Homeసినిమాసమ్మర్ లో పాన్ ఇండియా మూవీస్ సందడి..

సమ్మర్ లో పాన్ ఇండియా మూవీస్ సందడి..

టాలీవుడ్ లో ఈ ఏడాది నుంచి స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నారు. తెలుగు నుంచి ఈ ఏడాది సుమారు పది పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక వచ్చే ఏడాది కూడా అదే స్పీడ్ ఉండబోతుంది.

సమ్మర్ లో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా దండయాత్ర షూర్వు కాబోతుంది. ఈ ఏడాదిలో టాలీవుడ్ కి ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాల ద్వారా పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటే ప్రాజెక్ట్స్ గానే అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ హీరోల హవా మొదలు కాబోతుంది. సంక్రాంతి బరిలో రావడానికి ఇప్పటికే ప్రభాస్ ప్రాజెక్ట్ కె మూవీతో సిద్ధం అయిపోయాడు. అలాగే రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా సమ్మర్ కానుకగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా వచ్చే ఏడాది మార్చి తర్వాతనే రిలీజ్ అవుతుంది. సుకుమార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 కోసం సమ్మర్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాని కూడా వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ని వీలైనంత వరకు సంక్రాంతికి తీసుకురావాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారు.

అయితే సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగానే రాబోతుందని తెలుస్తుంది. ఆ సినిమా కోసం మెగాస్టార్ పూరి జగన్నాథ్, వెంకి కుడుములతో పాటు మరికొంత మంది దర్శకులు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఎవరితో ముందుగా స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి.

Must Read

spot_img