చిరు సాయంతో సల్మాన్ తో మూవీ కోసం పూరీ ప్రయత్నం ?

మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటారు కదా… ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి అలానే ఉంది. పాపం ఒక దాన్నించి కోలుకునేలోపే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. లైగర్ డిజాస్టర్, డిస్ట్రిబ్యూటర్ల పంచాయతీ, జనగణమన సినిమాకి బ్రేక్ పడటం ఇలా పూరీ 2022 కెరీయర్ మొత్తం గందరగోళంలోకి వెళ్లింది. ఇలాంటి టైమ్ లో పూరీ ఫ్యాన్స్ కి బూస్ట్ ఇచ్చే న్యూస్ ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం…

పూరీ నెక్ట్స్ సినిమా చేస్తాడా…?


తాను ఒకటి తలిస్తే… ప్రేక్షకుడు మరొకటి ఇచ్చాడు. పూరీ విషయంలో ఇదే జరిగింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత…ఎన్నో అంచనాల మధ్య తీసిన లైగర్ డిజాస్టర్ నిలిచింది. దీంతో పూరీ కెరీయర్ మొత్తం డ్యామేజ్ అయింది. అసలు పూరీ నెక్ట్స్ సినిమా చేస్తాడా…? లేదా అన్న డౌట్స్ వస్తున్నాయి సగటు ప్రేక్షకుడికి. లైగర్ తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ వేద్దామనుకున్న పూరీ జగన్నాథ్ కు నిరాశే ఎదురైంది. ఇక ఏమంటూ ఈ సినిమా చేశారో కాని ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయినా కూడా వివాదాలు వదిలి పెట్టడం లేదు.

రీసెంట్ గా లైగర్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కోసం ఛార్మీ, పూరీ జగన్నాథ్ ను పిలిచి విచారించారు. ప్రస్తుతం హోటల్ లో కూర్చొని కథలు రాసుకుంటున్న పూరీ జగన్నాథ్ ఛాన్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మాస్ మహరాజ్ రవితేజ ఛాన్స్ ఇచ్చి నట్లు ప్రచారం జరిగింది కాని అధికారిక ప్రకటన లేదు. ఇక చిరంజీవి పరిచయం ద్వారా సల్మాన్ ఖాన్ ను బుట్టలో వేయాలని చూస్తున్నాడు. చిరంజీవిని సల్మాన్ ఖాన్ సినిమా కోసం సహాయం చేయవలసిందిగా కోరాడన్నది తాజా ఫిల్మ్ నగర్ సమాచారం.
సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక చిరంజివి రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేసి.. తనకు చెప్పిన ఆటో జాని కథ గురించి చెబుతూ….పూరి జగన్నాథ్ దగ్గర ఓ అద్బుతమైన కథ ఉందని చెప్పారట.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేసిన ఆ కథ సల్మాన్ కు సెట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ దీనికి వెంటనే ఒకే చెప్పని సల్మాన్ ఖాన్ టైమ్ తీసుకొని ఆలోచించి చెప్తాను అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.