Homeసినిమాపాన్ ఇండియాపై అనిరుధ్ గురి..

పాన్ ఇండియాపై అనిరుధ్ గురి..

టాలీవుడ్ లో మ్యూజిక్ వార్ మొత్తం దేవి శ్రీ, తమన్ చుట్టునే తిరుగుతోంది. ఓ సినిమాకు ఇయన సంగీతం అందిస్తే…మరో సినిమాకు ఆయన సంగీతం అందిస్తుంటున్నారు. వీళ్లిద్దరు పంచుకొగా…మిగిలిన సినిమాలు మిగితా సంగీత దర్శకులు చేస్తుంటున్నారు. ఇలాంటి పోరులో మరో సెన్సెషన్ దూసుకొస్తుంది.

కోలీవుడ్లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ కూడా ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు చార్ట్ బస్టర్ పాటలను అందించిన అనిరుధ్ రవిచందర్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అజ్ఞాతవాసి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాలో పాటలతో అంతగా మెప్పించలేకపోయడు. ఆ తర్వాత అనిరుధ్ నానీ గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతం అందించదు. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ తర్వాత జెర్సీ సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు అనిరుధ్.

ఇప్పుడు అనిరుద్ పాన్ ఇండియా రేంజ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. అనిరుధ్ అందించే మూవీస్ అన్ని పాన్ ఇండియా లెవెల్ లోకి రిలీజ్ కానున్నాయి. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. ఈ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. మరో వైపు అజిత్ 62వ సినిమాకి, రజినీ కాంత్ జైలర్ సినిమాకి… కమల్ హాసన్ శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 సినిమాకి అనిరుధ్ యే సంగీతం అందిస్తున్నారు. ఇక ధనుష్ కెరియర్ లో 50వ సినిమాకి ఇతడే మ్యూజిక్ డైరెక్టర్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ఎన్టీఆర్30. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది కానీ కాలేదు. అయితే ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభం అయ్యి.. ఏప్రిల్ 5 2024లో విడుదల చేస్తున్నామని తాజాగా అమిగోస్ ఈవెంట్లో ప్రకటించాడు. ఇక అనిరుధ్ చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి.మరి ప్రాజెక్టులతో అనిరుధ్ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి.

Must Read

spot_img