Homeసినిమానాలుగు సినిమాలు చేస్తున్న రెబల్ స్టార్....

నాలుగు సినిమాలు చేస్తున్న రెబల్ స్టార్….

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. సలార్’,’ఆది పురుష్’ సినిమాలతోపాటు మారుతి తో హారర్ థ్రిల్లర్ ‘రాజా డీలక్స్’ వంటి మూవీస్ లో నటిస్తున్నాడు. ప్రభాస్ ఇదే సమయంలో ‘మహానటి’ ఫూమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్నా ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ పైనే వుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత భారీ స్థాయిలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ కోసం నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇందు కోసం భారీ వెహికిల్స్ ని కూడా సిద్ధం చేయడం మొదలు పెట్టాడు. ఇందు కోసం ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా గ్రూప్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా భారీ వాహనాలని రెడీ చేయడం మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ… చిత్ర బృందం ఓ వీడియోని విడుదల చేసింది. ఈ మూవీకి సంబంధించిన కీలక వెహికిల్స్ ని సిద్దం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సినిమాకు సంబంధించిన వెహికిల్స్ తయారిని మొదలు పెట్టారు. ముందుగా ఓ వీల్ ని రెడీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ప్రతీదీ తయారు చేసుకోవాలని దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతున్న మాటలతో వీడియో మొదలైంది.

ఇదే క్రమంలో సినిమా కోసం తొలి వీల్ ని ఎలా సిద్ధం చేశారో వీడియోలో చూపించారు. సెట్ లో సభ్యులు ఒక్క టైర్ కోసం పడుతున్న శ్రమని చూపిస్తూనే…టీమ్ ఒక్క టైర్ కోసం ఎంతో ఓవర్ చేస్తున్నారని నాగ్ అశ్విన్ పంచ్ లు కూడా వేయించడం గమనార్హం. ఫైనల్ గా టీమ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ వీల్ ని రెడీ చేసేసింది. టీమ్ టైర్ రెడీ చేస్తున్న టైమ్ లో సెటైర్లు వేయడం చూస్తుంటే…నాగ్ అశ్విన్ తనపై తానే సెటైర్లు వేసుకుని సోషల్ మీడియాకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టుగా స్పష్టమవుతోంది.

Must Read

spot_img