Homeఅంతర్జాతీయంరష్యా అధ్యక్షుడు తన ఆరు పదుల వయసులో ప్రేమాయణం..?

రష్యా అధ్యక్షుడు తన ఆరు పదుల వయసులో ప్రేమాయణం..?

ఉక్రెయిన్ పై యుధ్దంతో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు తన ఆరు పదుల వయసులో ప్రేమాయణం నిర్వహిస్తున్నారు. తాజాగా 1000 కోట్ల విలువైన ఇంద్రభవంలో తన గర్ల్ ఫ్రెండ్ కబయేవాతో ఎంజాయ్ చేస్తున్నారు పుతిన్. విదేశీ మీడియా నివేదికల ప్రకారం..రష్యా అధ్యక్షుడు మాస్కోకు వాయువ్యంగా ఉన్న భారీ రాజభవన గృహంలో రహస్యంగా తన స్నేహితురాలు జిమ్నాస్ట్ అలీనా కబయేవాతో కలసి నివసిస్తున్నారు. వారి వెంట పిల్లలు కూడా ఆ విలాసవంతమైన ప్యాలెస్‌లో నివసిస్తున్నట్లు తేలింది. పుతిన్ గర్ల్ ఫ్రెండ్ ముప్పై తొమ్మదేళ్ల అలీనా కబయేవా వ్రుత్తిపరంగా ఓ జిమ్నాస్ట్. ఆమె మాజీ ఒలింపిక్ ఛాంపియన్. పుతిన్ గర్ల్ ఫ్రెండ్ గా చాలా కాలంగా చర్చలో ఉంది, ఇప్పుడు నేరుగా పుతిన్ కొత్త ఇంట్లో ఉండడం వల్ల మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యన్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ సైట్ ‘ది ప్రాజెక్ట్’ ప్రచురించిన నివేదిక ప్రకారం పుతిన్ తన జిమ్నాస్ట్ స్నేహితురాలు అలీనా కబయేవాతో రహస్యంగా నివసిస్తున్నారు. పుతిన్ స్లష్ ఫండ్ ద్వారా ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం 2020లో ప్రారంభమై రెండేళ్లలో పూర్తయిందని నివేదిక తెలిపింది.

ఇది పూర్తిగా రష్యన్ డాచా తరహాలో నిర్మించబడింది. సదరు నివేదిక ప్రకారం, ఈ లేక్‌సైడ్ రహస్య ప్రదేశానికి చేరుకోవడానికి ఒక ప్రైవేట్ సాయుధ రైలు కూడా ఉంది. ఈ కారణంగా, అతని నివాసానికి సమీపంలో ఒక రహస్య, కాపలా స్టేషన్ కూడా నిర్మించబడింది. ప్రాజెక్ట్ రైలు స్టేషన్‌లను చూపించే ఇంటి ఉపగ్రహ చిత్రాలను కూడా విడుదల చేసింది. ఇందులో ఓ భారీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇందులో పుతిన్ పిల్లలతో పాటు, అలీనా కబయేవా బంధువులు కూడా ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇదీ పుతిన్ జీవితం.. ప్రపంచం మొత్తం ఒకవైపు..ఆయనొక్కడు ఒకవైపు అన్నట్టుగానే పుతిన్ కనబడుతుంటారు..వయసు ఆరుపదులు దాటినా చురుకుగా కనిపిస్తారు. ఎవరెన్ని చెప్పినా తాననుకున్నదే చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు తెలియనివారెవరూ ఉండకపోవచ్చు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రెండో ఏడులోకి ప్రవేశించిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితం, అలవాట్లు.. లాంటి విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్‌ థగ్ లైఫ్‌కు సంబంధించిన అంశాలు మొదటి నుంచీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వయసులో కూడా ఓ ప్రేయసిని మెయింటెయిన్ చేస్తూన్నారు వ్లదిమిర్ పుతిన్. అయితే గత రెండు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగా లేదనీ, మహా అంటే మరో కొన్ని నెలలు మాత్రమే బతుకుతారని పుకార్లు షికారు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే పుతిన్ తన రహస్య స్నేహితురాలు అలీనాతో ఉంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. పుతిన్‌ తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్‌గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్‌ చూపిస్తోంది. భార్య ల్యూడ్మిలాతో 1983లో వ్లాదిమిర్‌ పుతిన్‌ వివాహం జరిగింది. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు.

అయితే పలు కారణాలతో 2014లో ల్యూడ్మిలా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు పుతిన్‌. ఆపై రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్‌ మాజీ భార్య వెండి డెంగ్‌తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్‌ డేటింగ్‌ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. అయితే ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనాతో పుతిన్‌ వైవాహిక బంధం చెడిపోవడానికి కారణం కూడా అలీనా అని పుతిన్‌ సన్నిహితులు చెబుతున్నారు. 2008 నుంచే అలీనాకు పుతిన్‌తో పరిచయం ఉందని, వాళ్ల డేటింగ్‌ వ్యవహారం తెలిసే ల్యూడ్మిలా మనసు విరిగి విడాకులు తీసుకుందని వారు చెబుతున్నారు. అప్పటి నుంచి సీక్రెట్‌ ఫస్ట్‌లేడీగా అలీనా కబయేవా కొనసాగుతోంది.
1983లో తాష్కెంట్‌లో పుట్టిపెరిగిన అలీనా.. రిథమిక్‌ జిమ్నాస్ట్‌. పదిహేనేళ్ల వయసులో పోర్చుగల్‌లో జరిగిన యూరోపిన్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అలీనా బ్రాంజ్‌ మెడలిస్ట్‌ కూడా. నాలుగేళ్ల తర్వాత గ్రీస్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కూడా గెలుచుకుంది. ఇప్పటిదాకా తన కెరీర్‌లో ఆమె రెండు ఒలింపిక్స్‌ మెడల్స్‌, 14సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్‌, 21 యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ మెడల్స్‌ గెల్చుకున్నారు.

వైవాహిక జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌..సీక్రెట్‌ ప్రేయసిని మాత్రం అపురూపంగా చూసుకుంటారని చెబుతున్నారు విశ్లేషకులు. పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యక్తిగత ప్రశ్నలను దాటేసే పుతిన్‌.. తనకూ ఓ వ్యక్తిగత జీవితం ఉందని, దాని గురించి ప్రస్తావించిడం ఇష్టం లేదని, దానిని గౌరవిస్తే బాగుంటుందని మీడియాకు చురకలు అంటిస్తుంటారు. యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుండడంతో కొంత కాలం క్రితం తన ఈ సీక్రెట్ కుటుంబాన్ని అణుబంకర్లలో దాచి పెట్టారు. అలీనా కబయేవాతో తనకు జన్మించిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు.

స్విస్ కొండల్లో అత్యంత సురక్షితమైన, రహస్యమైన ప్రాంతాల్లో వారు భద్రంగా ఉన్నట్లు ఆ కథనాల సారాంశం. అయితే వారిప్పుడు కొత్త భవనంలో పుతిన్ సమేతంగా ఉన్నట్టు సమాచారం. ఎన్ని సమస్యలున్నా తనను మాత్రం తక్కువ చేసుకోడానికి పుతిన్ ఇష్టపడరు..దేశం ఏమై పోయినా తాననుకున్నది సాధించాలనే చూస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్‌ పుతిన్, 64 ఏళ్ల వయస్సులో కూడా బలిష్టంగా కనిపిస్తారు. అందుకు కారణం ఆయన రోజు వ్యాయామం ఒక్కటే కారణం కాదట. ఆయన తరచుగా దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తారట. అలా చేయడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు, నడుము, కీళ్లు బలంగా తయారవడమే కాకుండా లైంగిక పటుత్వ శక్తి గణనీయంగా పెరుగుతుందట. దష్టి, వినికిడి శక్తి కూడా పెరుగుతుందట. అందుకే పుతిన్‌ తరచుగా రష్యాలోని అల్తాయ్‌ పర్వత ప్రాంతాలకు వెళుతుంటారని చెబుతున్నారు.

ఇటీవల ఆయన అక్కడికి వెళ్లినప్పుడు అధికారులు 70 కిలోల దుప్పి కొమ్ములను విరిచి అందులో నుంచి రక్తం తీసి స్నానానికి సిద్ధం చేశారట. అందులో పుతిన్‌ తనువుతీర జలకాలాడారట. ఈ విషయాలను స్థానిక పత్రిక ‘రిపబ్లిక్‌’ వెల్లడించింది. దుప్పి, ముఖ్యంగా మరల్‌ లేదా రెడ్‌ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంలో స్నానం చేస్తే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని, వయస్సు అంత తొందరగా మీద పడదనే నమ్మకం రష్యాలో ప్రాచీనకాలం నుంచి ఉంది. మనిషిలో లైంగిక పటుత్వాన్ని పెంచే ‘టెస్టోస్టెరేన్‌’ దుప్పి రక్తం వల్ల పెరిగుతుందని నమ్మి, వాటి రక్తంలో మునిగి స్నానం చేసే వారు ఇప్పటికీ రష్యాలో ఎంతో మంది ఉన్నారు.

ప్రత్యర్థులను ఆనవాళ్లు కూడా లేకుండా చేయడంలో పుతిన్ సిధ్దహస్తుడు. అత్యంత విశ్వసనీయ వ్యక్తులను తనకోసం నియమించుకుంటారు. కిరాతకుల్లాంటి వాల్లను తన భద్రత కోసం వినియోగించుకుంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై దండయాత్ర తలకు మించిన భారంగా మారుతున్నా దాడుల తీవ్రత తగ్గించని తలబిరుసుతనం ఆయన సొంతం.. మీకు తెలుసా..ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. టెస్లా యజమాని ఎలన్ మస్క్, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ కంటే పుతిన్‌కు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నప్పటికీ.. యుద్ధం మొదలై రెండేళ్లకు చేరుకున్నా పుతిన్ పట్టించుకోవడం లేదు. పుతిన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నప్పటికీ.. యుద్ధం మొదలుపెట్టిన పుతిన్ మాత్రం పట్టించుకోవడం లేదు.

త్వరలోనే ఉక్రెయిన్ పై దండయాత్ర, యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ అది పుతిన్ ను ఏమాత్రం కదిలించదు. ఆయనకు రష్యాలోనే అనేక ఇళ్లు, పడవలు, లగ్జరీ కార్లు, సురక్షితమైన ప్యాలెస్‌లు ఉన్నాయి. పుతిన్ వద్ద 4 విలాసవంతమైన పడవలు, 43 విమానాలు, వందలాది కార్లు, 15 హెలికాప్టర్లు ఉన్నాయి. న్యూస్‌వీక్ 2018 నివేదిక ప్రకారం.. పుతిన్ కార్లశ్రేణిలో 192 మిలియన్ డాలర్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ లిమోసిన్ కూడా ఉంది. పుతిన్ ఖరీదైన గడియారాలను కూడా ఇష్టపడతారు. ప్రస్తుతం జైలులో ఉన్న ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ బృందం.. పుతిన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తుంటారు. కానీ పుతిన్ సేనలు వాటిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుంటారు. పుతిన్ తన జెట్ విమానా‌లలోని ఒకదానిలో తన కోసం బంగారు టాయిలెట్ కూడా నిర్మించుకున్నట్టు చెబుతారు. వీటన్నింటినీ చూస్తే పుతిన్ ఓ థగ్ గా ఎదిగారు. దాదాగిరీని ఆసరాగా చేసుకున్నారు. అదే పద్దతిని నేటి ఉక్రెయిన్ మీద నాటో సహా అమెరికాపైన కూడా ప్రదర్శిస్తున్నారు.

Must Read

spot_img