Homeఆంధ్ర ప్రదేశ్ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గపోరు

ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గపోరు

ఆ నియోజకవర్గంలో అధికారపార్టీలో అంతర్గత కుమ్ములాటలు వైసీపీ అధిష్టానానికి నెత్తిమీద కుంపటిలా మారింది. నేతల గ్రూపుల గోలలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు పార్టీ పరువును రోడ్డును పడేస్తున్నాయి..వైసిపి కుమ్మలాటలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేలా మార్గం సుగుమం చేస్తున్నాయా..

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ వైసీపీలో రోజురోజుకీ వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.

పార్టీ అధిష్టానం నేతలను బుజ్జిగించి నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నేతల మధ్య విభేదాలు మాత్రం షరామామూలుగానే మారుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జ్ ని మార్చినా, పార్టీ బలోపేతానికి పనిచేయకపోవడంతో మరొకరిని మార్చినా ఫలితం మాత్రం కనిపించడంలేదు.

స్ధానికి నేతల మధ్య జరుగుతున్న వర్గపోరులో నియోజకవర్గంలో వైసిపి పార్టీ గెలుపు కనుమరుగు అయ్యే పరిస్ధితి నెలకొంది. దీంతో ఇప్పటికే నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన తెలుగుదేశంపార్టీ .. వైసిపి వర్గపోరును క్యాష్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్వళూరుతోంది.‌

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్. ఈ స్థానం ఏర్పాటైన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకసారి, తెలుగుదేశం రెండు సార్లు గెలిచాయి. తెలుగుదేశం ఎమ్ఎల్ఎ డోలా బాల వీరాంజనేయ స్వామి 2014,2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014 లో ఓటమి తరువాత వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ టిడిపిలో చేరారు. దీంతో ఖాళీ అయిన కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ పదవిని వరికూటి అశోక్ బాబు ఇచ్చారు. అప్పటి నుండి వైసిపి లోవర్గపోరు మొదలైందనే చెప్పుకోవచ్చు.

పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో వర్గపోరు షరామామూలుగా మారింది. ప్రధానంగా అశోక్ బాబు, వెంకయ్య వర్గాల మధ్య వర్గపోరుతోనే 2019 లో వరికూటిని కాదని, పేదల డాక్టర్ గా రాష్ట్రపతి దగ్గర అవార్డు పొందిన మాదాశి వెంకయ్య కి వైసిపి అభ్యర్థి గా అవకాశం ఇచ్చారు.

అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వెంకయ్య నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని పోయి, పార్టీలో వున్న వర్గపోరును నియంత్రించి, గ్రామస్ధాయి నుంచి నియోజకవర్గ స్ధాయి నేతలను అందరిని కలుపుకుని పోయి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో వైసిపి తరుపు నుంచి పోటీ చేసిన వెంకయ్యను అశోక్ బాబు వర్గియులు చేసిన క్రాస్ ఓటింగ్ కారణంగా కేవలం వెయ్యి ఓట్లతో వెంకయ్య ఓటమి పాలైయ్యారు.అయితే వెంకయ్యకు పార్టీ అధిష్టానం కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ తో పాటు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవిని కేటాయించింది.

ఆయా వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి బాగుందనుకుంటున్న సమయంలో నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పులో భాగంగా మాదాసి వెంకయ్యను తప్పించి ఆయన స్ధానంలో వరికూటి అశోక్ బాబును నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు. దీంతో నియోజకవర్గంలో వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి.

మాదాసి వెంకయ్యను నియోజకవర్గ ఇంచార్జ్ గా తప్పించే విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయంపై వెంకయ్య వర్గం జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో పార్టీని అభివృద్ది చేస్తూ అందరిని కలుపుకుంటూ పోతూ వెంకయ్య సమర్దవంతంగా పని చేస్తున్న సమయంలో తప్పించి అశోక్ బాబుకు భాద్యతలు అప్పగించడం పట్ల పార్టీ అధిష్టానంపై వెంకయ్య వర్గం గుర్రుగా ఉంది. దీంతో పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన గడపగడపకు వైసిపి కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమాలకు వెంకయ్య వర్గం దూరంగా వుంటున్నారు.

నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు తీసుకున్న తరువాత నియోజకవర్గంలో అశోక్ బాబు వ్యవహరిస్తున్నతీరుపై వెంకయ్య వర్గం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే వున్నారు. పార్టీ పెద్దల వద్ద అశోక్ బాబుకు సహకరించేది లేదని తెగేసి చెప్పడంతో పాటు, గత ఎన్నికలలో పార్టీ ఓటమి కారణం అయిన వరికూటి అశోక్ బాబుకి ఎలా ఇంచార్జ్ పదవి ఇస్తారని అదిష్టాన పెద్దల వద్ద నిలదీశారు.

