HomeEntertainmentబాబాయ్ బాటలోనే…. అబ్బాయ్..

బాబాయ్ బాటలోనే…. అబ్బాయ్..

తెలుగు ఇండస్ట్రీలో మోగా ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు తెర మీదనే కాదు…నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నారు. ఆపదలో ఉన్న అభిమానుల కోరిక తీర్చి వారికి మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అభిమానుల ఫై తన ప్రేమను కురిపిస్తూ వారికి అండగా నిలిచాడు. కేన్సర్‌తో బాధపడుతున్న అభిమాని కోరిక తీర్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తాజాగా మెగా వారసుడు మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తనయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాటలో నడిచే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన అభిమానిని పలకరించి అతనిలో ఆత్మ స్టైర్యం నింపారు. రామ్‌చరణ్‌ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్‌ హీరో అని మరో సారీ ప్రూవ్‌ చేసుకున్నాడు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారి చివరి కొరిక తీర్చి ఉదారతను చాటుకున్నాడు. తొమ్మిదేళ్ల మణి కుశాల్ చరణ్‌కు వీరాభిమాని. గత కొన్ని రోజులుగా ఈ చిన్నారి క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాదులోని స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా జీవితంలో ఒక్కసారైనా రామ్ చరణ్ ను కలవాలని తనతో మాట్లాడాలని ఉందని ఆ చిన్నారి తన కోరికను తల్లిదండ్రులకు తెలిపాడు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా రామ్ చరణ్‌కు ఆ చిన్నారి పరిస్థితిని వివరించారు.

ప్రస్తుతం రామ్ చరణ్ హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ విషయం మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారు తెలియడంతో షూటింగ్ కు తాత్కాలిక విరామం ఇచ్చి హుటాహుటినా అభిమాని వద్దకు తరలి వెళ్లారు. తీవ్రమైన మహామ్మారితో బాధపడుతున్న చిన్నారిని రామ్ చరణ్ స్వయంగా వచ్చి పలకరించాడు. అక్కడి వైద్యులను అడిగి అభిమాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడమే కాకుండా చాలా సేపు అభిమానితో సరదాగా గడిపి పిల్నాడితో సెల్పీలు దిగారు. అతనికో బహుమతి కూడా అందజేసాడు. అంతేకాదు ఆ పిల్లాడి కళ్లల్లో ఆనందం కోసం రామ్ చరణ్ నవ్వించే ప్రయత్నం చేసాడు. తన అభిమాన హీరో రాకతో ఆ పిల్లాడిలో ఎంతో ఎనర్జీ వచ్చింది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు మణి కౌషల్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇప్పుడు నెట్టింట ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్ మ‌న‌సు చాలా మంచిద‌ని .. బిజీ షెడ్యూల్‌లోనూ అభిమానిని క‌ల‌వ‌టానికి వెళ్లటం గొప్ప ప‌ని అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. రీల్ హీరో కాదు… రియల్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Must Read

spot_img