నిధులు ఇచ్చానంటూ సుకేశ్ ఆరోపణలపై పాటియాలా కోర్టు ఉన్నతస్థాయి కమిటీ విచారణకు ఆదేశించింది. దీంతో నెక్ట్స్ ఏమిజరగనుందన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఆప్ పై సుకేశ్ ఆరోపణల వెనుక .. రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నాయని ఆ పార్టీ చెబుతోంది. అసలు సుకేశ్ ఆరోపణలు ఏమిటి..? దీనిపై కోర్టు
ఏమిచేయనుందన్నదే ఆసక్తికరంగా మారింది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఆ పార్టీకి రూ.60కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేశ్ వాంగ్మూలాన్ని స్వీకరించిందని న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు. దీనిపై అక్కడే ఉన్న సుకేష్ లాయర్ అనంత్ మాలిక్ కూడా స్పందించాడు. సుకేష్ చేసిన ఈ ఆరోపణపై ఢిల్లీ, పాటియాలా హౌజ్ కోర్టుకు చెందిన హై పవర్డ్ కమిటీ స్పందించిందని, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న కమిటీ దీనిపై విచారణ జరుపుతుందని లాయర్ తెలిపాడు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ కోసం సుకేష్ చంద్రశేఖర్ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. ప్రముఖ వ్యక్తుల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేశాడని సుకేష్‌పై అభియోగాలున్నాయి.
ప్రస్తుతం సుకేష్మం డోజి జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. సుకేష్ ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ తాను ఆమ్ ఆద్మీ
పార్టీ నేతలకు డబ్బులు ఇచ్చినట్లు ఆరోపించాడు. సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. అతన్ని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉంటే, ఆయన వాంగ్మూలాన్ని ఉన్నత స్థాయి కమిటీ స్వీకరించి, తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. అంతకుముందు పంజాబ్‌లో ఎన్నికల సందర్భంగాఆమ్ ఆద్మీ పార్టీకి కోట్ల రూపాయల నిధులు సమకూర్చిపెట్టినట్లు చెప్పాడు. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ కూడా రాశాడు. తాను ఎవరి ఒత్తిడి వల్ల ఈ లేఖలు రాయలేదని, తానే సొంతంగా లేఖలు రాసినట్లు చెప్పాడు.
జైళ్లో తనకు భద్రత కల్పించడం కోసం ఆప్ నేత, నాటి జైళ్ల శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు రూ. 10కోట్లు ఇచ్చానని సుకేశ్ మరోసారి ఆరోపణలు చేశాడు. అలాగే, అప్పటి జైళ్ల శాఖ డెరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ కు రూ. 12.50 కోట్లు ఇచ్చానన్నాడు. ఇవి కాకుండా, రాజ్య సభ సభ్యత్వం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 కోట్లు ఇచ్చానని మరోసారి ఆరోపణలు చేశాడు. తాజాగా ఈ ఆరోపణలను ఈ అంశంపై విచారణ జరుపుతున్న ఉన్నత స్థాయి కమిటీ ముందు కూడా పునరుద్ఘాటించాడు. సుకేశ్ ఆప్ పై చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, అవి విచారణార్హమైనవని, అందువల్ల వాటిపై లోతైన విచారణ జరపాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించిందని మాలిక్ వెల్లడించాడు.
గతంలో, ఇవే ఆరోపణలను ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా నేతృత్వంలోని కమిటీ ముందు కూడా సుకేశ్ చేశారు. సుకేశ్ అక్రమంగా సంపాదించిన డబ్బు నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించారన్న ఆరోపణలపై బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలను కూడా ఈడీ విచారించింది. ఇదిలా ఉండగా.. మనీలాండింగ్ కేసులో సుకేశ్ భార్య లీనా మరియా పాల్‌కు చెందిన 26 కార్లను స్వాధీనం చేసుకునేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డిసెంబర్ 23 నుంచి బహ్రెయిన్ వెళ్లేందుకు కోర్టులో దరఖాస్తు చేసింది. ఈ విషయంపై ఈ నెల 22లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. సుకేశ్ చంద్ర శేఖర్ ఆరోపణలపై ఆప్ గతంలోనే స్పందించింది.
