Homeఅంతర్జాతీయందాయాది దేశం .. మరోసారి భంగపాటుకు గురైందా..?

దాయాది దేశం .. మరోసారి భంగపాటుకు గురైందా..?

అంతర్జాతీయ వేదికల్లో అనవసరంగా ప్రస్తావన తీసుకువచ్చి మరీ .. పరువు తీసుకుంటోంది. మహిళా దినోత్సవాన
ఐరాసలో సాగిన చర్చలో .. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం .. దీనికి ధీటుగా భారత్ కౌంటర్ ఇవ్వడం .. అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదేమీ తొలిసారి కాకపోవడంతో .. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా .. అన్న చందంగా పాక్ తీరు ఉందన్న వ్యాఖ్యలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్తాన్ .. చేజేతులారా .. తన పరువును తానే తీసుకుంటోందా..? కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ వ్యవహారశైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోందా..? పాక్ తీరుపై భారత్ఏ మంటోంది..? అసలు పాక్ .. అంతర్జాతీయ వేదికలపైనా ఎందుకు కశ్మీర్ ను ప్రస్తావిస్తోంది..? దీనివల్ల పరువు పోతున్నా, భారత్ తలంటుతున్నా .. ఎందుకు తీరు మార్చుకోవడం లేదన్నదే ఆసక్తికరంగా మారింది.

తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమితి యూఎన్ఎస్సీ భేటీలో పాకిస్తాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో జర్దారీపై భారత్ తీవ్రంగా ఫైర్ అయ్యింది.

ఐరాసలో మహిళలు, శాంతి, భద్రతపై జరుగుతున్న భేటీలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావడమేంటని ప్రశ్నించింది. భుట్టో తీరు దురుద్దేశపూర్వకమని, రాజకీయ ప్రేరేపితమని ధ్వజమెత్తింది. భుట్టో కామెంట్స్పై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ స్పందించారు. భుట్టో ఆరోపణలు నిరాధారం, రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం
గురించి పాకిస్తాన్ ప్రతినిధి చేసిన పనికిమాలిన, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను తాను కొట్టిపారేస్తున్నట్లు రుచిరా తెలిపారు. ఈ దురుద్దేశపూరితమైన, నిరాధార ఆరోపణలపై స్పందించడం కూడా అనవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అంశాలపై స్పందించే బదులు తమ దృష్టి సానుకూల అంశాలపై, భవిష్యత్తుపైనే ఉంటుందని పాక్ మంత్రి ప్రసంగాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళలు, శాంతి, భద్రత ఎజెండా అమలును వేగవంతం చేయడానికి తాము చేసే సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఇవాళ్టి చర్చ చాలా ముఖ్యమైందిగా భావిస్తున్నామన్నారు.

తాము ఈ చర్చ అజెండాను గౌరవిస్తామని, సమయ ప్రాముఖ్యతను కూడా గుర్తిస్తామని, కాబట్టి మా దృష్టి ఈ అంశంపైనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి సందర్భ శుద్ధి లేకుండా అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ ప్రస్తావన లేవనెత్తి భంగపాటుకు
గురైంది. భారత్ చేతిలో చీవాట్లు తింది. మహిళలు, శాంతి, భద్రత అనే అంశంపై భద్రతా మండలిలో చర్చ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని పాక్ లేవనెత్తింది. దీనిపై పాక్‌ను భారత్దుయ్యబట్టింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం ఇది మొదటిసారి కూడా కాదు.

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ భారత్‌లోనే ఉంటాయని, వాటిపై ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ పలుమార్లు దాయాది దేశానికి తేల్చిచెప్పింది. పొరుగుదేశమైన పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఇందుకు శత్రుత్వం, బీభత్సం లేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పైనే ఉందని స్పష్టం చేసింది. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్పటి నుంచి భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణను భారత ప్రభుత్వం 2019
ఆగస్టులో ఎత్తివేయడంతో ఇరుదేశాల సంబంధాలు మరింత దిగజారాయి. ఈ తరుణంలో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి సందర్భ శుద్ధి లేకుండా అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ ప్రస్తావన లేవనెత్తి భంగపాటుకు గురైంది.

భారత్ చేతిలో చీవాట్లు తిన్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళలు, శాంతి, భద్రత’అనే అంశంపై
భద్రతా మండలిలో ఏర్పాటు చేసిన ఐరాస సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందిస్తూ కశ్మీర్ అంశాన్ని వెలికి తీశారు. అయితే సమయ సందర్భం చూసుకోకుండా పాక్ వ్యాఖ్యల్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా పాక్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం కూడా దండగేనని అన్నారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా దాయాది దేశం పాకిస్తాన్‌ పరిస్థితి తయారైంది. ఆర్థిక సంక్షోభంతో తిండికి లేక జనాలు అల్లాడుతున్నా.. కశ్మీర్‌ విషయంలో అనవసరపు ఆరోపణలు చేయటం మానటం లేదు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొజాంబిక్ ప్రెసిడెన్సీలో జరిగిన కౌన్సిల్ చర్చలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి జర్దారీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో కాంబోజ్ దీటుగా బదులిచ్చారు.

