Homeఅంతర్జాతీయంభారత్‌తో మూడు సార్లు యుద్ధాలు...

భారత్‌తో మూడు సార్లు యుద్ధాలు…

భారత్‌తో మూడు సార్లు యుద్ధాలు చేశాక గుణపాఠం నేర్చుకున్నాం అని అన్నారు పాకిస్థాన్ ప్రధాని. మరి ఆయనకు ఎవరు చెప్పారో కానీ భారత్ తో పాకిస్తాన్ 4 యుధ్దాలు చేసింది. కనీసం పరిజ్నానం లేకుండా ఇంటర్వ్యూలకు వచ్చే పాకిస్తాన్ ప్రధానులను చూస్తే జాలి వేయక తప్పదు. శత్రుదేశం భారత్‌తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాతగానీ తమకు గుణపాఠం నేర్చుకోలేక పోయామని ముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన మనసులో మాటను నిజాయితీగానే అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకునిపోయింది. దీంతో తమను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని ఆ దేశ పాలకులు ప్రాధేయపడుతున్నారు. ఈ నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్‌తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్థాన్‌ గుణపాఠం నేర్చుకుందని అంగీకరించారు.

అంతేకాకుండా పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ వెంటనే బయటకు వచ్చారు షెహబాజ్ షరీఫ్. మనసులో మాటను అణచివేస్తూ తనకు రాసిచ్చిన స్క్రిప్టును చదివేసారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. అదే విధానాన్ని షరీఫ్ కూడా పాటించారు. కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడేమంటున్నారంటే.. కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలని సూచిస్తున్నారు. దుబాయ్‌ కేంద్రంగా పనిచేసే ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడిన పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌.. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పిలుపునిచ్చారు.

‘భారత నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నా సందేశం ఏమిటంటే.. ఇరు దేశాల మధ్య ఎంతో కాలంగా నడుస్తోన్న కాశ్మీర్‌ వంటి వివాదాలపై నిజాయితీ, నిబద్ధతతో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవనం సాగిస్తూ ప్రగతి సాధించడం లేదా ఒకరికొకరు తగువులాడుతూ సమయం, వనరులను వ్యర్థం చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది’ అంటూ పాత పాటే పాడేసారు. లేదంటే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ తమ పౌరులకు కనీస నిత్యావసర వస్తువులను కూడా సబ్సిడీ కింద అందించలేకపోతోంది.

ఇతర వస్తువుల ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే కాకుండా గోధుమ పిండి కోసం ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి. మరోపక్క తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలా వివిధ రూపాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు.. విదేశాల నుంచి సహాయం మాత్రం అంతంతగానే అందుతోంది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ కశ్మీరు మంత్రాన్ని జపించడం ఆపలేదు..పైగా అంతర్జాతీయ వేదికలపై శాంతిపేరుతో భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని యధావిధిగానే ప్రకటిస్తోంది. మరోవైపు మోదీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోంది..పాక్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

ఇది మాత్రం గతంలో ఎన్నడూ చూడని పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లభిస్తున్న ఆదరణ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో ప్రపంచ నేతగా ఎదిగిన మోదీకి ఎన్నో దేశాల మీడియాలు పట్టంగట్టాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి భారత్ ను శత్రుదేశంగా భావించే పాకిస్తాన్ కూడా వచ్చి చేరింది. పాకిస్తాన్‌ లో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి ధరలు ఆకాశానికి అంటుతూ గోధుమ పిండి కోసం కూడా భారీ క్యూలు, తొక్కిసలాటలు జరిగి సామాన్యులు చచ్చిపోతు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆ దేశ మీడియా మన ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. పాక్​ కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ “ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్”..మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని ఒపీనియన్​ కాలంలో ఓ భారీ వ్యాసాన్ని ప్రచురించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత దేశం అంతర్జాతీయంగా ఎలా ఎదుగుతోంది అన్న విషయంపై పాకిస్తాన్ ​లోని షహజాద్ చౌధరి అనే ప్రముఖ రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుడు కథనం రాశారు.

ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపించే స్థితికి మోదీ భారత్​ ను తీసుకెళ్లారని కథనంలో కీర్తించారు. భారత దేశ పురోగతి ప్రపంచాన్ని అబ్బుపరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ నేతృత్వంలోని భారత దేశం విదేశీ విధానాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ ఎంతో నైపుణ్యంగా వ్యవహరించి తన జీడీపీని 3 ట్రిలియన్​ డాలర్లకు పెంచుకుందని, అభివృద్ధి పథంవైపు దూసుకెళుతోందని ఆ కథనంలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అత్యుత్తమ స్థాయికి పెరిగాయని, ఐటీ పరిశ్రమ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించిందని రాశారు.

వ్యవసాయంలో ఎకరానికి ఇండియా ఉత్పత్తి చేస్తున్న పంట ప్రపంచంలోనే మెరుగైన దశలో ఉందన్నారు.

మోదీ స్వయంగా భారత్‌కు బ్రాండ్ తీసుకువచ్చేందుకు నడుం కట్టి విజయవంతమయ్యారని కథనంలో పేర్కొన్నారు. భారత దేశ బ్రాండ్​ను మోదీ పెంచినంతంగా మరే ఇతర ప్రధాని కూడా పెంచలేదన్నారు. కాల పరీక్షకు తట్టుకుని భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలిచిందని ప్రశంసించారు. పాక్‌లో నెలకొన్ని పరిస్థితులను ఉద్దేశిస్తూ ఆ దేశం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిపై ఆ కథనంలో విరుచుకుపడ్డారు. పాక్ మీడియా గతంలో నరేంద్ర మోదీ విధానాలను తీవ్రంగా విమర్శించేది. గోద్రా అల్లర్ల ఘటన నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకూ అన్ని నిర్ణయాలనూ పాక్ మీడియా తప్పుబట్టేది. ప్రస్తుతం అదే మీడియా మోదీ నాయకత్వాన్ని వేనోళ్ల పొగడుతుంది. పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా కొంతకాలంగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలను ప్రశంసిస్తూ వస్తున్నారు. భారత విదేశాంగ విధానం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని మెచ్చుకున్నారు. అమెరికా సహా పలు దేశాల నుంచి వ్యతిరేకత,ఒత్తిడి వచ్చినా రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని ఇమ్రాన్ చాలాసార్లు ప్రస్తావించారు.

ప్రస్తుతం పాకిస్తాన్ లో భారత ప్రధాని మోదీ రాజస్థాన్ లో చేసిన కొన్ని వాఖ్యల వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. ప్రత్యేకంగా ఈ వీడియోను రిఫర్ చేస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పుడూ తమది అణ్వాయుధ దేశం అంటూ కశ్మీరు జపం చేస్తూ ఉంటుంది. దానికి రిటార్డ్ ఇస్తూ మోదీ తమది కూడా అణ్వాయుధ దేశమేనని దీపావళి కోసం దాచుకున్న పఠాసులు కావని వ్యంగ్యంగా జవాబిచ్చారు.

తన చర్యల వల్లే పాకిస్తాన్ ఇప్పుడు కఠోరా పట్టుకుని విదేశాల ముందు అడుక్కుంటోందని అన్నారు. ప్రస్తుతానికి జరుగుతున్నది కూడా అదే. అంతర్జాతీయ వేదికలపై భారత దౌత్యాధికారుల క్రుషి వల్లే పాకిస్తాన్ కు ఎక్కడ కూడా ఆశ్రయం లభించడం లేదు. అయినా పాకిస్తాన్ కు బుద్ది రావడం లేదు. కనీసం ఇప్పుడైనా తన ప్రజలను కాపాడుకునేందుకు భారత్ తో దోస్తీకి చేయి చాచాల్సిన సమయంలో శత్రుత్వాన్నే కోరుకుంటోంది. కశ్మీరు గురించి అవాకులు చెవాకులు పేలుతోంది. చూస్తూ ఉంటే పీఓకేను పాకిస్తాన్ నుంచి భారత్ లో కలిసేందుకు రంగం సిధ్దం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడి జనం కూడా మైనస్ 20 డిగ్రీల చలిలో భారత్ లో కలసిపోతామంటూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. భారీగా ర్యాలీలు తీస్తున్నారు. ఇది పాకిస్తాన్ కు కంపరంగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని దాయాది ఎదుర్కుంటోంది.

Must Read

spot_img