Homeతెలంగాణఓరుగల్లు గడ్డపై ఫ్యాక్షనిజమా..? రాజుల ఇలవేల్పులో రాజకీయ సెగలు

ఓరుగల్లు గడ్డపై ఫ్యాక్షనిజమా..? రాజుల ఇలవేల్పులో రాజకీయ సెగలు

*వరంగల్ లో వేళ్ళూనుకుంటున్న ఫ్యాక్షన్ రాజకీయాలు
*మరో రాయలసీమగా మారుతున్న పోరాటాల పురిటిగడ్డ

వరంగల్..ఈ పేరు వింటే చరిత్ర గుర్తుకువస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్నో పోరాటాలకు నాంది పలికిన గడ్డగా పేరుగావించింది. కాకతీయుల రాజవంశం యొక్క పురాతన రాజధానిగా కోనసాగింది ఈ గడ్డ. రాణి రుద్రమ దేవి నడయాడిన ఈ నేలపై ఇప్పుడు ఏం జరుగుతోంది. ఒకప్పుడు ఓరుగల్లు పేరు చేబితే ఉద్యమాల ఊపిరి మనకు తగులుతుంది. అలాంటి పోరాటాల పురిటిగడ్డపై ఫ్యాక్షన్ రాజకీయాలు వేళ్ళూనుకుంటున్నాయి. ప్రస్తుత రాజకీయాలు రణ రంగాన్ని తలపిస్తున్నాయి. ఘన చరిత్ర కలిగిన గడీలకు ఫ్యాక్షన్ రంగు పులుముతున్నాయి. పరస్పరం రాజకీయ కక్షలతో ప్రత్యక్ష దాడులకు దిగుతూ…ఘన కీర్తికి తలవంపులు తెస్తూ..తెలంగాణలో రౌడీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తూ..పురిటిగడ్డను మరో రాయలసీమగా మార్చబోతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంగా ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ర్టం కోసం జరుగుతున్న ఉద్యమానికి ఊపిరి పోసిన వరంగల్ జిల్లా… తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన
ఘన చరిత్ర ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉద్యామాలకు నాంది పలికి నూతన శకానికి బీజం వేసింది. ప్రజల్లో రాజకీయ చైతన్యానికి నాంది పలికి, తెలుగువారి జీవనగతినే మార్చేసిన ఓరుగల్లు ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. తెలంగాణ నేలలో జరిగిన పోరాటాలు ప్రపంచ విముక్తి పోరాటాలకు ప్రేరణగా నిలిచింది ఈ నేల. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరాటాలకు ప్రాణం పోసి దేశంలో భూసంస్కరణలకు కారణమయింది. ఈ నేలపైన సాగిన ఉద్యమాలు చరిత్రకే కొత్త పాఠాలు నేర్పాయి. అదే స్పూర్తి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఆ ఉద్యమం కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికింది.

ప్రతిఘటనలకు కేరాఫ్ వరంగల్…

ఉద్యమాల ప్రయోగశాల, పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వరంగల్ పేరు అప్పటినుండి ఇప్పటివరకు అనేక సందర్భాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో జిల్లా వాసులు ఉద్యమానికి సహాకరించని ఎంతో మందిని ఉద్యామాల గడ్డపై అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న సందర్భాలు చాలనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ఆర్ పార్టీ అధినేత ప్రస్తత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన చెల్లి వైఎస్ షర్మిలాతో పాటు పలువురిని జిల్లాలోకి రానీయకుండా అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. అంటే ఈ ప్రాంత ప్రజలకు అంత పట్టింపులు ఉంటాయని తెలుస్తుంది. కానీ ప్రస్తుతం కొందరి రాజకీయ నాయకుల వ్యక్తిగత స్వార్థం కోసం ఇక్కడి విష సంస్కృతిని నింపుతున్నారు. అక్కడి ప్రజలకు లేని పోనివి నూరిపోస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఓరుగల్లును కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నారు. ఒక పార్టీ వారు మరో పార్టీ వారిపై రాజకీయ కక్షలు నింపుతూ…హత్యారాజకీయాలకు తెరలేపుతున్నారు. రాష్ట్రమంతా పాదయాత్రలు చేయడం, సభలు సమావేశాలు పెట్టడం ఒక ఎత్తైతే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలు చేయడం, సభలు, సమావేశాలు పెట్టడం ఒక ఎత్తు అన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ వ్యక్తమవుతోంది. తాజాగా ఓరుగల్లులో జరిగిన ఘటన నేపథ్యంలో వరంగల్ పేరు మరోమారు చర్చనీయాంశంగా మారింది.

అసలు దాడులను ప్రేరేపించింది ఎవరు..?

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రతి సందర్భంలో పలు పార్టీలపై, పార్టీ నాయకులపై ప్రజలు దాడులు చేస్తున్నారు. అసలు ఈ దాడులకు కారణం ఎవరు..? ప్రజలను రెచ్చగోడుతున్న శక్తులు వారి మద్యనే ఉన్నారా ..? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. అయితే ఇక్కడ కామన్ గా వినిపిస్తున్న దాని ప్రకారం చూస్తే..ఓ నాయకుడు తనకు అడ్డువచ్చిన వారిపై దాడులకు దిగుతాడు అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత కక్షలను కూడా ఇప్పుడు తీర్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా కాంగ్రెస్ యూత్ నాయకుడిపై కూడా పలువురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడుల వెనుక కూడా ఆ నాయకుడి హస్తం ఉందనే అనేమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు కాంగ్రెస్ నాయకులు.

నాయకులపై ఆగని దాడులు..!

రేవంత్ రెడ్డి పాదయాత్ర హన్మకొండ రాజకీయాలలో మరో సారి కాక రేపుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర తరువాత కాంగ్రెస్ యూత్ నాయకుడి పైన దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు కారణం అయింది. వరంగల్ యూత్ కాంగ్రెస్ నాయకుడు తాటి పవన్ పై దాడి ఘటన సంచలనం రేపుతుంది. గత రాత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ముగిసిన వెంటనే యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై హత్యాయత్నం జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా దద్దమ్మ దాస్యం వినయ్ భాస్కర్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో, బీఆర్ఎస్ కార్యకర్తలు పవన్ ను ఒక గల్లీలోకి తీసుకువెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న తోట పవన్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తోట పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో ఇదే మాదిరిగా వరంగల్‌ నగర పాలక సంస్థ 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళిని కూడా దారుణంగా హత్యకు గురైయ్యారు. అప్పటి హత్య కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు ఉండటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.

Must Read

spot_img