Homeఅంతర్జాతీయంప్రిన్స్ హ్యారీ అటోబయోగ్రఫీ పుస్తకం ‘ది స్పేర్’ ప్రిన్స్ హ్యారీ

ప్రిన్స్ హ్యారీ అటోబయోగ్రఫీ పుస్తకం ‘ది స్పేర్’ ప్రిన్స్ హ్యారీ

బ్రిటన్ రాచరికం ఆంతరంగిక విషయాలు ఒక్కొటొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాజకుటుంబం వ్యక్తుల్లోనూ సామాన్యులకు ఉండే సమస్యలే ఉంటాయని ఆ విషయాలను బట్టి తెలుస్తోంది. తాజాగా ఇంటి నుంచి వేరుపడిన ప్రిన్స్ హ్యారీ రాసిన అటోబయోగ్రఫీ పుస్తకం ‘ది స్పేర్’ ఈ నెల పదిన విడుదల కానుంది. అందులో తన భార్య విషయంలో అన్న విలియమ్ తనను ఎలా కొట్టాడో ప్రస్తావించారు ప్రిన్స్ హారీ.. అంతే కాదు మరెన్నో విషయాలు తెలియనున్నాయి..

మెగెన్ మెర్కెల్ విషయంలో ప్రిన్స్ హ్యారీ అన్న విలియమ్ పెరిగిన వాగ్వాదం కారణంగా చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని ప్రస్తావించడంతో రాజకుటుంబంలో అంతర్గతంగా కొనసాగుతున్న వివాదాలు బయటపడుతున్నాయి. భార్య మెగన్ విషయంలో మాటా మాటా పెరిగి నన్ను కొట్టాడని ప్రిన్స్ హ్యారీ ఆరోపిస్తున్నారు. దివంగత ఎలిజబెత్ రాణి జీవించి ఉన్నప్పుడే ఇంట్లో వివాదాలు చెలరేగాయి. అదే సమయంలో ప్రిన్స్ హారీ, మెగెన్ ఇద్దరూ వేరు కాపురం పెట్టారు. బ్రిటన్ ను వీడి అమెరికాలో జీవిస్తున్నారు. ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ ఆటోబయోగ్రఫీ ‘స్పేర్’ జనవరి పదో తేదీన రిలీజ్ కానుంది. అయితే ఆ బుక్‌లో ‘డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ’ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు.

రాజకుటుంబానికి సంబంధించిన అనేక విషయాలతో పాటు తన భార్య మెగెన్ మెర్కెల్ విషయంలో.. అన్న విలియమ్ తనపై భౌతికంగా దాడి చేశాడని, కాలర్ పట్టుకుని మరీ కొట్టాడని తన ఆటోబయోగ్రఫీలో వివరించాడు. ఓ ఆంగ్ల పత్రిక కథనం మేరకు ఈ విషయం బయటకు వచ్చింది. ఆ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. మేఘన గురించి అన్న విలియమ్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఆ సమయంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, మీడియాకు కూడా మేఘన గురించి విలియమ్ అన్న తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రిన్స్ హ్యారీ తెలిపారు. ఓ దశలో విలియమ్ తన కాలర్ పట్టుకుని లాగేసినట్లు హ్యారీ చెప్పారు. తన మెడలో ఉన్న నక్లెస్ లాగేసి, తనను నేలపై పడేసి తన్నినట్లు తెలిపారు. అన్న అటాక్ చేయడం వల్ల తనకు వెన్ను నొప్పి వచ్చినట్లు హ్యారీ చెప్పారు.

2020లో బ్రిటన్ రాజకుటుంబం నుంచి హ్యారీ, మెర్కల్ జంట వేరుపడి ఉండేందుకు నిర్ణయించిన సమయంలో అన్నాదమ్ముళ్ల మధ్య గొడవ మొదలైంది. ఇంట్లో తగాదపడ్డ హ్యారీ జంట ప్రస్తుతం కాలిఫోర్నియాలో జీవిస్తున్నారు. అయితే గత ఏడాది క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో మరణించారు. బ్రిటన్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఈ ఏడాది మే నెలలో పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇలాంటి సమయంలో హ్యారీ, విలియమ్ గొడవ బయటపడడం సంచలనంగా మారింది. అమెరికన్ నటి అయిన మెగెన్ మెర్కెల్ తో ప్రేమలో పడిన ప్రిన్స్ హారీ ఆమెను వివాహం చేసుకునేందుకు పట్టుబట్టాడని చెబుతారు. అయితే మెగెన్ బ్లాక్ అవడంతో ఆమె రాకను రాజకుటుంబం అంతగా ఇష్టపడలేదు.

కింగ్ చార్లెస్ మాజీ భార్య డయానాకు జన్మించిన ప్రిన్స్ హ్యారీ, విలియంస్ ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పేర్లుగా చెబుతుంటారు. వారిద్దరూ గతంలో చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఒకరంటే మరొకరు ప్రేమగా ఉండేవారు. హ్యారీ వివాహం జరిగిన తరువాత కుటుంబంలో పొరపొచ్చాలు మొదలయ్యాయి. అవి కాస్తా తోడి కోడళ్ల మధ్య కూడా బాగా పెరిగాయని కుటుంబీకులు లీక్ చేసిన విషయాల ద్వారా సమాచారం. అయినా బ్రిటన్ లో ఏదీ అంతరంగికం కాదు. అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. అక్కడి మీడియా రాజకుటుంబాన్ని దశాబ్దాలుగా వెంటాడుతూ ఉంది. ఆ క్రమంలోనే డయానా కారు ప్రమాదానికి గురవడంతో ఆమె మ్రుతి చెందారు. అయితే ఆమె తన చిన్న కుమారుడైన హ్యారీని బాగా ప్రేమించేవారు.

భార్య మెగెన్ కోసం ప్రిన్స్ హారీ తన రాజరికపు హక్కులను కూడా వదిలేసుకున్నారు. ఆమెతో కలసి అమెరికాలోనే వేరు కాపురం పెట్టారు. ఈ విషయంలో నాన్నమ్మ ఎలిజబెత్ చాలా రకాలుగా మనవడికి చెప్పి చూసింది. కానీ హ్యారీ పట్టుదలగా అన్నీ వదిలేసుకుని వెళ్లిపోయారు. ప్రిన్స్ హ్యారీ చేసిన పనిని కింగ్ చార్లెస్ కూడా అంగీకరించలేకపోయారు. చిన్న కుమారుడి పట్ల అంతగా ప్రేమ చూపించడం ఎవరూ చూడలేదు. ఇప్పుడు తన అటోబయోగ్రఫీ విడుదల తరువాత ఆ రాజకుటుంబంలో మరెన్ని సంచలనాలు చోటు చేసుకుంటాయోనని బ్రిటన్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. బ్రిటిష్ ప్రజలలోనూ క్రమంగా రాజరిక వ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లుతోంది..ఏదో నామమాత్రపు గౌరవంతో అంతరించుకుపోయే దశకు చేరుకుందని అంటున్నారు విశ్లేషకులు.

Must Read

spot_img