ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా మంది గర్భిణీ మహిళలు తరలి వెళ్లిపోతున్నట్లు సమాచారం.. వారంతా అర్జెంటీనా పౌరసత్వం కోసం అక్కడికి వెళ్లి ప్రసవించాలని భావిస్తున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. రష్యా నుంచి అర్జెంటీనాకు కేవలం ఆ దేశ పౌరసత్వం పొందేందుకే గర్భిణీలు వలస వెళుతున్నారా..? రష్యా నుంచి అర్జెంటీనాకు వెళ్లి స్థిరపడాల్సిన అవసరం వారికి ఎందుకు వచ్చింది..? రష్యా, ఉక్రెయిన్ యుద్దమే గర్భిణీ మహిళల వలసకు కారణమవుతోందా..?
సాధారణంగా గర్భిణీలు ప్రయాణాలు చేయడం అంత క్షేమకరం కాదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి కాస్త దూరం ప్రయాణిస్తేనే ఇబ్బంది పడే గర్భిణీలు.. ఏకంగా దేశాలే దాటిపోతున్నారు. సరిగ్గా నెలలు నిండిన సమయంలో తమ దేశం వీడి.. వేరే దేశానికి క్యూ కడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు నెలల వ్యవధిలోనే ఏకంగా 5 వేల మందికిపైగా నిండు గర్భిణీ స్త్రీలు దేశం దాటి వెళ్లారు. వీరంతా వెళుతోంది అర్జెంటీనాకు.. మహిళలు తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం కోరుకోవడానికి ఆ దేశ పాస్‌పోర్ట్ కారణం.
ప్రపంచ వ్యాప్తంగా అర్జెంటినా పాస్‌పోర్ట్ చాలా సురక్షితమైనదిగా గుర్తింపు ఉంది. ఈ పాస్‌పోర్ట్ హోల్డర్స్ వీసా లేకుండా 171 దేశాలలో ప్రవేశించడానికి వీలుంది. అర్జెంటినాలో ప్రసవించాలనుకునే తల్లుల కోసం ఆదేశానికి చెందిన కొన్ని ఆస్పత్రులు ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్నాయి. బర్త్ డేట్ షెడ్యూల్, విమానశ్రయంలో పికప్, స్పానిష్ పాఠాలు, ఆస్పత్రి బిల్లుల్లో తగ్గింపు వంటి సేవలు అందిస్తున్నాయి. 2015 నుంచి ఈ తరహా ఆఫర్స్ ఇస్తున్నారు.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం మధ్య కాన్పు చేసుకునేందుకు ఇష్టపడని రష్యా గర్భిణులు… అర్జెంటీనా వెళ్తున్నారు. మంచి వైద్యంతో పాటు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసమే ఇలా వెళ్తున్నామని వారు చెప్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని గర్భిణులు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా రష్యా గర్భిణులు కాన్పు సమయం దగ్గరపడగానే వారు తమ మాతృదేశం వీడేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది గర్భిణులు రష్యా నుంచి అర్జెంటీనాకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది.. రెండు రోజుల క్రితం ఒక్కరోజే 33 మంది గర్భిణులు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌కు చేరుకున్నారు. వీరంతా కాన్పుకు దగ్గరగా ఉన్నవారే. ఐతే వారిలో ముగ్గురు వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. తొలుత రష్యన్ మహిళలు తాము పర్యాటకులుగా అర్జెంటీనాకి వస్తున్నాం అని చెబుతున్నట్లుసమాచారం.
అర్జెంటీనా రష్యా కంటే ఎక్కువ స్వేచ్ఛగా ఉండటంతో మాస్కో మహిళలంతా తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలిని భావిస్తున్నారు.. నిజానికి వీరంతా రష్యాలో యుద్ధం మధ్యలో బిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టపడటం లేదని సమాచారం.. అదీకూడా ఈ యుద్ధ సమయంలోనే సుమారు 5 వేల మంది రష్యన్ గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వచ్చారని, వారంతా అర్జెంటీనా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో అర్జెంటీనాకు వస్తున్న రష్యా మహిళల సంఖ్య పెరిగిందని కూడా తెలిపారు.. కేవలం ఒక్క గురువారం సుమారు 33 మంది మహిళలు
అర్జెంటీనాకు వచ్చినట్లు వెల్లడించారు.. అలాగే అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు, కానీ రష్యా వీసా కలిగి ఉంటే కేవలం 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అర్జెంటీనా పోలీసులు అరెస్టు చేసిన ఆ ముగ్గురు మహిళల తరుఫు న్యాయవాది తప్పుడు పర్యాటకులు అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
అదీగాక… ఒక రష్యాన్ వెబ్‌సైట్ దక్షిణ అమెరికా దేశంలో ప్రసవించాలనుకుంటే తల్లులకు వివిధ ప్యాకేజీలు అందిస్తున్నట్లు అర్జెంటీనా అధికారులు పేర్కొన్నారు. ఇదోక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని అధికారులు వెల్లడించారు. ఈ వెబ్‌సైట్ రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలో స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఐతే ఇప్పటి వరకు ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు..
