మహా శివరాత్రి సందర్భంగా హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి చిత్రాలకు డైరెక్టర్ గా పనిచేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటి వరకు మరే సినిమాకు పెట్టని బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు నిర్మాత అశ్వినీదత్ చెప్పారు. అడపా దడపా చిన్నవే తప్ప ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు విడుదల కాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో తెలియని టెన్షన్‌ను క్రియేట్ చేసింది. వారెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ప్రభాస్ మహా శివరాత్రి రోజు ఆ శివుని ఆజ్ఞాతో గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా రిలీజ్ డేట్ ను చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంత్రికి విడుదల చేయనునట్లు చెప్పారు.
ఈ సినిమాను టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు మనకు ఇదీ వరకే తెలుసు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో కథ విషయానికి వస్తే.. భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫెరెంట్ గెటప్లో కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్‌ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్ డైరెక్టర్లను దించనున్నారట. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారీ చేయి కింద పడి ఉంది. దాన్ని కొందరు గన్స్‌తో ఎయిమ్ చేస్తున్నారు. వరల్డ్ ఈజ్ వెయిటింగ్ అంటూ క్యాప్షన్‌ను యాడ్ చేశారు. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే ఇదొక సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ అని.. నెక్ట్స్ రేంజ్‌లో సినిమా ఉంటుందని చెప్పకనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అటు ఫ్యాన్స్ కూడా సాహో తర్వాత పుల్ లెంత్ యాక్షన్ మూవీ కోసం చూస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెతో పాటు దిశా పటాని కూడా ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ముందుగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ట్రయల్ షూట్ కూడా నిర్వహించారు. కానీ ప్యాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ఇతరత్రా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు చాలా సమయం కావాలి. అందుకే ఈ సినిమా షూట్ కంప్లీటైన 10 నెలల తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు బావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తి కావొచ్చింది. మొత్తంగా ఈ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. ప్రాజెక్ట్ కె అంటే ప్రాజెక్ట్ కర్ణ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు. మరో పక్క ప్రభాస్… బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో మొదటిసారి నటించడంతో తన చిరకాల కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలున్నాయి. ఈ మూవీ కంటే ముందు ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్… తొలుత గత ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకున్నా… ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే, టీజర్ విడుదలైన తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ మీద ట్రోల్స్ రావడంతో మళ్ళీ వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద రీ వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16న ఆదిపురుష్ ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ‘సలార్’ విడుదల కానుంది. ఇక ప్రభాస్ ఈ ఏడాది సినిమాలు వదిలేసి వచ్చే ఏడాది విడుదలయ్యే బాక్సాఫీస్‌పై వార్ ప్రకటించేశాడు. ఇక ఆయనకు పోటీగా ఎవరెవరు రాబోతున్నారో చూడాలి మరి.