HomePoliticsఏపీలో పవన్ వ్యాఖ్యలు .. చర్చనీయాంశంగా మారాయి.

ఏపీలో పవన్ వ్యాఖ్యలు .. చర్చనీయాంశంగా మారాయి.

ఏపీలో పవన్ వ్యాఖ్యలు .. చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే పవన్ విఫల నేత నా..? నిజానికి అలా .. ఒప్పుకునే ధైర్యం .. ఈనాటి రాజకీయ నేతల్లో ఉందా..? అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయ భావజాలానికి వ్యతిరేకంగా పూర్తిగా రియలైజేషన్ తో పవన్ 37 నిమిషాల పాటు ప్రసంగించారు

ఏపీలో వైసీపీ నేతలది ఒకటే పంథా. వారికి ఎదురుదాడి తప్ప మరో ఆలోచన తెలియదు. రాదు కూడా. ప్రత్యర్థులపై మాటల దాడి చేయడం, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మంచిని ఆహ్వానించలేరు. మంచి మాటలను స్వాగతించలేరు. సమయం, సందర్భం అనేది చూడరు. తమ రాజకీయానికి పనికొస్తుందన్న ఏ అంశాన్ని జారవిడుచుకోరు. ఇప్పుడు పవన్ విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు.

ఆయన ఆలోచనతో మాట్లాడినా సహించలేకపోతున్నారు. ఆవేశంతో మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. తాజాగా పవన్ చేసిన విఫలనేత అన్న కామెంట్స్ ను వైరల్ చేసి కాక రేపుతున్నారు. పవన్ ను ఏపీ సమాజంలో ఒక బలహీనమైన నేతగా చూపే ప్రయత్నాలు ప్రారంభించారు.

పవన్ తాజాగా చేసిన ప్రసంగం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఆయన చేసింది రాజకీయ ప్రసంగం కాదు. పైగా ఈ రాష్ట్రంలోనూ కాదు. శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు ఇండియాలో వివిధ ప్రాంతాల విద్యార్థుల కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ సంస్థ ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో చేసిన కీలక ప్రసంగం అన్న మాట మరిచిపోతున్నారు.

రాజకీయ భావజాలానికి వ్యతిరేకంగా పూర్తిగా రియలైజేషన్ తో పవన్ 37 నిమిషాల పాటు ప్రసంగించారు. చివర్లో ఐదు నిమిషాలు తప్పించి, అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ పవన్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. విద్యార్థి, యువతను విశేషంగా ఆకట్టుకున్న పవన్ స్పీచ్ ఏపీలో వైసీపీ శ్రేణులకు మాత్రం కంటగింపుగా మారింది. నిగూడార్థాలతో, వాస్తవికతకు దగ్గరగా ఉన్న పవన్ మాటలను ఇప్పుడు ఫెయిల్యూర్స్ గా చూపించి జన సైనికుల ఆత్మస్థైర్యంపై దెబ్బ కొట్టేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.

తనను తాను ఒక ఫెయిల్యూర్ లీడర్ నని చెప్పి.. దాని నుంచి సక్సెస్ అందుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వివరించే యత్నం చేశారు. విద్యార్థులకు ప్రేరణ కలిగించేందుకు పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా నిర్వాహకులు తనను ఆహ్వానించినందున అక్కడకు వెళ్లి సుదీర్ఘ సమయం కేటాయించారు.

కానీ దానిని కూడా రాజకీయ ప్రయోజనాలక వాడుకునేందుకు వైసీపీ నేతలు కొంతమంది యత్నించడంపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తాజా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్టు అయ్యింది. పవన్ తాను విఫల నేతను అనుకుంటున్నారని, ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారని వైసీపీ నేత ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ ను ఒక రాజకీయ పార్టీ అధినేతగా కూడా ఆయన ఒప్పుకోలేదు.

సినిమా హీరోగా అభివర్ణిస్తూ పోస్టు పెట్టారు. దీనినే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా తెగ ట్రోల్ చేస్తోంది. ఇకనైనా జన సైనికులు కళ్లు తెరవాలని కూడా
సూచిస్తున్నారు. పవన్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నేతనని.. ప్రజల్లో కూడా అదే భావన ఉందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై జన సైనికులు, అభిమానులు అదేస్థాయిలో రియాక్టవుతున్నారు. కళ్లుండి చూడలేని మేత నేతలు వైసీపీ వారంటూ ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితంపై ఊహించని వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల్లో ఎవరు ఫెయిల్యూర్ నేతలో తేలిపోతుందని జన సైనికులు సవాల్ చేస్తున్నారు. తానొక ఫెయిల్డ్ పొలిటీషియన్. నా ఓటమిని నేను ఒప్పుకుంటాను. ఓటమి విజయానికి దగ్గర చేస్తుంది. అందుకే నా ఓటమిని ఒప్పుకుంటాను. వైఫల్యాల గురించి నేనెప్పుడూ చింతించను. ఎందుకంటే నేను ఏదొకటి సాధించాను. చాలా మంది సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటారు. కానీ ప్రయత్నించరు. నేను వాళ్లలా కాదు.

సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనమే నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే మన దేశానికి పెట్టుబడి అని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితంపై ఊహించని వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో విఫలమయ్యానన్నారు. అయితే ఓటమి తన విజయానికి పునాదులు వేస్తాయని స్పష్టం చేశారు.

తాను విఫల రాజకీయ నాయకుడినని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. అక్కడున్న విద్యార్థులు.. ‘నో … నో ‘ అని గట్టిగా కేకలు వేశారు. సీఎం ..సీఎం అంటూ నినాదాలు చేశారు. పరాజయం ఎలాగైతే తాత్కాలికమైనదో విజయం కూడా తాత్కాలికమే అన్నారు.

