Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ బీజేపీలో పురందేశ్వరి టార్గెట్ అయ్యారా..?

ఏపీ బీజేపీలో పురందేశ్వరి టార్గెట్ అయ్యారా..?

ఏపీ బీజేపీలో చాలా కాలంగా రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లక్ష్యంగా పార్టీ వీడిన కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేసారు. అదే విధంగా ఎంపీ జీవీఎల్ శైలిని తప్పు బట్టారు. ఇక.. ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పరోక్షంగా ట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీలో పురందేశ్వరి కొందరు నేతలకు టార్గెట్ గా మారారనే వాదన వినిపిస్తోంది. దీంతో పురందేశ్వరి పార్టీలో కొనసాగుతారా..ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తారా అనేది ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

ఏపీ బీజేపీలో కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. జనసేనతో పొత్తు కొనసాగుతున్నా.. రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధాని మోదీ – అమిత్ షా తో సమావేశాల తరువాత పార్టీలో మార్పు రాలేదు. వైసీపీ- టీడీపీ అనుకూల నేతలుగా బీజేపీలోని కొందరు నేతల పైన ప్రచారం ఉంది. ఇక.. పార్టీలో నేతల మధ్య ఐక్యత లోపించింది. సోము వీర్రాజు వ్యవహార శైలి పైన కన్నా లాంటి నేతలు పార్టీలో ఉన్న సమయంలోనే ఆరోపణలు చేసారు. పార్టీ వీడేందుకు నిర్ణయించిన కన్నా..ఉద్దేశ పూర్వకంగా సోము వీర్రాజు పైన ఆరోపణలు చేసారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎంపీ జీవీఎల్ వేస్తున్న అడుగులువ్యవహార శైలి తాజా వివాదంగా మారుతోంది. బీజేపీలో పురందేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన పురందేశ్వరి రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు.

తన తండ్రి ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టటం పైన తాజా గా పార్టీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. జీవీఎల్ ఈ మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ల అంశం రాజ్యసభలో ప్రస్తావించటంతో పాటుగా ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. విశాఖలో..తాజాగా విజయవాడలో కాపు నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో ఎన్టీఆర్ – వైఎస్సార్ పేర్లు గురించి ప్రస్తావించారు. దీనికి పురందేశ్వరి స్పందించారు. జీవీఎల్ వ్యాఖ్యలకు సమాధానంగా ‘ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఎన్టీఆర్ – వైఎస్సార్ పథకాలు.. ప్రత్యేకతను వివరించారు. ఇప్పుడు ఈ ట్వీట్ పొలిటికల్స ర్కిల్స్ లో వైరల్ అవుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో పురందేశ్వరి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో విశాఖ సీటుపై జీవీఎల్ ఫోకస్ చేసారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, జీవీఎల్మా త్రం దేశ వ్యాప్తంగా బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని, అందులో విశాఖ కూడా ఉందని చెబుతున్నారు. పార్టీ నిర్ణయం మేరకే విశాఖపై నేతలుప్రత్యేకంగా చూస్తున్నారని వివరించారు. గతంలో విశాఖ నుంచి 2009 నుంచి ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అక్కడ నుంచే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పురందేశ్వరి ఒకింత అసహనంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక..పార్టీ నేతలు మాత్రం జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు ఆసక్తి చూపటం లేదు. ఏపీ బీజేపీ లో ఈ మధ్య‌ కాలంలో రోజుకో రభ‌స నడుస్తోంది. బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, సెటైర్లు వేసుకుంటున్నారు. వారి మధ్య గొడవ పీక్ లెవల్ కు వెళ్ళి చివరకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసే దాకా వెళ్ళింది.

అయినా అక్కడితో గొడవలు ఆగలేదు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ న‌ర్సింహ్మారావు ఈ మధ్య కాపులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ కాపులతో మీటింగులు పెట్టడం, కాపు నాయకులతో సన్మానాలు చేయించుకోవడం, వంగవీటి రంగా కు తానే వారసడన్నంతగా మాట్లాడటం పరిపాటిగా మారింది. తాజాగా ఆయన మాట్లాడుతూ, ”ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రెండు పార్టీలు, ఆ రెండు కుటుంబాలేనా ? అన్నింటికీ వారి పేర్లేనా, జిల్లాలకు, పథకాలకు అన్నింటికీ వారి పేర్లేనా ? ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయమన్నది లేదా ? వంగవీటి రంగా పేరు ఎందుకు పెట్టరు ? ” అని ప్రశ్నించారు. అయితే ఆశ్చర్యంగా జీవీఎల్ మాటలపై వైసీపీ నుంచి గానీ, టీడీపీ నుంచి గానీ ఎవరూ మాట్లాడక ముందే బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు. జీవీఎల్ మాటలను ఖండించారు. జీవీఎల్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి ‘ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు’ అని కామెంట్ చేసిన ఆమె వారిద్దరూ తెలుగు ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు.

ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం– 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారని పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ .. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ ట్వీట్ పై నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను సపోర్ట్ చేయగా మరి కొందరు బీజేపీ అభిమానులు మాత్రం ఆమె ట్వీట్ ను విమర్శిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడతారా అని పలువురు బీజేపీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. దీంతో ఏపీ బీజేపీలో మరో కొత్త వివాదం రేగింది. ఇన్నాళ్లు కన్నా వర్సెస్‌ జీవీఎల్, సోమువీర్రాజుగా వార్ ఉండేది. దీంతో కన్నా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇది జరిగి ఒక్కరోజు కాక ముందే ఇప్పుడు మరో వివాదం చుట్టుముట్టింది.

కొన్ని రోజుల నుంచి కాపుల విషయంలో మాట్లాడుతున్న జీవీఎల్‌ తాజాగా చేసిన కామెంట్స్‌ను కాక రేపుతున్నాయి. నేరుగా ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పురంధేశ్వరి… అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు అనొద్దని.. ఆ మహానుభావులు అనాలంటూ సూచించారు. దీంతో బీజేపీలో వివాదాలన్నీ జీవీఎల్, సోమువీర్రాజు చుట్టూనే నడుస్తున్నాయి. వాళ్లిద్దరు వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్తున్నారని ఏం మాట్లాడినా, ఏం చేసినా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికే చేస్తున్నారు తప్పా పార్టీ కోసం చేయడం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అందుకే చాలా మంది అసంతృప్తిగా ఉన్నప్పటికీ బయటకు చెప్పడం లేదంటున్నారు. రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఎప్పుడో పార్టీని విడిచిపెట్టిన బీఆర్‌ఎస్ నేత రావెల కిషోర్‌ బాబు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. వాళ్లిద్దరు ఉన్నంత వరకు పార్టీ ఎదిగే పరిస్థితి ఉండదన్నారు.

ఇప్పుడు పురంధేశ్వరి కూడా జీవీఎల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్‌లు చేశారు. గతంలో కూడా జీవీఎల్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. జీవీఎల్ కామెంట్స్ చేయటం, వెంటనే పురందేశ్వరి స్పందించటంతో ఏపీ బీజేపీలో మరో వివాదం రాజుకున్నట్లు అయింది. ఇప్పటికే కన్నా అంశంపై చర్చ జరుగుతుండగా.. ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఏపీ బీజేపీలో నేతల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిమధ్య ట్వీట్ వార్ .. పై అధిష్టానం ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img