HomePoliticsపవన్ వర్సెస్ అంబటి..

పవన్ వర్సెస్ అంబటి..

పవన్, అంబటి మధ్య రాజకీయం .. రచ్చ చేస్తోందా… జనసేన దెబ్బకు అంబటి సైలెంట్ అయ్యారా..? ఇది ఆయనకు ఇమేజ్ డ్యామేజీనే కాక .. రాజకీయ భవిష్యత్ పైనా ప్రభావం చూపనుందా..?

వైసీపీ, జనసేన మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ నేతల దుశ్చర్యలను బహిరంగ సభల వేదికగా వారి నియోజకవర్గంలోనే ప్రజల ముందు ఉంచుతున్నారు జనసేన పార్టీ నేతలు. దీంతో కౌంటర్ ఎటాక్ దిగుతున్న వైసీపీ, నిరూపిస్తే రాజీనామా చేస్తామంటూ సవాళ్లు చేస్తున్నారు. అవినీతికి ఆధారాలు చూపితే అవి కుట్ర అంటూ అధికారపార్టీ నేతలు జారుకుంటున్నారని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

లంచం ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న సవాల్ కు కట్టుబడి మంత్రిపదవికి అంబటి రాంబాబు రిజైన్ చేయాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పరిహారంలో కమీషన్లు వసూలు చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు అంటూ… సత్తెనపల్లి సభలో జనసేన అధినేత పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లబ్ధిదారులకు అందాల్సిన పరిహారంలో కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.

జనసేనాని విమర్శలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు, తాను కమీషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరించే ప్రయత్నం చేశారు. జనసేన అధినేత పవన్ తన పై చేసిన లంచం ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అంబటి ప్రకటించిన 24 గంటలలోపే బాధితులు బయటకొచ్చారు.

తమ కుమారుడు చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో వైసీపీ నేతలు, మంత్రి అంబటి రాంబాబు వాటా అడుగుతున్నారని చెప్పారు. సెప్టిక్ ట్యాంక్
క్లీన్ చేస్తుండగా తమ కొడుకు చనిపోతే, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం వచ్చిందని తెలిపారు. అయితే చెక్కు ఇవ్వాలంటే రెండున్నర లక్షల లంచం ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

జనసేన ఆధారాలు బయటపెట్టడంతో తన సవాల్ పై మంత్రి అంబటి రాంబాబు మాటమార్చారు. జనసేన కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి ఇచ్చే పరిహారం డబ్బుల్లో లంచం తీసుకునే దౌర్భాగ్య స్థితిలో తాను లేనని ఆయన అన్నారు.

పరిహారం ఇప్పించిందే తానని చెప్పారు. ప్రభుత్వం చెక్ విడుదల చేసి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు అందజేయలేదని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కమీషన్ ఇవ్వడానికి అంగీకరించకపోవడంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారని చెబుతున్నారు.

ఈ ఎపిసోడ్ లో మంత్రి అంబటి రాంబాబు పైన అటు జనసేనికులు, ఇటు తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేస్తున్నారు. రాజీనామా ఎప్పుడు చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గ‌తంలో ఎన్నో వివాదాలు, ఆరోప‌ణ‌లు వ‌చ్చినా త‌ట్ట‌ుకుని నిల‌బ‌డ్డ వైసీపీ నేత‌, ప్ర‌స్తుత నీటిపారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు.. ఇప్పుడో చిన్న వివాదం చినికి చినికి గాలివాన‌లా మారుతుండడంతో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ నే ప్ర‌శ్నార్థ‌కం చేసుకునేలా క‌నిపిస్తున్నారు.

మంత్రి స్థాయికి ఇలా ఎందుకు కక్కుర్తి పడతారని ముందు సందేహాలు రేకెత్తినా.. ఆ తర్వాత స్వయంగా బాధితులు అంబటి తమతో ఎంత దారుణంగా వ్యవహరించాడో పూసగుచ్చినట్లు మీడియాకు వివరించడంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ వ్యవహారం మీద అంబటి మీడియా ముందుకు వచ్చి ఎంత సమర్థించుకుందామని చూసినా.. ఆయన వాదన నిలబడలేదు.

ఈ ఆరోపణలు నిజం కాని పక్షంలో బాధితులకు ఎప్పుడు పరిహారం మంజూరైంది, వాళ్లకు ఎప్పుడు డబ్బులు ఇచ్చింది లేదా ఇవ్వనుందన్న వివరాల్లోకి వెళ్లి ఉండాలి. కానీ అంబటి ఆ టాపిక్కే రానివ్వకుండా ఎదురుదాడి చేశారు. ఆరోపణలు చేస్తున్న జనసేన మీద విరుచుకుపడుతున్నారు. గతంలో మహిళలతో సరస సంభాషణలు సహా పలు వివాదాల్లో అంబటి చిక్కుకున్నారు.