ఓటమి విజయానికి సగం బాట వేస్తుందన్నారు. వైఫల్యాలను కూడా సానుకూల దృక్పథంతో చూస్తానన్నారు. 2014లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్ అప్పుటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి స్వస్తి చెప్పిన పవన్ వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు.

జనసేన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేగా గెలవగా, పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ ఓటమిపాలయ్యారు. ఎన్ని ఓటములు ఎదురైనా ప్రజల కోసం తన
జీవితంలో 25 సంవత్సరాలు కేటాయించానని పవన్ చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తుంది.
ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తూ తరచూ పవన్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఫెయిలయ్యానని.. కానీ మళ్లీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యామ్ వ్యాఖ్యానించారు.

పవన్ 2019లో తాను ఫెయిలయ్యానని.. కానీ ఓడిపోలేదని.. అందుకే పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని అన్నారు. వైఫల్యం అన్నది విజయానికి సగం బాట వేస్తుందని అన్నారు. అయితే పవన్ తనకు తాను విఫల రాజకీయ నేతనని చెప్పుకోవడం.. అందర్నీ ఆశ్చర్య పరిచింది. అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య జనంలోనూ ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

చెప్పు తీసి కొడతా వైసీపీ నా కొడకల్లారా.. తమాషాల్లా ఉందా కొడకల్రారా?

చెప్పు తీసి కొడతా వైసీపీ నా కొడకల్లారా.. తమాషాల్లా ఉందా కొడకల్రారా? ఇంకోసారి చెప్పు తీసుకొని పళ్లు రాలకొడతా కొడకల్లారా.. ప్యాకేజీ.. ప్యాకేజీ స్టార్ అనే సన్నాసి కొడుకులు.. వైసీపీ నా కొడుకుల్ని చెప్పు తీసి కొడతా.. అటు తిప్పి ఇటు తిప్పి పళ్లు రాలగొడతా నా కొడకల్లార్రా’ అంటూ ఆవేశంగా కాలికి ఉన్న చెప్పును తీసి చూపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు చాలామంది చాలా రకాలుగా రియాక్టు అయ్యారు. అదేంటండి.. ఆ మాత్రం మర్యాద లేకుండా మాట్లాడటమా? అంటూ బుద్ధజీవులుగా చెప్పుకునే మేధావులకు సైతం పవన్ మాటలు తప్పుగానే అనిపించాయి.

చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అంటూ ఫైరైన పవన్ లో మరో వ్యక్తి ఉన్నారన్న విషయాన్ని కన్వినీయంట్ గా మర్చిపోయే చాలామందికి తానేమిటో.. తన మాటల సత్తా ఏమిటో తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా చాటి చెప్పారు.

పెద్దగా చదువు సంధ్యలు లేకున్నా.. పట్టాలు లేకున్నా.. సమాజం మీద తనకున్న అనురక్తి.. చుట్టూ ఉన్న ప్రజల మీద ఉన్న మమకారం.. వారి బతుకుల్లో రావాల్సిన మార్పు మీద ఉన్న అవగాహన ఉన్న నేతగా ఆయన మాటలు ఉన్నాయన్న వాదన విశ్లేషకుల్లో సైతం వ్యక్తమైంది. సమకాలీన రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన విజన్.. నిజాయితీ ఎంతన్నది పవన్ తాజా ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది.

రాజకీయాల్లో తానో విఫల నాయకుడన్న మాటను నిజాయితీగా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేందుకు పవన్ వెనుకాకడకపోవటం ఒక ఎత్తు అయితే.. ఆ మాట చెప్పేంత ధైర్యం ఇవాల్టి రోజుల్లో ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. అన్నింటికి మించి తాను ఫెయిల్ అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని.. అందుకోసం శ్రమిస్తానన్న విషయాన్ని ఆయన చెప్పిన తీరు చూస్తే.. పవన్ మీద అభిమానం.. గౌరవం మరింత పెరగక మానదు.

విశ్లేషకులు సైతం పవన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. పవన్ తనను తాను విఫల నేతగా పరిధి తగ్గించుకోలేదని.. పరిణితితో కూడిన వ్యాఖ్యలే చేశారని అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పురుడుబోసుకుంది జనసేన. వెంట ఎవరూ లేరు.. మరో ప్రజారాజ్యం అంటూ ఎగతాళి చేశారు.

పీఆర్పీ పర్యవసానాలతో అసలు పార్టీ నడిపించగలడా అని కామెంట్స్ చేశారు. అసలు ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోగలడా? అని ప్రశ్నించారు. మరో జాతీయ పార్టీలో జనసేన విలీనం కాక తప్పదని విశ్లేషించారు. ఏపీ రాజకీయ యవనికపై జనసేనను నిలబెట్టారు. అజేయమైన శక్తిగా, ప్రజాభిమానం చూరగొంటున్న పార్టీగా తీర్చిదిద్దారు.

2024 ఎన్నికల్లో జనసేన లేని ప్రభుత్వం ఊహించుకోలేమన్న విశ్లేషణ స్థాయికి పార్టీని నిలబెట్టగలిగారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్పుకు, సంచలనలకు కేంద్రమవుతున్నారు. చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి.. కావాల్సిన పార్టీగా జనసేన నిలబడింది. పవన్ తాను చెప్పుకుంటున్నట్టు ఫెయిల్యూర్ నేత కాదని.. ఫెయిలైనట్టు కూడా కాదని.. అతనొక సక్సెస్ పుల్ లీడర్ గా ఏపీ రాజకీయ యవనికపై నిలబడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.\

మరి పవన్ విఫల నేతనో .. కాదో అన్నది వచ్చే ఎన్నికలే తేల్చి చెప్పనున్నాయి.

Must Read

spot_img