HomePoliticsపవన్ కల్యాణ్, బాలకృష్ణ భేటీ..!

పవన్ కల్యాణ్, బాలకృష్ణ భేటీ..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత, టీడీపీ ఎమ్మెల్యే సమావేశంగా రాజకీయ వర్గాలు చూస్తుంటే… వీరసింహారెడ్డి, వీరమల్లు కలయికగా.. సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వీరిద్దరి భేటీ గురించి.. ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు అటు పొలిటికల్ సర్కిల్‌లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణను కలిశారు పవన్ కల్యాణ్. ఇతర నటీ నటుల మధ్యే వీరిద్దరు కలిసినప్పటికీ.. ఆ తర్వాత ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చలు జరిపారట. ఆ చర్చలు దేని గురించన్నదే సర్వత్రా ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 షోకు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా రానున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య దానిని ఆహా కూడా ధృవీకరించింది.

దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబరు 27న జరగనుంది. కానీ అంతకంటే ముందే… పవన్ కల్యాణ్, బాలకృష్ణ కలవడం చర్చనీయాంశమైంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమా నటులు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా..! ఇటు సినిమాలు.. అటు రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు మూవీలో నటిస్తున్నారు.

ఈ రెండు చిత్రాల షూటింగ్…అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతున్నాయి. పక్క పక్క సెట్లలోనే షూటింగ్ జరుగుతుండడంతో.. గ్యాప్‌లో వీరిద్దరు కలిశారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కల్యాణ్, బాలకృష్ణ దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ భేటీలో రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో టీడీపీ , జనసేన పార్టీలు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అనేక కార్యక్రతలు చేపడుతున్నాయి. ఐతే అక్కడ బీజేపీ , జనసేన మధ్య పొత్తు ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పొత్తుల రాజకీయాలు మారవచ్చని.. టీడీపీ, జనసేన కలవచ్చని ఊహాగానాలువినిపిస్తున్నాయి. ఈ మధ్య విజయవాడలో ఓ హోటల్‌లో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పుడు బాలకృష్ణ‌ను కలిశారు.

ఈ పరిణామాలను చూస్తుంటే.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని.. వారి సినిమాల షూటింగ్‌లు ఒకే చోట జరుగుతుండడంతో… సరదాగా కలిశారని మరికొందరు చెబుతున్నారు. అన్‌స్టాపబుల్-షో గురించి మాత్రమే చర్చించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. హీరోల సినిమాలు పక్క పక్కన షూటింగ్ జరుగుతూంటే ఒకరి సెట్ కి మరొకరు రావడం కామన్ గా జరిగేదే. అయితే ఇక్కడ రాజకీయం కూడా మిక్స్ కావడంతోనే ఈ భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది.

పవన్, బాలయ్య భేటీ ఎందుకు.? ఎలా.?

రాజకీయంగా టీడీపీ, జనసేన మధ్య రాజకీయం వైరం వుండొచ్చు, రాజకీయ స్నేహమూ వుండొచ్చు. చిరంజీవితో గతంలో బాలయ్యకూ రాజకీయ వివాదాలు వుండొచ్చు. కానీ, ఇద్దరి మధ్యా స్నేహం మామూలే. ఇంతకీ, పవన్, బాలయ్య భేటీ ఎందుకు.? ఎలా.? జరిగినట్టు.! ఈ విషయమై తాజాగా వినిపిస్తున్న ఓ గాసిప్ సారాంశమేంటంటే, ఈ భేటీకి తెరవెనుక వ్యూహం రచించింది చిరంజీవేనని. చిరంజీవి, బాలయ్య తొలుత మాట్లాడుకున్నాకే బాలయ్య, పవన్ భేటీ జరిగిందట.

మరోపక్క, యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా ఈ భేటీకి తెర వెనుకాల తనవంతు భూమిక పోషించాడని అంటున్నారు. అయితే, అది రాజకీయం కోసమా.? సినీ పరిశ్రమ కోసమేనా.? అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్న వేళ.. ప్రతి చిన్న విషయానికి ఉండే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

తాజాగా హిందూపురం ఎమ్మెల్యే కమ్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలయ్య వద్దకు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెళ్లటం.. వారిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజా భేటీ జరిగింది సినిమా సెట్లో అయినప్పటికీ.. దాని వెనుక ఉన్నది రాజకీయ కోణం తప్పించి.. మరింకేమీ కాదన్న మాట వినిపిస్తోంది. అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీసింది.

బాలయ్య వద్దకు పవన్ నేరుగా వెళ్లి కలవటం ఒక ఎత్తు అయితే.. వారిద్దరూ దాదాపు ఇరవై నిమిషాలకు పైనే ఏకాంతంగా మాట్లాడుకోవటంతో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఇరు వర్గాలకు చెందిన సన్నిహితులు అందిస్తున్న సమచారం ప్రకారం వారిద్దరి మాటల్లో రాజకీయ అంశాలే ఎక్కువగా వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉదంతం చోటు చేసుకుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరు నటులు కం నాయకులు కలవడం మాత్రం సినీ పరంగానే కాదు రాజకీయంగానూ అతి పెద్ద చర్చకు తావిస్తోంది. వీరి భేటీ సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. వీరి భేటీ వెనుక కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. మామూలుగా సినిమా సెట్ లో వీరు భేటీ అవ్వడమే ఇంత సెన్సేషన్ సృష్టించిందంటే.. నిజంగానే బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్ కనిపిస్తే మరెంత సెన్సేషన్ అవుతుందోనన్న చర్చ అటు రాజకీయ వర్గాలు, ఇటు సినిమా వర్గాలలోనూ జోరందుకుంది.

పవన్-బాలయ్యల కలయిక తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది..

వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనవ్వను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకారణాలపై చర్చకు తెరలేపిన సంగతి విదితమే. ఇప్పుడు బాలయ్య తో పవన్ బేటీ ఏపీ రాజకీయాలలో రానున్న మార్పులకు సంకేతమా అన్న చర్చ జోరందుకుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్, బాలకృష్ణలు సినీ హీరోలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా. ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత కాగా, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే.

అంతే కాకుండా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి స్వయానా వియ్యంకుడు. ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మామ, మేనమామ కూడా. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్, బాలకృష్ణల భేటీ రాజకీయాలలో కొత్త సమీకరణాల చర్చను తెరపైకి తీసుకు వచ్చింది. సాధారణంగా బాలయ్యతో మెగా హీరోలకు అంత సాన్నిహిత్యం ఉండదు.

ఏదైనా ఈవెంట్లో ఎదురు పడితే మాట్లాడుకోవడమే కానీ, ప్రత్యేకంగా ఆత్మీయ కలయికలు చోటు చేసుకోవు. కాలంతో పాటు సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ మధ్య అల్లు ఫ్యామిలీకి బాలకృష్ణ చాలా క్లోజ్ అయ్యారు. అల్లు అరవింద్ కి చెందిన ఆహా యాప్ లో బాలయ్య అన్ స్టాపబుల్ షో హోస్ట్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ మెగా ఫ్యామిలీని సపరేట్ గా చూసేవారు. పరోక్షంగా చిరంజీవి రాజకీయ వైఫల్యాలపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ మనసులో కూడా బాలకృష్ణ పై అసహనం ఉందనే టాక్ ఉంది. తాజా భేటీ ఈ అనుమానాలు పటాపంచలు చేస్తుంది. వీరసింహారెడ్డి సెట్స్ లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణను కలవడం పెద్ద చర్చకు దారితీసింది. సినిమాకు మించి దీన్ని రాజకీయ భేటీగా విశ్లేషకులు చూస్తున్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలతో పాటు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. 2019లో ప్రభావం చూపలేకపోయిన జనసేన ఈసారి కీలకం కానుందిఅంటున్నారు.

ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కింగ్ మేకర్ గా పవన్ అవతరించే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని పవన్ చెబుతున్న తరుణంలో ఆయన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ, జనసేన ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ రాజకీయ పరిణామాల మధ్య బాలయ్య-పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయాల్లోచర్చనీయాంశంగా మారింది. ఇలా ఇద్దరు హీరోలూ అకస్మాత్తుగా కలసి ఒకే సెట్ మీద కనిపించడం, ఇద్దరూ కలసి ఫోటోలు దిగడ ఇదంతా ఒక ఎత్తు అయితే సీక్రెట్ గా ఏమి మాట్లాడుకున్నారు ఈ ఇద్దరు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

ఏది ఏమైనా పవన్-బాలయ్యల కలయిక తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది.

Must Read

spot_img