బాలయ్యతో ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆహా యాప్ పై అన్ స్టాపబుల్ షో కోసం ఎగబడడంతో సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో ఎపిసోడ్ కాస్త అలస్యం అయింది. ఇదిలా ఉంటే..షోలో పెళ్లిపై కార్లిటీ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుంది అంటూ… హింట్ ఇచ్చాడు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ షోకి హాజరయ్యాడు. అయితే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు కాస్త ముందుగానే ప్రభాస్ ఎపిసోడ్ ని ప్రసారం చేశారు. కానీ ప్రభాస్ అభిమానుల దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయింది.
ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆహా యాప్ పై అన్ స్టాపబుల్ షో కోసం ఎగబడడంతో సర్వర్లు డౌన్ అయ్యాయి. దీనితో ప్రభాస్ ఎపిసోడ్ ఆలస్యం అయింది. అయితే ఈ ఎపిసోడ్ లో పలు అంశాలపై ఓపెన్ అయ్యాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ప్రభాస్ ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్స్ లిస్ట్ లో రాజమౌళికి స్థానం దక్కలేదు. సీనియర్ డైరెక్టర్ బాపు, మణిరత్నం తనకు ఇష్టమైన దర్శకులుగా ప్రభాస్ చెప్పారు.
ఇవే కాకుండా అన్ స్టాపబుల్ వేదిక అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని చరణ్ చెప్పడం ఆసక్తి రేపింది. ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పాలని హోస్ట్ బాలకృష్ణ ఫోన్ లో చరణ్ ని అడిగారు. దానికి సమాధానంగా త్వరలో ప్రభాస్ పెళ్లి ప్రకటన చేశారని హింట్ ఇచ్చాడు.