పొరుగు దేశంగా పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను భారత్ కోరుకుంటోంది.. అయితే అటువంటి సంబంధాలకు ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించే బాధ్యత ఇస్లామాబాద్‌పై ఉందని నొక్కి చెప్పింది. గతంలోనూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ ప్రస్తావనపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా.. భారత్ దీనికి కౌంటర్లు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఇమ్రాన్ ప్రసంగంలో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ అధినేత భారత్ అంతర్గత విషయాలను ప్రస్తావించడం ద్వారా ప్రపంచ వేదికపై అబద్ధాలు చెప్పారని,
దీనికి కౌంటర్ ఇచ్చేందుకు తమకున్న హక్కును కచ్చితంగా వాడుకుంటామని భారత్ ప్రతినిధులు వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం ద్వారా పాకిస్తాన్అగ్నిమాపక సిబ్బందిలా మారువేషం వేసుకుందని ఆరోపించారు. పొరుగు దేశాన్ని తన అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయమని కూడా పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రకటనల ద్వారా అబద్దాన్ని పదే పదే చెప్పాలని ప్రయత్నిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పట్ల మనం సానుభూతి చూపడం మినహా చేయగలిగిందేమీ లేదన్నారు.

పాకిస్తాన్ .. ప్రపంచ దేశాల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని, సాధారణ ప్రజలు, ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల ప్రజల జీవితాలు తలక్రిందులు అవుతున్న నేపథ్యంలో తీవ్రవాదులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్న దేశం మానసిక స్ధితికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

మరోవైపు, భారతదేశం మాత్రం తమ దేశంలో అత్యున్నత పదవులను కలిగి ఉన్న మైనారిటీల గణనీయమైన జనాభాతో బహుళజాతి ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతోందన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, సహాయం చేయడం, చురుకుగా మద్దతునివ్వడాన్ని ప్రపంచదేశాలు అర్ధం చేసుకుంటున్నాయని వెల్లడించారు. ఐకరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ లోనూ పాకిస్థాన్‌ మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీంతో పాకిస్థాన్‌ తీరుపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. హతమైన అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్
లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన, పొరుగున ఉన్న పార్లమెంట్‌పై దాడి చేసిన దేశానికి ఐరాసలో ఉపన్యాసం చేసే అర్హత లేదని పేర్కొంది. ఇటీవల 15 దేశాల యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కి భారతదేశం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, రిఫార్మ్‌డ్‌ మల్టిలేటరలిస్మ్‌పై ప్రత్యేక ఈవెంట్‌లను నిర్వహిస్తోంది.

అయితే ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో ప్రస్తుతం భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న ఉగ్రవాద నిరోధకం, రిఫార్మ్‌డ్‌ మల్టిలేటరలిస్మ్‌పై కౌన్సిల్ చర్చలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న మహమ్మారి, వాతావరణ మార్పులు, సంఘర్షణలు, ఉగ్రవాదం వంటి కీలక సవాళ్లపై సమర్థంగా ప్రతిస్పందించడంపై ఐక్యరాజ్యసమితి విశ్వసనీయత ఆధారపడి ఉంటుందన్నారు. రిఫార్మ్‌డ్‌ మల్టిలేటరలిస్మ్‌ ఆవశ్యకతపై ఇండియా దృష్టి పెడుతోందన్నారు. సహజంగానే అందరికీ విభిన్న అభిప్రాయాలు ఉంటాయని, కానీ మల్టిలేటరలిజం అంశంలో ఆలస్యం తలెత్తకూడదనే అభిప్రాయం పెరుగుతోందని చెప్పారు. ఉత్తమ పరిష్కారాల కోసం శోధిస్తున్నప్పుడు, ప్రపంచం ఆమోదించని అంశాలను ప్రస్తావించడం సరికాదని పాకిస్థాన్‌ను ఉద్దేశించి జైశంకర్ అన్నారు.

పాకిస్తాన్ వ్యవహారశైలి .. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లే ఉందన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో వెల్లువెత్తుతున్నాయి. దుందుడుకుతనంతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ, భారత్ నుంచి భంగపాటు ఎదుర్కొంటూన్న పాక్ ప్రవర్తనలో మార్పు రావడం లేదు.

Must Read

spot_img