పాన్ ఇండియన్ సినిమాలు అంటే ఎక్కువగా టాప్ హీరోలే కనిపిస్తారు. మేకర్స్ కూడా స్టార్స్ తోనే మల్టీలింగ్వల్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు చిన్న హీరోలు కూడా పాన్ ఇండియన్ మూవీస్ లో నటిస్తున్నారు. నార్త్ ఆడియన్స్ కు తెలుగు టాలెంట్ చూపించాలని బారీ స్కెచ్చులేస్తున్నారు.
ఒకప్పుడు రిజనల్ అయిన టాలీవుడ్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో వెళ్లిపోయింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు, యాక్టర్లు అయితే.. తెల్లారిలేస్తే.. టాలీవుడ్ ని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి.
దీంతో బాలీవుడ్ జనాలు కూడా తెలుగు సినిమాల్లోనటించడానికి తెగ ఇంట్రస్ట్ చూపించారు. ఇప్పుడు తెలుగు చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా వైపు చూస్తున్నారు. కథలు చెబితే అందులో నేటివిటీ ఉందా లేదా అనే చూసేవారు హీరోలు. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కథల్లో నేటివిటీ ఎవరూ కోరుకోవడం లేదు. ఆ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు.
అందుకే ఓ మోస్తరు కథలకు ఇప్పుడు హీరోలు పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. పాన్ ఇండియా కథలు కావాలని కోరుతున్నారు. ఇదేదో మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల వ్యవహారం కాదు. నాని, నాగశౌర్య,శర్వానంద్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా కథల్లేవా అని క్వశ్చన్ చేస్తున్నారు. చివరికి ఇప్పుడీ వ్యవహారం ఎంత దూరం వచ్చిందంటే..సుధీర్ బాబు, సందీప్ కిషన్ కూడా పాన్ ఇండియా కథలే అడుగుతున్నారు. వీళ్లిలా
మారిపోవడానికి కారణం ప్రేక్షకుల అభిరుచి మారిపోవడమే.
లోకల్ స్టోరీస్ ను ప్రేక్షకులు ఆదరించడం లేదు. సినిమాలో ఎంతో విషయం ఉంటే తప్ప థియేటర్లలకు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే జానర్ ఏదైనా దాన్ని ఎక్స్ ట్రీమ్ లెవెల్లో చూపించినప్పుడు మాత్రమే, ఊహించని విధంగా ఉన్న కథనాలను మాత్రమే ప్రేక్షకుడు థియేటర్లలో ఆమోదిస్తున్నాడు. అందుకే పవన్ కల్యాణ్ నుంచి సందీప్ కిషన్ వరకు చాలామంది హీరోలు, యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల కోసం పరితపిస్తున్నారు. అలాంటి కథ దొరకడం ఆలస్యం, అడ్వాన్స్ ఇచ్చి మరీ కర్చీఫ్ వేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు.