Homeసినిమాబాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు పఠాన్

బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు పఠాన్

బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు పఠాన్. షారుక్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో చిత్రయూనిట్ కి బిగ్ షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కానీ ఈ సినిమాకి సర్టిఫికేట్‌ని ఇచ్చేందుకు నిరాకరించిన సెన్సార్ బోర్డు.. సినిమాలో కొన్ని సీన్స్‌ని కత్తిరించాలని లేదా మార్పులు చేయాలని సూచించింది. దాంతో ఇప్పుడు పఠాన్ బృందం దిద్దుబాటు చర్యలకి దిగింది.

నిజానికి ఈ మూవీ నుంచి ‘బేషరమ్ రంగ్’ అనే ఓ సాంగ్‌ని డిసెంబరు 12న రిలీజ్ చేయగా.. ఆ పాటపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగింది. పాటలో కాషాయ రంగు బికినీ వేసుకున్న దీపికా పదుకొణె చాలా వెగటుగా డ్యాన్స్ చేయడంపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. మధ్యప్రదేశ్ మినిస్టర్ మిశ్రా ఆ అశ్లీలమైన పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సాంగ్‌ని సినిమా నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. అలానే చాలా మంది వివిధ పోలీస్ స్టేషన్‌లో ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీపికా పదుకొణె, చిత్ర బృందంపై ఫిర్యాదు కూడా చేశారు

‘బేషరమ్ రంగ్’ పాటపై అంతలా వివాదం చెలరేగినా దీపికా పాటు చిత్ర బృందం కూడా స్పందించలేదు. బహుశా ఫ్రీ పబ్లిసిటీ అనుకున్నారేమో. సీన్ కట్ చేస్తే.. సెన్సార్ బోర్డు కూడా పఠాన్ చిత్ర యూనిట్‌కి మొట్టికాయలు వేసింది. బేషరమ్ రంగ్ పాటలోని కొన్ని సీన్స్‌ అభ్యంతరకరంగా ఉన్నాయని.. అలానే సినిమాలో కూడా కొన్ని సీన్స్‌ని తీసివేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. జాన్ అబ్రహాం విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్‌ని బట్టి చూస్తే ఇది పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.

Must Read

spot_img