రాఖీ సావంత్.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా నిలిచిన నటి. బాలీవుడ్ నటిగా, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా ఓ రేంజ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి. కానీ ఎంత క్రేజ్ సంపాదించుకుందో అంతే వైరల్ గా మారింది. గతేడాది అదిల్ దురానీని పెళ్లాడిన ఆమె ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నెట్టింట్లో వారి పెళ్లి ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ప్రేమించి పెళ్లి చేసుకోని హాయిగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న లక్కీ ముద్దుగుమ్మ అంటూ సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. కానీ ఏం లాభం వారి దాంపత్య జీవితం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తన అభిమానులకు సిని ఇండస్ట్రికి పెద్ద షాక్ ఇచ్చింది. తన భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడని, అతడికి మరో అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా అదిల్ తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇదంతా భాగానే ఉన్న ఇటీవల వారి వివాదంలో మరో ట్విస్ట్ వినిపిస్తోంది. రాఖీ సావంత్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తన భర్త గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అదిల్ తనను చిత్రహింసలు పెట్టేవాడని అతన్ని హీరోగా చేయమని టార్చర్ పెడుతూ…కొట్టేవాడని వెల్లడించింది. సమాజంలో అందరికి తన గురించి గొప్పలు చెప్పమని హింసించేవాడని వాపోయింది. తన తల్లి చావుకు కారణం కూడా అతనేనని…మానసికంగా హింసించడం వల్లనే అది చూసి తట్టుకోలేక బాధతో చని పోయిందని చెప్పింది. తనకు తన భర్త కారు, బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చానని గొప్పలు చెప్పమనేవాడని తెలిపింది.
ఒకవేళ అలా చెప్పకపోతే నన్ను పెళ్లి చేసుకోనని, నాకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించాడని అందుకే అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపింది. వేరే అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకుని, ఆ వీడియోలు నాకు పంపిస్తానని తనను బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలింది. వాటిని చూసి నేను గుండెపోటుతో చావాలని కోరుకున్నాడు. అతడికి వ్యతిరేకంగా వెళ్తే ఎవరికైనా సుఫారీ ఇచ్చి నన్ను ట్రక్కుతో గుద్దిచ్చి చంపుతానన్నాడు. అదిల్‌కు ఆల్‌రెడీ పెళ్లయింది, విడాకులు కూడా అయ్యాయి. ఆ విషయం నా దగ్గర దాచిపెట్టి మోసం చేశాడు. అతడికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి. నన్ను దారుణంగా మోసం చేశాడు. జీవచ్ఛవంలా బతికున్నాను’ అని విలపించింది రాఖీ సావంత్.