దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇటీవల రెడ్, ది వారియర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అవి అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. అయితే తాజాగా రామ్ పోతినేని అరుదైన రికార్డ్ సాధించాడు. ఏ హీరో కూడా సాధించలేని ఘనత సాధించాడి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.
లవర్ బాయ్ గా ముద్ర వేసుకున్న టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల రామ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కానీ రామ్ పోతినేని సినిమాలకు హిందీలో మాత్రం అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ రామ్ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోకున్న హిందీలో మాత్రం అదిరిపోయే వ్యూస్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి.
సినిమాల్లో రామ్ పోతినేని బాగా పర్ఫామెన్స్ చూపించినప్పటికీ తెలుగులో అనుకున్నంత హిట్ కాలేదు. కానీ హిందీలో డబ్ చేసిన తర్వాత ఆ సినిమాలకు రికార్డ్ బ్రేక్ చేసే లెవెల్లో వ్యూస్ ఉంటున్నాయి. సౌత్ లోనే అత్యధికంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక హీరోగా రామ్ నిలిచాడు. అది కూడా ఒకటి రెండు సినిమాలు కాదు ఏకంగా 7 సినిమాలు 100 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు రామ్ పోతినేని.
తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన రామ్ పోతినేని చిత్రం ది వారియర్. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ కృతీ శెట్టి హీరోయిన్ గా అలరించింది. అలాగే పవర్ ఫుల్ విలన్ గా గురు పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రామ్ ది వారియర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ హిందీలో డబ్ అయిన ఈ చిత్రం 100 మిలియన్ వ్యూస్ సాధించింది.
ది వారియర్ చిత్రమే కాకుండా అంతకుముందు విడుదలైన ఇస్మార్ట్ శంకర్, హైపర్, హలో గురు ప్రేమ కోసమే, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, గణేష్ చిత్రాలు హిందీలో డబ్ కాగా యూట్యూబ్ లో దాదాపుగా 100 మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేశాయి.
దీన్ని బట్టి చూస్తే మరే సౌత్ హీరోకు హిందీలో లేని రెస్పాన్స్ రామ్ పోతినేనికి ఉందని చెప్పవచ్చు. ఇలా రామ్ సినిమాలంటే హిందీ ప్రేక్షకులు ఎగబడుతుండటం చూస్తుంటే అక్కడ థియేటర్స్ లో విడుదల చేస్తే ఇంకా రెస్పాన్స్ అదిరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
రామ్ పోతినేని, మహానటి మొదటి సినిమా నేను శైలజ తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్ చేసేలా ఉంది. అలాగే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మాస్ హీరోగా రామ్ తన స్టైల్ చూపించన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మాస్ ఆడియెన్స్ ఎంటర్టైన్ చేసింది.