కానీ అవేవీ ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి కాలేకపోయాయి. రెండోసారి కూడా ఆడియో లీక్ వివాదంలో చిక్కుకున్నా మంత్రి పదవిని పొందారు. ఇలా అడ్డంకులన్నీ దాటుకుని వచ్చిన అంబటికి ఇప్పుడు కేవలం రూ.2.5 లక్షల లంచం వ్యవహారం చుట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఆరోపణ అంబటి ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తోంది. పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించి, దూషణలు చేసిన అంబటి ఇప్పుడీ వివాదంతో దొరికిపోవడంతో జనసేన వాళ్లు వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలట్లేదు.

సోషల్ మీడియాలో అంబటికి చుక్కలు చూపించేస్తున్నారు. ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తా అని ఆయన చేసిన సవాల్‌ను, బాధితుల వీడియోను పెట్టి రాజీనామా చేయాల్సిందే అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మామూలుగా అయితే వైసీపీ ఇలాంటివి పట్టించుకోకుండా దులుపుకుని వెళ్లిపోయేదే.. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. ఇప్పుడిలాంటివి చూసీ చూడకుండా వదిలేయలేరు.

కాబట్టి అంబటి త్వరలో మంత్రి పదవి కోల్పోయినా.. వచ్చే పర్యాయం టికెట్ దక్కించుకోలేకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని టాక్ వినిపిస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ఎక్కువగా టార్గెట్ చేసిన అంబటి రాంబాబు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ఎక్కువగా టార్గెట్ చేసి..ఆయన కోసమే ప్రెస్ మీట్లు తిట్టే మంత్రుల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. ఇక అంబటి మంత్రిగా ఏ శాఖకు సంబంధించింది పనిచేస్తున్నారో జనాలకు పెద్దగా క్లారిటీ లేదు గాని.. ఆయన మంత్రిగా ఉన్నది పవన్‌ని తిట్టడం కోసం అని చెప్పి జనాలు గట్టిగా అనుకుంటున్నారు.

ఇక పవన్ ఎప్పుడో ఒకసారి వచ్చి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు దాన్ని పట్టుకుని అంబటి వారమంతా ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ని విమర్శిస్తారని జనసేన శ్రేణులు అంటున్నాయి.

తాజాగా పవన్..సత్తెనపల్లి వెళ్ళి అక్కడ కౌలు రైతులకు ఆర్ధిక సాయం చేసి..అంబటిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. చనిపోయిన కౌలు రైతులకు ఇచ్చే చెక్‌ల్లో అంబటి లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. ఇక తనపై ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అంబటి సవాల్ కూడా విసిరారు. ఇదే క్రమంలో తురకా గంగమ్మ అనే కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల పరిహారం వచ్చింది.

అందులో సగం ఇవ్వాలంటూ అంబటి డిమాండ్ చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. అయ్యా అంబటి ఎక్కడ దాక్కున్నావ్.. ఎక్కడికి పారిపోయావు. లంచం డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా అన్నావు. ఇదిగో నీ లంచాల బాగోతం నిరూపించాం. ఎప్పుడు రాజీనామా చేస్తావో చెప్పు అంటూ జనసేన నేతలు ఫైర్ అయ్యారు. గంగమ్మ కుటుంబానికి అన్యాయం చేశావని, తక్షణమే వారికి చెక్ ఇవ్వాలని లేదంటే ఆర్డీవో ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామని అన్నారు.

గంగమ్మ కుటుంబానికి ఏమైనా జరిగితే అంబటిదే బాధ్యత అని జనసేన నేతలు వార్నింగ్ ఇచ్చారు. అసలు సి‌ఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు ఇప్పించిందే తాను అని, అలాంటిది తాను ఎందుకు లంచం డిమాండ్ చేస్తానని, మృతుల పరిహారంలో వాటా తీసుకునే దౌర్భగ్యం లేదని ఫైర్ అయ్యారు. అటు మీడియాలో,
నెట్టింట తనపై ఇంతలా ప్రచారమవుతున్నా అందుకు తగ్గట్టు అంబటి రియాక్టు కాకపోవడం ఏమిటన్నది ప్రశ్న.. అంతకు మించి అనుమానం.

ఆరోపణల్లో నిజముండబట్టే ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. ఈ ఇష్యూలో అంబటి రాంబాబు తప్పు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొనకుంటే ఉన్న కొద్దిపాటి పరువు కూడా పోయే ప్రమాదం ఉంది. దీంతో ఆయనపై అధిష్టానం ఏం చేయనుందన్నదే ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తుందో లేదో అన్నదే చర్చనీయాంశమవుతోంది. మరోవైపు జనసైనికులు సైతం అంబటిపై .. తమ యుద్ధాన్ని రాజీనామా చేసేంతవరకు ఆపేది లేదని అంటున్నారు. ఏదేమైనా ఈ ఎపిసోడ్ .. అంబటి పొలిటికల్ కెరీర్ పై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

మొత్తానికి జనసేన మాత్రం అంబటిని గట్టిగానే టార్గెట్ చేసింది. మరి నెక్ట్స్ ఏమిటన్నదే తేలాల్సి ఉందట.

Must Read

spot_img