అతడు తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అని, అలాంటి వాడి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. సుకేశ్ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నాడని, బయటకు వచ్చిన తరువాత అతడు బీజేపీలో చేరడం ఖాయమని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది.మనీ లాండరింగ్, పలువురిని మోసం చేసిన ఆరోపణలపై ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఆప్ నాయకులకు డబ్బు చెల్లించానని, ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలిశానని పునరుద్ఘాటించారు. పార్టీ కోసం రూ.500 కోట్లు సేకరించాలని కేజ్రీవాల్ తనను అడిగారని, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తనను బెదిరించారని చంద్రశేఖర్ ఆరోపించారు. తనను రాజ్యసభకు నామినేట్ చేస్తానని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాను రూ.50 కోట్లకు పైగా ఇచ్చానని, ఆ తర్వాత కేజ్రీవాల్ 2016 లో జైన్ తో కలిసి విందులో పాల్గొన్నారని చంద్రశేఖర్ గతంలో పేర్కొన్నారు. జైలులో తన భద్రత కోసం జైన్ 2019 లో రూ .10 కోట్లు వసూలు చేశాడని చంద్రశేఖర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాసిన లేఖలో ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ .500 కోట్లు ఇవ్వడానికి 20 కంటే ఎక్కువ మందిని తీసుకురావాలని కేజ్రీవాల్ తనను బలవంతం చేశారని చంద్రశేఖర్ ఆరోపించారు. సౌత్ జోన్ లో పార్టీలో తనకు ముఖ్యమైన పదవి ఇస్తానని, విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారని, అందుకే తాను ఆప్ కు రూ .50 కోట్లకు పైగా ఇచ్చానని జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోపించారు. డబ్బు తీసుకుని ప్రస్తుతం తనను సత్యేంద్ర జైన్ బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఇటీవల ఈడీ దర్యాప్తులో దీని గురించి తాను అధికారులకు చెప్పినట్లు సుకేశ్ పేర్కొన్నాడు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపాడు. 2017లో అరెస్టయిన తర్వాత తిహాడ్ జైల్లో ఉంచగా, అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ తనను కలిశారని, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డబ్బు గురించి దర్యాప్తు సంస్థలకు ఏమైనా చెప్పావా? అని అడిగారని తెలిపారు.
ఆ తర్వాత 2019లో మరోసారి అరెస్టయినప్పుడు సత్యేంద్ర జైన్ తన సెక్రటరీ, మరో సన్నిహితుడితో జైలుకు వచ్చి నన్ను కలిశారు. జైల్లో రక్షణ,సదుపాయాలు కల్పించాలంటే ప్రతినెలా తనకు రూ.2 కోట్లు కట్టాలని జైన్ డిమాండ్ చేశారు. అంతేగాక డీజీ సందీప్ గోయెల్‌కు ప్రతినెలా రూ.1.5కోట్లు ఇవ్వాలన్నారు. తనపై ఒత్తిడి పెంచి కొన్ని నెలలు బలవంతంగా కట్టించుకున్నారు. అలా సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, సందీప్ గోయెల్‌కు రూ.12.5 కోట్లు చెల్లించాను. జైన్‌కు డబ్బులు ఇచ్చినట్లు నా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించింది ఈడీ. సుఖేశ్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని అయినప్పటికీ అతనితో స్నేహంగా ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. సుకేశ్ చంద్రశేఖర్‌తో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అతని నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది.
దాదాపు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైనా సుకేశ్ గురించి ముందే తెలిసినా.. అతడి నుంచి విలువైన బహుమతులుతీసుకోవడంలో ఆమె ఎలాంటి సంకోచం వ్యక్తం చేయలేదని ఈడీ అధికారులు తెలిపారు. ఎంతో విలువైన డిజైనర్ బ్యాగులు, వజ్రాలు, బ్రాస్‌లెట్లు, జిమ్ సూట్లు, మినీ కూపర్ ఇలా చాలా విలువైన వస్తువులు తను తీసుకుందని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులను జాక్వెలిన్‌కు సుకేశ్ఇచ్చాడని అధికారులు వివరించారు.
ఆప్ పార్టీకి నిధులు ఇచ్చానంటూ సుకేశ్ గతంలోనూ ఆరోపణలు చేసినా, తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..