HomeEntertainmentరాజమౌళి హీరోయిన్ ఇలా అయ్యిందేంటి..?

రాజమౌళి హీరోయిన్ ఇలా అయ్యిందేంటి..?

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళికి టాలెంట్ ఉన్న వాళ్లను గుర్తించి వారు ఎక్కడున్న పిలిచి సినిమా అవకాశాలు ఇవ్వడం అలవాటు. ఆ అలవాటు ప్రకారమే చాలా మంది హీరోయిన్ లకు మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు. అయితే ఆ అవకాశాలు అందరూ వినియోగించుకోరు. ఆ కోవకు చెందిన హీరోయిన్ సలోని. డైరెక్టర్ రాజమౌళి మగధీర సినిమా తర్వాత సునీల్‌ హీరోగా సలోని హీరోయిన్‌గా మర్యాద రామన్న సినిమాను తెరకెక్కించారు. సినిమా వచ్చి పన్నెండేళ్లు దాటి పోయింది. కానీ సినిమాలో నటించిన అందాల ముద్దుగుమ్మ సలోని మాత్రం ఆ తర్వాత సినీ రంగలో అంతగా రాణించలేకపోయింది.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ చాలా త‌క్కువ ఉంటుంది. ఒకటి రెండు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ఘ‌కాలం హీరోయిన్ లుగా రాణించాలంటే అది జ‌రిగే ప‌ని కాదు. అనుష్క‌, న‌య‌న‌తార, కాజోల్, సమంత లాంటి ఒక‌రిద్ద‌రు హీరోయిన్లు మినహా చాలా మంది హీరోయిన్లు కొంత కాలం మాత్రమే ఇండస్ట్రీలో నిలదోక్కుకున్నారు. మ‌హా అయితే ఐదారేళ్లు మాత్ర‌మే ఫీల్డ్‌లో ఉండి తర్వాత అవుట్ ఫేమ్ లోకి వెళ్లిపోయారు. ఇక స‌మంత పెళ్లి త‌ర్వాత విడాకులు తీసుకుని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నా మునుప‌టి అంత ఫామ్‌లో ఆమె లేదు. శ్రీయ విషయానికి వస్తే చాలా ఏళ్లుగా అవకాశాలు రాకా ఐటమ్ సాంగ్స్ లో ఏంట్రీలు ఇచ్చింది. ఇప్పుడు ఆమెకు అంత క్రేజ్ కూడా లేదు.

ఇక సినిమాల్లో ఛాన్సులు త‌గ్గిపోయాక హీరోయిన్ల ఫిజిక్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఎక్కువ కాలం హీరోయిన్లు సినిమాల్లో ఉండాలంటే వారి అందంతో పాటు ఫిజిక్ కూడా మెంయిటెన్ చేయ్యాలి. ఒళ్లు లావెక్క‌కూడ‌దు. చూడ‌డానికి స్లిమ్‌గా ఉండాలి. కొంద‌రు చాలా త‌క్కువ టైంలో ఒక‌టి రెండు సినిమాల‌తో పాపుల‌ర్ అయిపోతారు. త‌ర్వాత అడ్ర‌స్ ఉండ‌రు.

వీరంతా పెద్ద హీరోయిన్ల కోవకు చెందిన వారు. కానీ సలోనీ చిన్న చిన్న సినిమాలు చేసుకునే టైంలో ఏకంగా రాజ‌మౌళి పిలిచి మ‌రీ త‌న మ‌ర్యాద రామ‌న్న సినిమాలో సునీల్ ప‌క్క‌న హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. రాజ‌మౌళి పిలిచి ఛాన్స్ ఇవ్వ‌డం అంటే స‌లోనీ న‌క్క తోకి తొక్కేసింద‌ని.. ఆమెకు తిరుగు ఉండ‌ద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు సినిమాలు చేసి ఆమె క‌నుమ‌రుగు అయిపోయింది.

తాజాగా సలోనీ హైద‌రాబాద్‌లోని ఓ జ్యూవెల్ల‌రీ ర్యాంప్ షోలో క‌నిపించింది. ఆమెను చూసిన అభిమానులు షాక్ అయ్యారు. అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు. స‌లోనీ టాలీవుడ్‌లో చేసింది త‌క్కువ సినిమాలే అయినా..తెలుగు అమ్మాయి సాంగ్ తో అందరి మనులో ముద్ర వేసుకుంది. అస్స‌లు ఇప్పుడు స‌లోనీని ఏ మాత్రం గుర్తు ప‌ట్ట‌లేనంత బొద్దుగా మారిపోయింది.

Must Read

spot_img