రాజమౌళి తర్వాతి సినిమా మహేష్ బాబుతో అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ ప్రాజెక్ట్ గురించి అమెరికా నుంచి మొదలు పెట్టి అన్నిచోట్లా చెప్పారు జక్కన్న. మరి సూపర్ స్టార్ సినిమా తర్వాత దర్శక ధీరుడి ప్లాన్ ఏంటి..? మహేష్ర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారు..? అసలు మహేష్ మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటి..? అదెలా ఉండబోతుంది..? ఆ తర్వాతి సినిమా నేపథ్యమేంటి..?
![](https://inewslive.net/wp-content/uploads/2022/12/mahi-684x1024.jpg)
రాజమౌళి తర్వాత సినిమా ఏంటనే విషయంపై ఎవరికి అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే ఈయన తర్వాత సినిమా మహేష్ బాబుతో ఉంటుందని చాలా సంవత్సరాల కిందే క్లారిటీ వచ్చింది. నిజానికి పదేళ్లుగా కేవలం చర్చల దశలో ఉన్న ఈ సినిమా.. ఇన్ని సంవత్సరాల తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత మహేష్ బాబు, రాజమౌళి సినిమా మొదలు కాబోతుంది.
ఈ సినిమా కోసం ఆఫ్రికన్ నేపథ్యం తీసుకుంటున్నాడు రాజమౌళి. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయింది. ఇందులో ఒక ట్రావెలర్ పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేయని పాత్ర ఇది. దానికి తోడు రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కూడా. ఎందుకంటే ఎలాంటి ఎమోషన్స్ లేని ఒక ట్రావెలర్ పాత్ర మహేష్ బాబు ఇందులో చేయబోతున్నాడు.
ఇలాంటి రిస్కీ క్యారెక్టర్ ఎంచుకోవడం నటుడిగా మహేష్ కు ఎంత సాహసమో.. దాన్ని స్క్రీన్ మీద చూపించడం రాజమౌళికి కూడా అంతే సాహసంతో కూడుకున్న పని. దీనికోసం అమెరికన్ టెక్నీషియన్స్ ని ఎక్కువగా నమ్ముకుంటున్నాడు రాజమౌళి. దాంతోపాటు పూర్తిగా హాలీవుడ్ యాక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నాడు. పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా ఇది రాబోతుంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో మహేష్ బాబు రాజమౌళి సినిమా ఉండబోతుంది.
సీనియర్ నిర్మాత కెల్ నారాయణ నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అని వినిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరి కోసం ఒక ఐడియా కూడా సిద్ధం చేసి పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఒక్కసారి మహేష్ బాబు సినిమా అయిపోయిందంటే.. వెంటనే ఈ మల్టీస్టారర్ గురించి పూర్తిస్థాయి కదా సిద్ధం చేయడానికి రాజమౌళి అండ్ టీం రెడీ అయిపోతున్నారు. ఇటు ఎన్టీఆర్.. అటు ప్రభాస్ తో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గా రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరితో ఒక పాన్ వరల్డ్ మల్టీస్టారర్ చేయాలనేది రాజమౌళి ఆలోచన.
ఆల్రెడీ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఎన్టీఆర్, ప్రభాస్ తో సినిమా చేస్తే అంతకు మించిన సంచలనం మరొకటి ఉండదు. దానికోసం అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.