Homeతెలంగాణతెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరగనుందా..? బండి స్థానంలోకి ఈటల రానున్నారా..?

తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరగనుందా..? బండి స్థానంలోకి ఈటల రానున్నారా..?

తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని.. ఆయన స్థానంలో మాజీమంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నియమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో ఇది నిజమేనేమో అనేంతగా చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈటల రాజేందర్ కోరడం..

కొద్దిరోజుల క్రితం ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో మాట్లాడటం వంటి అంశాలు కూడా ఈ వార్తలకు ఊతమిచ్చాయి. అయితే తాజాగా ఈ ఊహాగానాలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెక్ చెప్పారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టీమ్‌తోనే ఎన్నికలకు వెళతామని అన్నారు.తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు లేరనే అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్నికలు వస్తే బీజేపీకి ప్రజలే అభ్యర్థులను ఇస్తారని అన్నారు.తమకు నాయకత్వ సమస్య లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ బీజేపీలో మార్పులపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ బండి సంజయ్ సారథ్యంలోనే ఎదుర్కోనుందనే విషయంలో దాదాపుగా స్పష్టత వచ్చింది. ఇక తెలంగాణ బీజేపీలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఈటల రాజేందర్‌కు బండి సంజయ్‌కు మధ్య అంతగా సఖ్యత లేదని.. ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పార్టీలో చేరికల కమిటీకి కన్వీనర్‌గా ఉన్న ఈటల రాజేందర్.. పార్టీలోకి నాయకులను తీసుకురావడంలో అంతగా సక్సెస్ కావడం లేదనే చర్చ కూడా ఉంది.

తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలన్నీ తెలిసిన ఈటెల రాజేందర్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగడతాడని కేంద్ర బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ కు ధీటైన సమాధానం చెప్పాలంటే తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెలకు అప్పగించడం తప్పదని తెలుస్తోంది.

తెలంగాణలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. వారిని పార్టీ వైపు మళ్లించేందుకు ఈటెల రాజేందర్ కు పెద్దపీట వేయనున్నారు. తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం భారీగా ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కు బీజేపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని పెద్దల వ్యూహంగా ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇంత వరకు గెలవని 90 సీట్లలో బీజేపీ ఎంపీలను గెలిపించుకునేందుకు ఆపరేషన్ 2024 చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు.

టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా ఈటల ఓ వెలుగు వెలిగారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఆయన ఆర్థిక శాఖా మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తరవాత కేసీఆర్ తో ఈటెలకు చెడింది.దీంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు సవాల్ విసిరి మరీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణలో దొరలను ఎదుర్కొనేందుకు బీజేపీ బీసీ బాణం వదిలిందనే చెప్పాలి. అందుకు ఈటెల రాజేందర్ సరైన సమయంలో బీజేపీకి అందివచ్చారు. మరోవైపు బండి సంజయ్ బీఆర్ఎస్ ను ఎదుర్కోవడంతో వెనుకబడిపోతున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమికి కూడా బండి సంజయ్ చేతగాని తనంగా కేంద్రం భావిస్తోంది.

కనీసం కేంద్రం నుంచి డబ్బు పంపినా మునుగోడులో ఓటర్లకు పంచలేకపోయారని కేంద్ర నాయకత్వం గుర్రుగా ఉందట. మునుగోడులో బీజేపీ గెలిచి ఉంటే కేసీఆర్ కు చెక్ పెట్టడానికి అవకాశం దొరికేది. కానీ అలా జరగలేదు. దీంతో బండి సంజయ్ ను పక్కన బెట్టి బీజేపీ తెలంగాణ పగ్గాలు ఈటెల రాజేందర్ కు అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే జరగనుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆ పార్టీలో ఒకరి మాట మరొకరు వినే పరిస్థితిలో లేరు. అందుకే తెలంగాణ ప్రజలు కూడా రెండు పార్టీల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకటి బీఆర్ఎస్ లేదా బీజేపీ. ఇలా ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించనున్నాయి. కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని ఇటీవల బయటపడ్డ ‘ఫాంహౌస్
ఫైల్స్’ సినిమా చూస్తేనే అందరికీ అర్థమైంది. పార్టీ పెద్దలకు విధేయుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయడంలో కూడా బండికి మంచి పేరుంది. అయినా బండిని అధ్యక్ష పదవి నుండి తప్పించనున్నారని ప్రచారం జరుగుతుంది.

అందుకే బీజేపీకి తెలంగాణలో మైనస్ లు ఉంటే వెంటనే వాటిని తొలగించడానికి రెడీ అవుతోందట.. తన నోటి మాటలతో బీజేపీకి నష్టం చేకూరుస్తూ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అవసరమైతే సాగనంపేందుకు రెడీ అయ్యిందని.. బీజేపీ కొత్త చీఫ్ గా ఈటల రాజేందర్ ను చేయడాలని ఆ పార్టీ యోచిస్తోందని ఓ ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది.

తెలంగాణలో ఒట్టి ఊకదంపుడు ఆందోళనలు గాయి గత్తర లేపడం తప్పితే కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా బండి సంజయ్ రాజకీయాలు చేయడంలేదన్న టాక్ ఉంది. కేసీఆర్ ఎత్తులకు మించి పనిచేయాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ గుట్టుమట్లు అన్ని తెలిసి ఆయనతో ఉద్యమకాలం నుంచి సహవాసం చేసిన ఈటల రాజేందర్ కే ఈ బీజేపీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడానికి బీజేపీ
చేయని ప్రయత్నాలు లేవు.. దూకుడు స్వభావంతో ముందుకెళ్తున్న ఆ పార్టీ నాయకులు కేసీఆర్ ఆలోచనలు అందుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటిదురుసు బీజేపీకి బాగా మైనస్ అవుతోంది. అయితే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ సమయంలో బండి సంజయ్ ను చేస్తే బీజేపీ మరింత డ్యామేజ్ అవుతుందని.. అతడికి కేంద్రంలో పదవి ఇచ్చి సాగనంపాలని స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. బండి సంజయ్ కి కేంద్రంలో సముచిత స్థానం ఇస్తారని రాష్ట్రంలో ఈటల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మునుగోడులో ఓటమికి బండి సంజయ్ కారణమని కేంద్రానికి రిపోర్టు పంపించారట.. ఈ ఓటమితోనే బండి సంజయ్ పై నమ్మకం పోయిందని అంటున్నారు.

బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారా? ఇదంతా నిజమా? ప్రచారమా? అన్నది తెలియాల్సి ఉంది.

అందుకే ఈటలను బీజేపీ చీఫ్ ను చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి ఈ ప్రచారం బీఆర్ఎస్ సృష్టించిందా..? లేక నిజంగానే బండి సంజయ్ ని తెలంగాణలో ఎన్నికలకు నిండా ఏడాదే సమయముంది. ఇలాంటి టైంలో బీజేపీ పార్టీలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. అది కూడా ఏకంగా పార్టీ అధ్యక్షుడి మార్పు అంటూ భారీ ప్రక్షాళన చేయనున్నట్లు వినిపిస్తున్నాయి. వచ్చేది ఎన్నికల సమయం కనుక మార్పులు, చేర్పులతో అసంతృప్తి జ్వాలలు రగిలే ఛాన్స్ ఉంటుంది.

మరి బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేదే వేచి చూడాల్సి ఉంది.

Must Read

spot_img