Homeసినిమాగాసిప్స్రాజమౌళి మూవీస్ రిజెక్ట్ చేసిన స్టార్స్

రాజమౌళి మూవీస్ రిజెక్ట్ చేసిన స్టార్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు.. ఆయన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దర్శకులలో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు.

అలాంటి దర్శకుడు ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఆఫర్ల కోసం ఎంతోమంది నటీనటులు ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో ఏ చిన్న క్యారెక్టర్ దొరికిన వదులుకోరు. అలాంటి దర్శక ధీరుడు జక్కన్న ఆఫరిస్తే రిజెక్ట్ చేసిన హీరో, హీరోయిన్స్ టాలీవుడ్ లో చాలానే ఉన్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి బాలకృష్ణకు దర్శక ధీరుడు జక్కన్న మగధీర కథను ముందుగా వినిపించారట. కానీ ఆయన ఏవో కారణాల వల్ల రిజెక్టు చేశారని తెలుస్తోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ఎంతటి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు.

అయితే ఈ సినిమాలో ముందుగా కాజల్ ను తీసుకుందామని భావించారట దర్శకుడు. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఒప్పుకోలేదట పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జక్కన్న చేతిలో పడి ఈ స్టేజ్ కి వచ్చారు. అయితే ముందుగా ఎన్టీఆర్ చేసిన సింహాద్రి మూవీ ప్రభాస్ ని అడిగారట. కానీ ఆయనకు సెట్ కాదని వదిలేసారట..

బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు.. చిత్రంలో కట్టప్ప పాత్రకు ముందుగా అమితాబచ్చన్ అనుకున్నారట. కానీ ఆయన ఏవో కారణాలవల్ల చేయలేకపోయారట. జాన్ అబ్రహంను బాహుబలి సినిమాలో బల్లాలదేవుని పాత్ర వరించిందట.

కానీ ఆయన కూడా రిజెక్ట్ చేశారట. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంతటి ఆదరణ అందుకుందో మనందరికీ తెలుసు. ఈ పాత్ర ముందుగా అలనాటి నటి శ్రీదేవికి వెళ్ళిందట.. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో రమ్యకృష్ణ కు అదృష్టం కలిసి వచ్చింది.

విక్రమార్కుడు సినిమా ద్వారా రవితేజ ఎంతటి సంచలన విజయన్ని అందుకున్నారో మనకు తెలుసు. ముందుగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిందట. కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో రిజెక్ట్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయనందుకుందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో ఒలీవియా మోరిస్ జెన్ని క్యారెక్టర్ కోసం ముందుగా శ్రద్ధ కపూర్ ను సంప్రదించారట. కానీ ఆమె రిజెక్ట్ చేసిందట.

Must Read

spot_img