భారత్ లో ఈ మే నెలలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది.

ఈ SCO సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్లో కు ఆహ్వానం పంపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్తున్నాయి. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను అనాగరిక వ్యాఖ్యలంటూ అక్కడే భారత బృందం ఘాటుగా సమాధానమిచ్చింది.

తాజాగా, భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై బిలావల్ భుట్లో ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ఆహ్వానం నిజమే అయి, ఆ ఆహ్వానాన్ని మన్నించి భుట్టో భారత్ కు వస్తే, 12 ఏళ్ల తరువాత భారత్ లో పర్యటిస్తున్న పాక్ విదేశాంగ మంత్రిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు. అయితే, SCO సదస్సుకు పాక్ మంత్రి బిలావల్ భుట్లోను ఆహ్వానించినట్లు ఇప్పటివరకు అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ విషయమై పాక్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.

  • కానీ ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ ఈ ఆహ్వానం పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కు అందజేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

SCO లో చైనా, భారత్, రష్యా, పాకిస్తాన్ తో పాటు మరో నాలుగు మధ్య ఆసియా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. శత్రు దేశాన్ని సైతం క్షమించే గుణం భారత్ ది. మనల్ని దెబ్బకొట్టాలని చూసే దేశాలను కూడా ఇండియా అక్కున చేర్చుకుంటుంది. దాయాది దేశంపై తన దయా గుణాన్ని భారత్ మరోసారి నిరూపించుకుంది. మరి కొద్ది నెలల్లో పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి, చీఫ్‌ జస్టిస్‌ భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.

త్వరలో నిర్వహించే షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా భారత్‌ వారికి ఆహ్వానాలు పంపింది. అయితే, వారి నుంచి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. ఎస్‌సీఓలో భారత్‌తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్‌, కజికిస్తాన్‌, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తో కలిపి 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో భారతదేశం ఎస్‌సీఓ రొటేటింగ్ ప్రెసిడెన్సీని పొందింది.

దాంతో ఈ ఏడాది మన దేశంలో షాంఘై సమ్మిట్‌ జరుపుతుంది. ఈ ఏడాది మార్చి, మే నెలలో షాంఘై సమ్మిట్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు భారత్‌ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ ఆటా బండియాలకు భారత్‌ ఆహ్వానం పంపింది. అయితే, భారత్‌ ఆహ్వానాన్ని పాకిస్తాన్‌ ఇంకా అంగీకరించాల్సి ఉంది.

మార్చి నెలలో ఎస్‌సీఓ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, మే నెలలో విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. విదేశాంగ మంత్రుల సమావేశాన్ని గోవాలో జరిపేందుకు భారత్‌ ఏర్పాట్లు చేస్తోంది.

  • భారత్‌ ఆహ్వానాన్ని పాకిస్తాన్‌ ఆమోదిస్తే.. చాలా ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు భారత్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది..

భారతదేశం పంపిన ఆహ్వానాన్ని పాకిస్తాన్ అధికారులు కూడా ద్రువీకరించారు. ఐతే వారు రాకపోతే వారి ప్రతినిధులను పంపే అవకాశాలు ఉన్నట్లు భారత అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ వారు వచ్చినా రాకున్నా భారత్ కు కలిగే నష్టం ఏం లేదు. వారు ఈ సమ్మిట్ కు హాజరైతే పాకిస్థాన్ కే లాభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్‌. జైశంకర్ .. పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టోకు అధికారికంగా ఆహ్వానం పంపినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

అయితే, ఇప్పటికే చైనా, పాక్‌లతో సంబంధాల విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్లు హాజరవుతారా.. లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పాకిస్తాన్‌కు సంబంధించి ఆ దేశ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి.. ఎవరు హాజరైనా అది చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఇండియా
నిర్వహించబోయే ఎస్‌సీఓ సదస్సుపై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం షాంఘై సహకార సంస్థ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్.. ఈ ఏడాది సమావేశాలను గోవాలో మే 4,5 తేదీల్లో నిర్వహించనుంది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక అధికారాలను ఉపసంహరించుకోవడం, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు భారత్ ప్రకటించిన తర్వాత సంబంధాలు మరింత క్షీణించాయి. అయితే మే నెలలో గోవాలో జరగనున్న ఎస్‌సీఓ సదస్సుకు పాకిస్తాన్‌ హాజరవుతుందా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నిర్ణయం ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

షాంఘై భేటీకి పాకిస్తాన్ గనుక భారత్ కు తరలి వస్తే, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చిగురించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై పాక్ నిర్ణయం కోసం ఎదురుచూడక తప్పదన్న వాదన సైతం వినిపిస్తోంది.

Must Read

spot_img