HomePoliticsనేడు ఏపీ లో సీఎం గా పవన్..!

నేడు ఏపీ లో సీఎం గా పవన్..!

  • ఏపీలో సీఎం అభ్యర్థిగా పవన్ పేరు ఎందుకు వినిపిస్తోంది..?
  • దీనిపై టీడీపీ, బీజేపీ వ్యూహాలే కారణమా..?
  • లేక ఓ సామాజిక వర్గ డిమాండా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో రాజ్యాధికారం కాపులకు చేరువవుతోందా? పవన్ రూపంలో కాపుల చిరకాల వాంఛ తీరనుందా? పవన్ సీఎం అయ్యేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందా? పవన్ ను ముందుపెట్టి కాపుల మనసును గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. దశాబ్దాలుగా ఏపీలో రెండు సామాజికవర్గాలే రాజకీయ అధికార పీఠాన్ని పంచుకుంటున్నాయి.

మూడో సామాజికవర్గమైన కాపులు సంఖ్యాబలంగా ఎక్కువ. కానీ ఆ వర్గానికి అధికార పీఠం దక్కకుండా ఆ రెండు వర్గాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. అయితే ఈసారి ఆ చాన్స్ కనబడడం లేదు. రెండు సామాజికవర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం పతాక స్థాయికి వెళ్లిపోగా.. వారి గెలుపోటములు నిర్దేశించే స్థాయికి పవన్ చేరుకున్నారు.

అందులో ఒకరికి పవన్ సపోర్టు అనివార్యంగా మారింది. ఇదే సమయంలో ఏపీలో మారిన రాజకీయ సమీకరణలతో పవన్ పేరు సీఎం పదవికి బలంగా వినిపిస్తోంది. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబులకు ప్రత్యామ్నాయంగా పవన్ కనిపిస్తున్నారు. అటు విపక్ష నేతగా చంద్రబాబు ఫెయిల్యూర్స్ పవన్ కు కలిసి వస్తోంది. జగన్ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. దానిని క్యాష్ చేసుకోవడంలో చంద్రబాబు విఫలమవుతున్నారు.

అందుకే పవన్ సీఎం అభ్యర్థిత్వాన్ని తప్పకుండా తలవంచక తప్పని పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఇదే అభిప్రాయంతో ఉంది. ఇటు టీడీపీ పరిస్థితి అలానే ఉంది. బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని అనివార్య పరిస్థితి టీడీపీకి ఎదురవుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ ఓటమి చవిచూశారు.

తాను స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం నుంచి కూడా ఓడిపోయారు. దీంతో పార్టీ పని క్లోజ్ అని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. పవన్ కూడా ఆత్మరక్షణలో పడిపోయారు. కానీ వీలైనంత త్వరగా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు. పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టారు. ఏకంగా సీఎం సీటుపైనే గురిపెట్టారు అనే కంటే.. అదే పీఠం తనను వెతుక్కొని వచ్చేలా పావులు కదిపారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక డిమాండ్ కలిగేలా వ్యవహరించారు.

ప్రధాని మోదీ, రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబు పిలిపించుకొని మాట్లాడేంతగా తన అవసరాన్ని పెంచుకున్నారు. తన సాయం వారికి అనివార్యంగా మార్చుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు సీఎం జగన్ కు ప్రత్యామ్నాయంగా పవన్ పేరు వినిపించడమని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఏనాడో సీఎం పదవి ఆఫర్ చేసిందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ తో భేటీ అవుతున్న చంద్రబాబు కూడా దీనిపై కొన్ని సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. సీఎం పదవి షేర్ చేసుకుందామని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ముందుగా జగన్ ను గద్దె దించి తరువాత పదవి పంపకాల గురించి మాట్లాడుకుందామని డిసైడయినట్టు వార్తలు వస్తున్నాయి.

పొత్తులో భాగంగా తక్కువ సీట్లు కేటాయించినా.. సీఎం పదవి మాత్రం షేరింగ్ రూపంలో ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం సాగుతోంది. అంటే అటు బీజేపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి పవన్ కు సీఎం పదవి ఆఫర్ ఉన్నట్టు తేలిపోయింది. పవన్ కు సీఎం పదవి అన్న సంకేతాలు కాపుల్లోకి వెళితే మాత్రం ఏపీ సమాజంలో మెజార్టీ సామాజికవర్గంగా ఉన్న వీరంతా గుంపగుత్తిగా కూటమి వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది.

అందుకే టీడీపీ ఈ సాహస నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఏపీలో ఇన్నాళ్లూ రెండు కీలక సామాజిక పర్గాలకు మాత్రమే పరిమితమైన అధికార పీఠాన్ని అందుకునేందుకు మూడో సామాజిక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎప్పుడూ ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలు, అందునా, ఈ మధ్య వారి కుటుంబ సభ్యులకే అధికార పీఠాలు దక్కించుకునేలా వారు చేస్తున్న ప్రయత్నాలు మూడో సామాజిక వర్గాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి.

దీంతో ఈసారి ఎలాగైనా తమ నేత సీఎం కావాల్సిందేనని వారు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే దానికి అడ్డుపడే వారిని ఓడించేందుకు సిద్ధమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో ఆ సామాజిక వర్గాన్ని బుజ్జగించేందుకు సీఎం పదవి ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మారిన రాజకీయ పరిస్ధితులు పవన్ కళ్యాణ్ ను సీఎం జగన్ కు ప్రత్యామ్నాయ నేతగా తెరపైకి తెస్తున్నాయి.

దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జగన్ పై ప్రజావ్యతిరేకతను సొమ్ముచేసుకునేందుకు చంద్రబాబుకు అవకాశం దక్కకపోతే ప్రత్యామ్నాయంగా పవన్ ను సీఎం పదవి కోసం తెరపైకి తెస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో ప్రధాన విపక్షం టీడీపీ సైతం ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్.. దీనిపై ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్దితి వచ్చింది.

అయితే దీన్నుంచి త్వరగానే కోలుకున్న పవన్… ఈసారి ఎలాగైనా జగన్ స్దానంలో సీఎం సీటులో కూర్చోవాలనే అంచనాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కు ప్రత్యామ్నాయంగా సీఎం పదవికి ప్రత్యామ్నాయ నేతగా పవన్ కు ఫోకస్ పెరుగుతోంది.

  • ఇప్పుడున్న పరిస్దితుల్లో పవన్ ను సీఎంను చేసేందుకు ప్రత్యక్షంగా బీజేపీ, పరోక్షంగా టీడీపీ సిగ్నల్స్ ఇస్తున్నాయి.

అలాగే పవన్ కూడా సీఎం పదవి తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. అటు పవన్ సొంత సామాజిక ర్గం కాపుల నుంచి కూడా ఈసారి కాపులకు సీఎం పదవి అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ను సీఎంగా పూర్తి స్ధాయిలో ఫోకస్ చేసేందుకు బీజేపీ ఇష్టపడుతున్నా ఆ పార్టీకి ఓటు బ్యాంక్ లేకపోవడం మైనస్. కానీ ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ పాక్షికంగా అయినా సీఎం పదవి ఆఫర్ చేసేందుకు సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో టీడీపీవైపు పవన్ మొగ్గుచూపుతున్నారు. పవన్ కు సీఎం పదవి ఇస్తామన్న సంకేతం కాపుల్లోకి టీడీపీ పంపగలిగితే కచ్చితంగా విపక్ష కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమీకరణం ఆధారంగా చంద్రబాబు-పవన్ ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఏపీలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతున్న జగన్ చంద్రబాబుల మధ్య రాజకీయ సమరంలో పవన్ కళ్యాణ్ జనసేనతో మూడో పక్షంగా వస్తున్నారు. అయితే ఏపీలో రెండు ప్రధాన పార్టీలను ఒకేసారి ఎదుర్కొని సీఎం కావడం అంటే అది కష్టమైన వ్యవహారం. పైగా దానికి టైం చాలా పడుతుంది.

అందుకే పవన్ తనదైన రాజకీయంతో మరో వైపు నుంచి నరుక్కువస్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే జగన్ సీఎం కాకూడదు అన్న చంద్రబాబు రాజకీయ బలహీనత పవన్ కి వరంగా మారబోతోంది అని అంటున్నారు. అలాగే కేంద్రంలోని మోడీ సర్కార్ కి జగన్ చంద్రబాబు లేని ఏపీని చూడాలన్న కోరికకూ ఆలంబన పవనే కావడంతో జనసేనాని రొట్టె విరిగి నేతిలో పడుతుందా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది. నిజానికి జనసేనకు బలమంతా పవన్ మాత్రమే.

ప్రధాన పార్టీలతో పోలిస్తే నిలిచి గెలిచే సత్తా ఇంకా లేదు కానీ జగన్ బాబుల మధ్య ఉన్న అతి తీవ్రమైన రాజకీయ ఘర్షణల వల్లనే గుర్రం ఎగరవచ్చు అన్నట్లుగా మధ్యలో సీఎం రేసులోకి పవన్ వచ్చినా రావచ్చు అని అంటున్నారు. పవన్ కి ఈ రకమైన డిమాండ్ పెరగడానికి మరో కారణం ఆయనకు జగన్ పట్ల ఉన్న శాశ్వతమైన శత్రుత్వం. ఇది రాజకీయ ప్రత్యర్ధిని మించి ఉంది. దాంతో చంద్రబాబు పవన్ని నమ్మడానికి ఇది సరిపోతోంది.

మరో వైపు చూస్తే పవన్ డిమాండ్ పెంచే మరో అంశం కేంద్రంలోని మోడీకి కూడా ఆయన కావాలని కోరుకోవడం. దాంతో తాము వదిలేస్తే బీజేపీ కూడా ఆయన్ని తమ వైపు తీసుకుపోతుంది అన్న ఆదుర్దా కూడా చంద్రబాబు చేత పవన్ సీఎం అని అనిపించే ప్రయత్నం చేస్తున్నాయా అంటే రాజకీయం కాబట్టి ఆలోచించాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. ఏపీలో కాపులకు సీఎం పదవి ఇస్తే కనుక అది శాశ్వత పెట్టుబడిగా తెలుగుదేశానికి మారి లోకేష్ కి రాచబాట అవుతుందన్న లెక్కలు కూడా బాబుకు ఉన్నాయని అంటున్నారు.

మరి పవన్ సీఎం అవుతారో లేదో తేలాలంటే, వేచి చూడాల్సిందే.

Must Read

spot_img