తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్లుకు ఆరోగ్య సమస్యలు ఎక్కువుతున్నాయి. రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతు..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రముఖ హీరోయిన్ సమంత 2022 నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఇప్పటికీ తను చికిత్స తీసుకుంటూనే ఉంది. తాజాగా మరోనటి రేణు దేశాయ్ సైతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
తెలుగు ఇండస్ట్రీలోకి బద్రి మూవీతో అడుగుపెట్టిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రేమాయనం సాగించింది. కొంత కాలం పవన్ తో లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగించిన రేణు ఆతర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత పవన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాలతో పవన్, రేణు విడిపోయారు. ఆ తర్వాత నటనకు దూరంగా ఉంది. నిర్మాతగా, డైరెక్టర్ గా పలు సినిమాలు చేసింది కానీ మూవీలో నటించలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రేణు దేశాయ్ గత కొంత కాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయించుకుంటున్నాని త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అభిమానులు ఆందోళన చెందవద్దని తనలాగే ఎవరైన బాధపడుతుంటే వారు నాలా ధైర్యంగా ఉండాలని కోరింది. దానికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను పెట్టిన పోస్ట్లో గత కొంత కాలంగా నేను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా మాదిరిగానే ఎవరైనా బాధపడుతుంటే? వారిలో ధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెడుతున్నాను. ఎవ్వరూ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. జీవితం మీద నమ్మకం అనేది ఉండాలి. ఏదో ఒక రోజు మన శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచం మనకోసం ఏదో ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటుంది. అందుకే సమస్య ఏదైనా నవ్వుతూ ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాను. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని షూటింగులకు హాజరవుతాను. అంటూ ఇన్ స్టాలో సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది. ఇంతకీ తనకు వచ్చిన సమస్య ఏంటనే విషయాన్ని మాత్రం తన పోస్ట్ లో క్లారిటీగా చెప్పలేదు కానీ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.
ఇటీవలే అన్నదాతలు ఎదురుకుంటున్న సమస్యలపై షార్ట్ ఫిలిమ్ తీశారు. ఇష్క్‌వాలా అనే మరో చిన్న సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. టెలివిజన్ షోకి హోస్ట్‌గా కూడా కనిపించిన రేణుదేశాయ్…రవితేజతో కలిసి టైగర్ నాగేశ్వరరావు మూవీలో నటిస్తూ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఇంతలోనే… ఆమె అనారోగ్యంతో బాధపడుతోందన్న వార్త… ఫిలిమ్ అండ్ సోషల్ సర్కిల్స్‌ని కలచివేస్తోంది. గెట్‌వెల్ సూన్ అంటూ మెసేజెస్‌తో హోరెత్తిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు.