ఉక్రెయిన్ పై గత కొన్ని నెలలుగా యుద్దం చేస్తోంది రష్యా.. అయితే.. యుద్దం మొదలైన మొదట్లో దూకుడు చూపించిన రష్యా.. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను ఆక్రయించింది.. ఆ తర్వాత ఉక్రెయిన్ తిరిగి తమ నగరాలను స్వాధీనం చేసుకుంటూ వస్తోంది.. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అణుదాడికి సిద్దమైనట్లు తెలుస్తోంది..ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబుల దాడికి సిద్దమైందా..? పుతిన్.. ఉక్రెయిన్ పై అణుదాడికి సిద్దమైనట్లు వార్తల నేపథ్యంలో.. భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారా..?
ఒక్క ఫోన్ కాల్ తోనే పుతిన్ అణ్వాయుధాల దాడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మోదీ చేశారా..?
ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. నాటో దేశాల సహాయంతో ఉక్రెయిన్ యుద్దంలో వెనక్కి తగ్గడం లేదు.. మరోవైపు రష్యా కూడా యుద్దం తీవ్రతరం చేసింది.. దీంతో ఇరుదేశాలు సై అంటే సై అంటోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్స మర్థవంతంగా అడ్డుకుంటోంది.
ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యాపై అమెరికా సహా నాటో దేశాలు పలు ఆంక్షలు విధించాయి.. రష్యాను యుద్దంలో ఓడించేందుకు వాటి శక్తిమేర ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఉక్రెయిన్ లోని స్వాదీనం చేసుకున్న పలు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్.. ఈ పరిణామాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్ర అసహనానికి, అసంతృప్తి గురి చేస్తోన్నట్లుగా కనిపిస్తోంది. రోజుల తరబడి యుద్ధం సాగుతోండటం, నాలుగైదు కీలక నగరాలపై ఆధిపత్యాన్ని చేజార్చుకోవడం, తరచూ యుద్ధంలో వెనకడుగు వేస్తోండటం.. పుతిన్ ను ఆగ్రహానికి గురి చేస్తోన్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందటే ఉక్రెయిన్ యుద్ధాన్ని పర్యవేక్షిస్తోన్న సైన్యాధికారిని కూడా మార్చడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది…
ఉక్రెయిన్ ను చాలా తక్కువగా అంచనా వేసి.. యుద్దంలోకి దిగిన రష్యాకు ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ఈ నేపథ్యంలో- వ్లాదిమిర్ పుతిన్ మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశం లేకపోలేదంటూ విదేశీ మీడియా సైతం అంచనా వేస్తోంది. అణు క్షిపణిని ప్రయోగించడానికీ పుతిన్ వెనుకాడే పరిస్థితులు లేవని చెబుతోంది.
తమ ఆధీనంలో ఉన్న డొనాట్స్క్‌ను సైతం ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే దిశగా అడుగుల వేస్తోన్నందున పుతిన్- అణు క్షిపణిని ప్రయోగించడానికి మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది.. అయితే.. రష్యా.. అణుదాడులకు దిగనుందనే వార్తల నేపథ్యంలో భారత్, చైనాలు స్పందించాయి.. ఈ వార్తలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ తమ వైఖరిని స్పష్టం చేశారు.
అణ్వాయుధాలను ప్రయోగించాలనే ఆలోచన రష్యాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని, భవిష్యత్‌లోనూ ఆ దేశం పట్ల ఉన్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చివేస్తుందని తేల్చి చెప్పారు. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ విలియం బర్న్స్ ఈ విషయాన్ని తెలిపారు. అణు యుద్ధం ముప్పు గురించి ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
భయపెట్టడానికే.. మోదీ, జిన్‌పింగ్ కూడా అణ్వాయుధాల వినియోగంపై తమ తమ ఆందోళనలను లేవనెత్తారని, అది రష్యా దూకుడును నియంత్రించినట్టుగా తాను భావిస్తున్నట్లు సీఐఏ చీఫ్ చెప్పారు. అణ్వస్త్రాలను ప్రయోగించితే అది రష్యాపై కూడా ప్రభావం చూపుతుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను భయపెట్టడానికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రతిపాదనలను తెర మీదికి తీసుకుని ఉండొచ్చని అన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబుల దాడికి సిద్దమైందా..?
మోదీకి రెండు రోజుల కిందటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి పలు విషయాలపై సంభాషించారు… జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం నిర్వహించబోయే ఈ సదస్సులో పాల్గొంటానని సూచనప్రాయంగా వెల్లడించారు పుతిన్… జీ20 అధ్యక్ష పదవి లభించడంలో సహకరించారంటూ ప్రధాని మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలోనే అణ్వస్త్రప్రయోగ ప్రతిపాదనల గురించి పుతిన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కాగా- ఉక్రెయిన్‌పై అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణిని ప్రయోగించడానికి రష్యా సంసిద్ధంగా ఉందంటూ వార్తలు వెలువడిన రెండో రోజే పుతిన్.. ప్రధాని మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అణ్వాయుధాలను ప్రయోగించడానికి పుతిన్సం సిద్ధతను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనను కలుసువడానికి మోదీ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనితో మోదీని బుజ్జగించడానికి పుతిన్ ఈ ఫోన్ కాల్ చేశారనే వాదనలు కూడా లేకపోలేదు. ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణిని పుతిన్ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి.. 1939-1945 మధ్యకాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో
అమెరికా సైన్యం..
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై సంధించిన అణుబాంబు కంటే 12 రెట్లు శక్తిమంతమైన క్షిపణి ఇది. 1945 ఆగస్టు 6వ తేదీన బీ-29 బాంబర్ ద్వారా హిరోషిమాపై ఈ బాంబును జారవిడిచారు అమెరికా సైనికులు. ఈ దాడిలో లక్షమందికి పైగా మరణించారు. మరి.. గతంలో చేసిన అణుదాడితోనే ఎంతో భయానక పరిస్థితిలు ఏర్పడ్డాయి.. ఆ సమయంలో వేసిన అణుబాంబులకు 12 రెట్లు శక్తివంతమైన అణుబాంబులతో దాడి చేస్తే.. ఎలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందో మన ఊహకు కూడా అందకపోవచ్చు.. మరి.. అలాంట దారుణమైన పరిస్థితులు ఏర్పడకుండా పుతిన్ ను భారత ప్రధాని మోది అడ్డుకోవడం.. అతని శక్తి సామర్ధ్యాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు….
ఉక్రెయిన్ తో యుద్దం చేస్తోన్న రష్యాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ఈ నేపథ్యంలో పుతిన్ కఠిన నిర్ణయాలు తీసుకుని.. అణుబాంబు దాడులకు సిద్దమైనట్లు తెలుస్తోంది.. అయితే.. భారత ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత అణుదాడి చేయకుండా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది..