బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హారీ, మెగన్లకు రాజభవనంలో చోటు లేకున్నా వారి ఇద్దరు పిల్లలకు మాత్రం పుట్టుకతోనే సభ్యత్వం లభించింది. వారిని కూడా ప్రిన్స్, ప్రిన్సెస్ అని పిలిచేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంటే వారికి మాత్రం రాయల్ హోదా లభించింది. తమకు రాజరికం వద్దని ప్రిన్స్ హారీ, మెగన్ లు బ్రిటన్ ను వీడి అమెరికాలోని కాలిఫోర్నియాలో జీవిస్తున్నారు. ఇటీవలే ఆయన రాసిన స్పేర్ అనే పుస్తకం వివాదాస్పదంగా మారడంతో రాజకుటుంబం ఆగ్రహంగా ఉంది..
ప్రిన్స్ హ్యారీ , మేఘన్ మార్కెల్ పిల్లలను రాజకుటుంబం వారసులుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ గుర్తించింది. ఈ మేరకు గురువారం వారికి ప్రిన్స్, ప్రిన్సెస్ హోదా కల్పించింది. ఇకపై వారిని ప్రిన్స్ ఆర్చీ, ప్రిన్సెస్ లిలిబెట్ అని పిలుస్తారు. అంతకుముందు తమ పిల్లలకు ప్రిన్స్, ప్రిన్సెస్ హోదాలతో నామకరణం చేస్తున్నట్లు ప్రిన్స్ హ్యారీ దంపతులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతుల కుమారుడు ఆర్చీ, కుమార్తె లిలిబెట్‌లకు రాజకుటుంబ వారసులుగా గుర్తిస్తూ.. రాయల్ ఫ్యామిలీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది.
దీంతో వీరు భవిష్యత్తులో రాజకుటుంబ సింహాసనాన్ని అధిరోహించే వారసుల జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు. రెండేళ్ల క్రితం ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ను రాచరిక హోదాను వదులుకున్నారు. ప్రస్తుతం రాజకుంటుంబానికి దూరంగా ఉంటున్నారు. అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రిన్స్ హ్యారీ, మెగన్ లు నివాసం ఉంటున్నారు. ఆ సమయంలో తమ పిల్లల్ని మాత్రం రాజకుంటుంబ సంప్రదాయాలతోనే పెంచుతామని వెల్లడించారు. ఇప్పటి వరకు వీరిని మాస్టర్ ఆర్చీ, మిస్ లిలిబెట్‌లుగా పిలుస్తున్నారు. ఇకపై వీరి పేర్లకు ముందు ప్రిన్స్, ప్రిన్సెస్ చేరనున్నాయి.
బ్రిటన్ రాజకుటుంబం నిబంధనల ప్రకారం చక్రవర్తి మనుమడు, మనుమరాలు.. యువరాణి, యువరాజు కావచ్చు. దాని ప్రకారమే ప్రిన్స్ హ్యారీ, మేఘన్ రాజకుటుంబ హోదా వదులుకున్నప్పటికీ వారి పిల్లలకు మాత్రం రాచరిక హోదా కల్పించారు. గతంలో తమ పిల్లలకు రాజరిక హోదా కల్పించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్ నిరాకరించిందని మేఘన్ ఆరోపించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా హ్యారీ పట్ల పెరుగుతున్న సానుభూతి కారణంగా వారి పిల్లలకు ఈ హోదా కల్పించారు.
ప్రిన్స్ హ్యారీ ఇటీవలే స్పేర్ అనే పేరుతో తన జీవిత చరిత్రను రాశారు. ఇందులో రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు బయటపెట్టారు. తన తండ్రి కింగ్ ఛార్లెస్, సవతి తల్లి కెమిల్లా, అన్నయ ప్రిన్స్ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన భార్య మేఘన్ మార్కెల్‌ను రాజకుటుంబం వేదనకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్ హ్యారీ పిల్లలను రాజకుటుంబ వారసులుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ గుర్తించడం విశేషం అంటున్నారు విశ్లేషకులు. అయితే తనను పూర్తిగా వివక్షతో చూసిన విషయం గురించి హ్యారీ కూడా తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ విషయాన్ని తన చిన్నప్పటి నుంచి హ్యారీ బాగోగులు చూసిన సర్వెంట్లు సైతం ఈ విషయం నిజమేనని నిర్దారించడం జరిగింది. పెద్ద కొడుకు విలియమ్స్ కిచ్చిన గౌరవం తనకు లభించలేదు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం ఒక కొత్త శకానికి ప్రారంభసూచికగా మారింది. యునైటెడ్ కింగ్డమ్ సింహాసనాన్ని ఇప్పుడు కొత్త రాజు కింగ్ చార్లెస్ 3 అధిరోహించారు. రాణి కుమారుడు, మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్ల్స్ ఇప్పుడు బ్రిటన్‌కు రాజు. మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్… బ్రిటన్ సింహాసనాన్ని చేరుకోవటానికి ముందు సుదీర్ఘ ప్రస్థానం సాగించారు. చాలా మంది పదవీ విరమణ గురించి ఆలోచించే వయసులో ఆయన ఎప్పటి నుంచో సంసిద్ధమవుతూ ఉన్న పాత్రలోకి చేరుకున్నారు. దేశం యుద్ధం నుంచి కోలుకుంటున్న సమయంలో 1948లో ఆయన జన్మించారు. నాడు రాచ కుటుంబం ప్రతిష్ట ఉచ్ఛస్థితిలో ఉంది. తల్లి ఎలిజబెత్ రాణిగా సింహాసనం అధిష్టించినపుడు ఆయన వయసు కేవలం నాలుగేళ్లు. భవిష్యత్తు గురించి అర్థం చేసుకోగల వయసు కాదు.
బయటి ప్రపంచానికి సంబంధించినంతవరకూ, 1981లో లేడీ డయానా స్పెన్సర్‌తో చార్లెస్ వివాహం అసలుసిసలైన జానపద కథ వంటిది. వారికి ఇద్దరు పిల్లలు – విలియం, హ్యారీ – పుట్టిన తర్వాత వీరు 1992లో విడిపోయారు. ప్రజల్లో సానుభూతి స్పష్టంగా డయానా వైపే ఉంది. ఈ కథలో చార్లెస్‌ను ప్రపంచం మొత్తం విలన్‌గా చూసింది. ఆ విడాకుల పర్వం తమ ఇద్దరు పిల్లలపై పడిందనడంలో సందేహం లేదు. ఇద్దరు కొడుకుల మధ్య పెంపకం విషయంలో చాలా తేడాలు కనిపించేవని చెబుతారు. చిన్నవాడైన ప్రిన్స్ హ్యారీని రాజకుటుంబం స్పేర్ యువరాజుగా మాత్రమే చూసేది. అన్ని గౌరవాలు మొదటి కుమారుడు ప్రిన్స్ విలియమ్స్ కే దక్కేవి. ఆ అసంత్రుప్తి ప్రిన్స్ హ్యారీని ఆత్మన్యూనతా భావానికి గురి చేసిందని రాజకుటుంబంతో దగ్గరి సంబంధాలున్నవారు చెబుతుంటారు.