Homeఅంతర్జాతీయంప్రధాని మోదీ రిక్వెస్ట్‌కు పోప్ ఓకే: భారత పర్యటనకు అంగీకారం

ప్రధాని మోదీ రిక్వెస్ట్‌కు పోప్ ఓకే: భారత పర్యటనకు అంగీకారం

క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ భారత పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు వాటికన్ సిటీ తెలిపింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరంలో ఆయన భారత్ లో పర్యటించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో ఆయన ఆసియా దేశాల పర్యటనకు రానున్నారు. అందులో భాగంగా భారత్ ను కూడా సందర్శిస్తారని వివరించింది. అది ఎప్పుడనేది వాటికన్ సిటీ తెలియజేయలేదు.

పోప్ ఫ్రాన్సిస్ మన దేశాన్ని విజిట్ చేయనున్నారు. 2021 అక్టోబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాటికన్ సిటీని సందర్శించారు. ఆ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ తో ఆయన సుమారు గంటపాటు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధాని గౌరవార్థం పోప్ ఫ్రాన్సిస్ పవిత్ర బైబిల్ ను బహూకరించారు. అదే సమయంలో భారత పర్యటనకు రావాల్సిందిగా మోదీ విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆయన దీనికి అంగీకరించారు. తాజాగా ఇది కార్యరూపం దాల్చబోతోంది. త్వరలో ఆసియా దేశాల పర్యటన ఉంది కాబట్టి ఈ సందర్భంగా భారతదేశాన్ని కూడా పర్యటించాలని ఆయన అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు వాటికన్ సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ఆయన భారత్ లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తాను భారత పర్యటనకు వెళ్లనున్నట్లు స్వయంగా పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. కాంగో, దక్షిణ సూడాన్ దేశాలలో ఆరు రోజుల పాటు పోప్ ఫ్రాన్సిస్ పర్యటించారు. ఈ పర్యటన ముగియడంతో దక్షిణ సూడాన్ నుంచి తన పాపల్ ఫ్లైట్లో రోమ్ కు బయలుదేరారు. ఇది ఆయన అధికారిక విమానం. తాజాగా ఆయన ఈ విమానం నుంచే విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది భారత్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో మంగోలియాను సందర్శించనున్నట్లు పోప్ అన్నారు. అక్కడి నుంచి భారత్ కు వెళ్తానని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే- 1999 తరువాత భారత పర్యటనకు రానున్న తొలి పోప్ ఆయనే అవుతారు.

1999లో అప్పటి పోప్ జాన్ పాల్ భారత్ లో పర్యటించారు. ఆ సమయంలో భారత ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయితో పోప్ భేటీ అయ్యారు. కొన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత ఇప్పటివరకు మరే ఇతర పోప్ భారతదేశాన్ని పర్యటించేందుకు రాలేదు. తాజాగా పోప్ ఫ్రాన్సిస్.. భారత్ లో పర్యటించడానికి అంగీకరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన తాను ఫ్రాన్స్ లోని మెర్సిల్లె సిటీని సందర్శించనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. అక్కడ ఏర్పాటయ్యే బిషప్ ల సమావేశంలో పాల్గొంటానని అన్నారు. అనంతరం అక్కడి నుంచి మంగోలియాకు వెళ్తానని తెలిపారు. మంగోలియా తరువాత తన తదుపరి పర్యటన షెడ్యూల్ లో భారత్ ఉంటుందని వివరించారు. 2024లో తాను భారత్ ను సందర్శిస్తానని చెప్పారు.

పోప్ ఫ్రాన్సిస్ ఆధునిక భావాలు కలిగిన వారుగా చెబుతున్నారు. ఆ మధ్య ఓ అంశంపై ఆయన స్పందించారు. ‘దేవుడు తన పిల్లలు ఎలా ఉన్నా ప్రేమిస్తాడనీ.. హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్న చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. LGBTQ కమ్యూనిటీని చర్చికి స్వాగతించాలని కేథలిక్ బిషప్‌లకు పిలుపునిచ్చారు. హోమోసెక్సువల్‌గా ఉండటం నేరం కాదన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణించే చట్టాలను, అదేవిధంగా LGBTQ కమ్యూనిటీ పట్ల వివక్ష ప్రదర్శించే చట్టాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కేథలిక్ బిషప్‌లు సమర్థిస్తున్న విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ అంగీకరించారు. హోమోసెక్సువాలిటీ అనేది నేరం కాదని చెప్పారు.

అందరి గౌరవాన్ని గుర్తించే విధంగా బిషప్‌లు మారవలసి ఉందని చెప్పారు. దేవునికి మనలో ప్రతి ఒక్కరిపైనా సున్నితత్వం, దయ ఉంటాయని, అదేవిధంగా బిషప్‌లు కూడా వ్యవహరించాలని అన్నారు. హోమోసెక్సువాలిటీ విషయంలో నేరం, పాపం వేర్వేరని తెలిపారు. ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని ది హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పోరాడుతోంది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, స్త్రీతో స్త్రీ కానీ, పురుషునితో పురుషుడు కానీ పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని సుమారు 60 దేశాల చట్టాలు చెప్తున్నాయి. వీటిలో 11 దేశాల్లో ఈ నేరానికి మరణ శిక్ష కూడా విధిస్తున్నారు. ఈ విషయంపై పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించడం లేదు. అయితే కొందరు మాత్రం ఆయనతో కలసి నడుస్తామంటున్నారు.

Must Read

spot_img