ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు ఓకే చేప్పినట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాడు. ఆ సినిమా యూనివర్సల్ గా రామ్ చరణ్ కి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన సాంగ్స్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది.
శంకర్ మూవీ తర్వాత నెక్స్ట్ సినిమాని రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ఉంటుంది. ఇక దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇక కన్నడంలో మఫ్టీ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ నార్తన్ తో కూడా రామ్ చరణ్ 17వ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఉంటుందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. దీంతో పాటు సుకుమార్ యూనివర్స్ లో పుష్ప తరహాలోనే రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా కూడా కన్ఫర్మ్ అయిపొయింది. అయితే పుష్ప షూటింగ్ తర్వాత దాని గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రామ్ చరణ్ 18వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇలా వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలని RC15 తర్వాత రామ్ చరణ్ లైన్ లో పెట్టడం విశేషం. ఈ సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో పవర్ ఫుల్ సబ్జెక్ట్ లతోనే తెరకెక్కుతూ ఉండటం విశేషం.