Homeఆంధ్ర ప్రదేశ్రాజకీయాలు వేరు.. రాష్ట్రాభివృద్ధి వేరు!!

రాజకీయాలు వేరు.. రాష్ట్రాభివృద్ధి వేరు!!

పవన్ ట్వీట్ .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. తాజాగా సమ్మిట్ విషయంలో పవన్ స్పందనకు వైసీపీ వర్గాల నుంచే మద్ధతు లభించడం చర్చనీయాంశమవుతోంది. దీంతో పవన్ గ్రాఫ్ మరింత పెరిగినట్లేనని సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇంతకీ పవన్ చేసిన ట్వీట్ ఏమిటి..? రాజకీయాలు వేరు.. రాష్ట్రాభివృద్ధి వేరు. తనకు రాజకీయాలకంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. రాష్ట్రంలోని యువత భవిష్యత్తు ముఖ్యం. ఇంత హుందాతనమైన ఆలోచన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి వచ్చింది.

రాజకీయాలు వేరు.. రాష్ట్రాభివృద్ధి వేరు. తనకు రాజకీయాలకంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. రాష్ట్రంలోని యువత భవిష్యత్తు ముఖ్యం. ఇంత హుందాతనమైన ఆలోచన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంతోనూ, ప్రజలతోనూ పంచుకున్నారు. ఫైనల్ గా శభాష్ అనిపించుకున్నారు. విశాఖ కేంద్రంగా పెట్టుబడిదారుల సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ హుందాతనంతో కూడిన ప్రకటన చేశారు. ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు వస్తున్న వారికి జనసేన స్వాగతం చెబుతోందని తెలిపిన పవన్ .. ఈ విషయంలో ప్రభుత్వానికి జనసేన పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ రెండు రోజులు ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయకూడదని నిర్ణయించుకున్నామని పవన్ స్పష్టం చేశారు. విశాలమైన సముద్ర తీరం, అపారమైన ఖనిజ సంపద, పుష్కలమైన మానవ వనరులు ఉన్న అంశాలు పెట్టుబడిదారులకు తెలియచెప్పాలని ట్విట్టర్ వేదికగా తెలిపిన పవన్ .. విశాఖలో జరగుతున్న ఈ సదస్సు ద్వారా కేవలం విశాఖకే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రభుత్వానికి స్పష్టంచేశారు. అమరావతి, తిరుపతి, కాకినాడ, శ్రీకాకుళం, అనంతపురం, ఒంగోలు, కడప, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను కూడా పెట్టుబడిదారులకు తెలియచేయాలని సూచించారు.

రివర్స్ టెండర్లు, మధ్యవర్తుల కమిషన్లు వంటి అడ్డంకులు ఏమీ లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారికి భరసా కల్పించాలని చురకలతో కూడిన సూచనలు కూడా చేశారు పవన్. ఈ పరిణితే ఇప్పుడు పవన్ ని శభాష్ అనేలా చేస్తుంది. పొలిటికల్ ప్రత్యర్థులు సైతం “శభాష్ పవన్” అని పొగిడేలా చేస్తుంది. ఇక చివరిగా రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది. రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ పార్టీ నాయకులు కూడా పవన్ వ్యవహరించిన తీరుని స్వాగతించారు.

పవన్ ఒక వ్యసనం.. ఒక పిచ్చి..ఒక వ్యామోహం.. ఒక పవర్.. ఒక సమ్మోహన శక్తి. పవన్ ను అభిమానులు వర్ణించే తీరిది. అయితే పవన్ వ్యక్తిత్వం తెలుసుకున్న తటస్థులు సైతం ఇదే అభిప్రాయానికి వస్తారు. కానీ ఈ జాబితాలో వైసీపీ శ్రేణులు సైతం చేరుతుండడం విశేషం. పవన్ మంచి మనసును అర్ధం చేసుకొని మనసున్న నేతగా అభివర్ణిస్తూ తాము మారినట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం. పేరుకే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం. కానీ అధికార పార్టీ మాత్రం జనసేననే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తుంది. పవన్ పైనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తోంది. గ్రామస్థాయి నాయకుడి నుంచి మంత్రి వరకూ.. చివరకు సీఎం జగన్ సైతం ఏ వేదిక అయినా పవన్ పైనే విమర్శలు చేస్తుంటారు.

వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. వైసీపీ శ్రేణులు సైతం పవన్ ను రాజకీయ శత్రువు, ప్రత్యర్థిగా కంటే అంతకు మించి వ్యతిరేక భావనతో చూస్తారు. కానీ వారు ఇప్పుడు పవన్ ను అభిమానించడం, గౌరవించడం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ వేదికగా జగన్ సర్కారు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయంగా ఏపీలో పెట్టుబడులను ఆహ్వానించే క్రమంలో సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దాదాపు 26 దేశాల నుంచి 8 వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు.

దాదాపు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడమే ధ్యేయంగా సదస్సు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి సాగరనగరానికి విచ్చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు జనసేన సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఏపీ యువత మిమ్నల్ని మెప్పిస్తారని ఆశిస్తున్నాం. ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో ఏపీకి మంచి భవిష్యత్ చేకూరుతుందని భావిస్తున్నాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఇన్వెస్టర్స్ కు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆకాంక్షిస్తున్నానంటూ పవన్ ట్విట్ చేశారు.

అటు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు పవన్. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి!. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండని పవన్ విన్నవించారు.

ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వంపై జనసేన ఎటువంటి విమర్శలు చేయదని కూడా స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ సమ్మిట్ విషయంలో సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు తెగ ఖుషీ అవుతున్నారు. మీ హుందాతనానికి అభినందనలు అంటూ సోషల్ మీడియాలో రిప్లయ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడివే హైలెట్ అవుతున్నాయి. ఒక్క జగన్ తప్పించి అన్నట్టు వైసీపీ శ్రేణుల పొగడ్తల వర్షం నడుస్తోంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక్కోసారి భ‌లే మంచిగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. రాష్ట్ర శ్రేయ‌స్సు కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని కేవ‌లం చెప్ప‌డ‌మే కాదు, కీల‌క స‌మ‌యాల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించే తీరు కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే వుంటోంది.

తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ట్వీట్లు అభినంద‌న‌లు అందుకుంటున్నాయి. ఏపీకి టీడీపీ త‌ప్ప‌, మ‌రొక పార్టీ అవ‌స‌రం లేద‌నే సంకేతాల్ని పంపి, రాజ‌కీయ లబ్ధి పొంద‌డానికి ఆ పార్టీ తాప‌త్ర‌య ప‌డుతోంది. విశాఖ‌లో గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌ను నిర్వ‌హిస్తున్న త‌రుణంలో టీడీపీ త‌న పైశాచిక‌త్వాన్ని చాటుకుంది. ముడుపులు, రాజ‌కీయ క‌క్ష‌ల‌కు బ‌లైన ప‌రిశ్ర‌మ‌లు పేరుతో టీడీపీ వాస్త‌వం ప‌త్రం అంటూ ముద్రించింది. విశాఖ‌కు పారిశ్రామిక దిగ్గ‌జాలు వ‌స్తున్న త‌రుణంలో ఇలాంటి రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఈ త‌రుణంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా బాధ్య‌తాయుత‌మైన ట్వీట్స్ చేయ‌డం విశేషం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌ను కోరుకునే ప్ర‌తిప‌క్ష నాయ‌కులెవ‌రైనా ఇలాంటి చేయూత అందిస్తారు.

రాజ‌కీయాల కంటే రాష్ట్రం గొప్ప‌ద‌నే ఆశ‌యంతో న‌డుచుకుంటారు. ఈ ట్వీట్ల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థాయి పెరిగింది. అలాగే త‌న వాళ్ల‌తో పారిశ్రామిక వేత్త‌ల‌ను భ‌య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న చంద్ర‌బాబు ఏపీ దృష్టిలో విల‌న్ అయ్యారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ను పోల్చి చూస్తే… జ‌న‌సేనాని అంద‌నంత ఎత్తుకు ఎదిగార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది.ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న’ అంటూ పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశం గా మారింది.

Must Read

spot_img