నియోజకవర్గ ఇంఛార్జీగా అశోక్ బాబు బదులు వెంకయ్యకు గాని మరోక వ్యక్తికి గాని ఇవ్వాలని వెంకయ్య వర్గం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. అలా
నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీకి సహకరించేదిలేదని పార్టీ పెద్దల వద్ద తెగెసి చెప్పారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ రెండు, మూడు గ్రూపులుగా విడిపోయింది.ఆయా వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా ఎవరివారే అన్నట్లుగా నిర్వహిస్తుండడం పార్టీ పెద్దలకు తలనెప్పిగా మారింది. దీంతోపాటు నియోజకవర్గంలో తమ బలాబలాలను చూపించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

అధికార యంత్రాంగం బదిలీల్లో కూడా ఇద్దరు నాయకులు పోటీపడి తమకు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇవ్వమంటూ ఎవరికి వారు పార్టీ ముఖ్య నేతలకు సిఫార్సులు చేస్తున్నారు. అలాగే తాము చెప్పిన పనులు చేయాలంటూ నియోజకవర్గంలో అధికారులపై ఒత్తిడి చేస్తున్నారట.

దీంతో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. కొండేపి నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న రెండు గ్రూపులకు తోడు మరో రెండు గ్రూపులు పురుడు పోసుకోవటం పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన ఈ సెగ్మెంట్లో ప్రతిసారి మాలలకే పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దఫా మాదిగలకే అవకాశమివ్వనున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఓ వర్గం ప్రచారం ప్రారంభించింది.

కొండపి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వర్గవిభేదాలను టిడిపి క్యాష్ చేసుకోంటుంది.

ఇందులో భాగంగా సింగరాయకొండ సర్పంచ్ సోదరుడైన తాటిపత్రి చంద్రశేఖర్ వర్గాన్ని కూడగట్టుకునే పనిలో పడ్డారు. హైదరాబాదులో బిల్డరుగా ఆర్ధికంగా స్దిరపడ్డ చంద్రశేఖర్మా దిగ కోటాలో నాకే సీటు ఖాయమంటూ హడావుడి చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా అధిష్టానం మరో కొత్త పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాజా మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ ను రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టరుగా పని చేసి ఉండటంతో పాటు పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా పేరు ఉండటం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. పార్టీలో వున్న వర్గవిభేదాలు, గందరగోళాలతో 2014, 2019 ఎన్నికల నాటి పరిస్థితులే ఇప్పటికీ కొనసాగుతున్నాయనే ఆవేదనలో పార్టీ క్యాడర్ ఉంది.

ఇదిలా ఉంటే, కొండపి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వర్గవిభేదాలను టిడిపి క్యాష్ చేసుకోంటుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో వైసిపి అసంతృప్తి నేతలు ఎమ్ఎల్ఎ డోలా బాలవీరాంజనేయ స్వామితో టచ్ తో వుంటున్నారనే టాక్ నడుస్తోంది. అంతేగాక ప్రజలు, పార్టీ క్యాడర్ కు ఎమ్ఎల్ఎ బాల వీరాంజనేయ స్వామి అందుబాటులో వుంటూ వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

దీంతో టీడీపీ ఎమ్మెల్యే డోలా వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టటం ఖాయమనే టాక్ నడుస్తోంది.. ఇంచార్జిని మారిస్తే పార్టీ గాడిలో పడుతుందని అనుకున్న సమయంలో సీన్ రివర్స్ అవ్వడం వైసిపి పార్టీ పెద్దలకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దీంతో ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా పార్టీ పరిస్థితి మారిందన్న టాక్ వెల్లువెత్తుతోంది.

సెగ్మెంట్లో వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడిందనుకున్న అధిష్టానం.. తాజా పరిణామాలతో ఏం చేస్తుందోనన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. అసలే ముందస్తు టాక్ వినిపిస్తోన్న తరుణంలో .. పార్టీ పరిస్థితి ఏమిటన్న చర్చ స్థానికంగా వెల్లువెత్తుతోంది. అదేసమయంలో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తూ, అధికార పార్టీకి చుక్కలు చూపిస్తోందన్న అభిప్రాయం .. చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యల్ని చేపట్టాల్సి రావడంతో, ఏం చేస్తుందోనన్న ఆసక్తి సెగ్మెంట్ వ్యాప్తంగా వెల్లువెత్తుతోం

మరి హైకమాండ్ ఏం చేయనుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img