మరోవైపు, అర్జెంటీనాలో కాన్పు జరిగితే పుట్టిన బిడ్డతో పాటు తల్లిదండ్రులకు అక్కడి పౌరసత్వం లభించడం సులభంగా ఉంటుంది.తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం అర్జెంటీనాకు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం పొందాలని… తాపత్రయపడుతున్నారు గర్భిణీ మహిళలు.. ఈ గర్భిణుల వలసలకు బర్త్ టూరిజం అని పేరు పెట్టారు. వీసా రహిత ప్రవేశం, మంచి వైద్య సేవలు పొందవచ్చన్న సాకుతో గర్భిణులు అర్జెంటీనాను ఎంచుకుంటున్నారు. అర్జెంటీనాలో వసతి, శిశువు డెలివరీపై ఆఫర్ల కోసం రష్యాలో ఒక వెబ్‌సైట్ కూడా ఉన్నది.
ఈ వెబ్‌సైట్ బర్త్ ప్లాన్‌లు, ఎయిర్‌పోర్ట్ పిక్-అప్, అలాగే స్పానిష్ భాషా తరగతులు, బ్యూనస్ ఎయిర్స్‌లోని ఉత్తమ దవాఖానాల్లో చికిత్సల ప్యాకేజీలను అందిస్తున్నది. అర్జెంటీనా పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తులు వీసా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా 171 దేశాల్లోకి ప్రవేశించవచ్చు. రష్యా పాస్‌పోర్ట్ ద్వారా 87 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లగలరు. ఇలా ఉండగా, రష్యన్ మహిళలు నకిలీ పాస్‌పోర్ట్‌లతో అర్జెంటీనాలో ప్రవేశించడానికి సహాయపడే ముఠాలపై
అర్జెంటీనా పోలీసులు నిరంతరం దాడులు చేస్తున్నారు.
ఈ ముఠాలు ఇలాంటి సేవలకు దాదాపు రూ.29 లక్షలు వసూలు చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేయలేదు. కానీ
ల్యాప్‌టాప్ నగదు, ఇమ్మిగ్రేషన్ పత్రాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల దేశంలోకి ప్రవేశించిన స్త్రీలపై అర్జెంటీనా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అర్జెంటీనా పాస్ పోర్ట్ ను పొందే మార్గంగా ప్రసవించడానికి పెద్దసంఖ్యలో తరలివస్తుండటాన్ని గుర్తించారు.. ఈ వారం ఆరుగురు గర్భిణీ స్త్రీలను అర్జెంటీనాలోకి రాకుండా నిషేధించారు..
గత బుధవారం ముగ్గురు.. గురువారం ముగ్గురు గర్భిణీలు.. అర్జెంటీనాలోకి ప్రవేశించి.. వారు పర్యాటకులమని తప్పుగా చెప్పారని, మైగ్రేషన్ జాతీయ డైరెక్టర్ ఫ్లోరెన్సియా కరిగ్నానో వెల్లడించారు.. అర్జెంటీనాలో గర్భిణీ స్త్రీల రాక పెరుగుదలకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన కారణంగా ఉంది. ఒక రష్యన్ భాషా వెబ్‌సైట్ దక్షిణ అమెరికా దేశంలో ప్రసవించాలనుకునే తల్లుల కోసం ప్యాకేజీలను అందిస్తోంది.లా నాసియన్ నివేదిక ప్రకారం, అర్జెంటీనా పోలీసులు “మిలియన్ డాలర్ల వ్యాపారం, అక్రమ నెట్‌వర్క్”ను ఛేదించడానికి దాడులు నిర్వహించారు. అర్జెంటీనాలో స్థిరపడేలా రష్యన్ మహిళలు.. వారి భాగస్వాములకు వెబ్‌సైట్ నకిలీ పత్రాలను జారీ చేసిందని ఆరోపించింది. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.