Homeఅంతర్జాతీయంభారత్ ను పొగుడుతున్న పాకిస్థాన్

భారత్ ను పొగుడుతున్న పాకిస్థాన్

ఈ మధ్య అంతా భారత్ పాటనే పాడుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గర్నుంచి మెచ్చుకోలు పర్వం మొదలైంది. మన దేశ దౌత్యనీతిని, మన దేశ ఆర్థిక విధానాన్ని, పాలకుల చిత్తశుధ్దిని, ఆపద సమయంలో ఇతరులను ఆదుకోవడం గురించి అన్నీ ప్రశంసలే కురుస్తున్నాయి. మొన్నటి జీ 20 సమ్మిట్ వరకు ఇలా అన్ని దేశాల వారు మన దేశాన్ని మన దేశ ప్రధాని, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ను ఆకాశానికెత్తుతున్నారంటే అతిశయోక్తి కాదు. చివరకు అది ఎంత వరకు వచ్చిందంటే.. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించవచ్చు అని రష్యా కూడా మెచ్చకునేంతవరకు అని చెప్పవచ్చు.

కానీ ఇలా అంతా ఈ యుగళగీతం ఎందుకు పాడుతున్నారు..? ఏ కారణంతో ఇలా మాట్లాడుతున్నారు.. అందుకు కారణం ఉంది. అందుకు మన పాలకుల పనిలో నిజాయితీ ఉంది. అందుకే ఈ రకంగా మెచ్చుకుంటున్నారు. అదేంటో వరుసగా చూద్దాం..మొన్నటికి మొన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఏమన్నారంటే..బహుళ ధృవాలుగా ఎదుగుతున్న ఈ సువిశాల ప్రపంచంలో భారతదేశం అతి ముఖ్యమైన ధృవం అని, బహుళ ధృవ ప్రపంచాన్ని నిర్మించడంలో కేంద్రంగా ఉందని అన్నారు.

సాధారణంగా ఎవరినీ అంతగా మెచ్చుకోని సెర్గీ ఈ విధంగా మాట్లాడటం కొందరికి ఈర్ష కూడా కలిగించింది. ఆయనేమన్నారు..వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో భారతదేశానికి అపారమైన దౌత్య అనుభవం ఉందని అన్నారు.”ఆర్థికాభివృద్ధి పరంగా అగ్రగామి దేశాల్లో భారతదేశం ఒకటి. బహుశా భారత్ ఇప్పటికే లీడర్ అయిపోయి ఉండవచ్చు” అని కూడా అన్నారు.
ఈ మాటలు ఎక్కడో అన్నవి కావు.. ప్రిమకోవ్ రీడింగ్స్ ఇంటర్నేషనల్ ఫోరమ్‌లో మాట్లాడుతూ సెర్గీ లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు, లావ్రోవ్ యుక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ వైఖరి సమతుల్యంగా ఉందని చెబుతూ భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. పశ్చిమ దేశాలు ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదని, బహుళ ధృవ వ్యవస్థ వాస్తవికతను అంగీకరించాడనికి సిద్ధంగా లేవని లావ్రోవ్ అన్నారు. “కొత్త శక్తులుగా ఎదుగుతున్న దేశాలు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవన్నది ఇప్పటికే స్పష్టమైంది. అందుకే, పాశ్చాత్య దేశాలు ఈ వ్యవస్థను కొనసాగించేందుకు మరింత బలంగా పోరాడుతున్నాయి. అయిదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అలవాటును వదులుకోవడానికి నిజంగా అవి సిద్ధంగా లేవు.

భారతీయుడిగా గర్వపడండి!!!!!!


“ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభత్వం పొందేందుకు జర్మనీ, జపాన్‌లతో పాటు భారత్, బ్రెజిల్ దేశాలు కూడా పోటీపడుతున్నాయి. బహుళ ధృవ వ్యవస్థకు ఇదే సంకేతం. భారత్, బ్రెజిల్‌లకు సభ్యతం ఇవ్వడం వలన అదనపు విలువ ఉంటుంది. కానీ, జర్మనీ, జపాన్‌లకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడంలో ఏ విలువ లేదు” అని లావ్రోవ్ అన్నారు. ఇంతకీ ప్రిమకోవ్ ఎవరు? ఆయన చెప్పిన బహుళ ధృవ వ్యవస్థ సిద్ధాంతం ఏమిటి? అన్నది చూస్తే..యెవ్‌గెనీ ప్రిమకోవ్ రష్యాలో ప్రముఖ రాజకీయవేత్త, దౌత్యవేత్త. 1998 నుంచి 1999 వరకు రష్యా ప్రధాన మంత్రిగా కూడా వ్యవహరించారు. అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 1996లో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, రష్యా, భారత్, చైనా కూటమి ఆధారంగా బహుళ ధృవ ప్రపంచ క్రమాన్ని నిర్మించవచ్చని రష్యా ప్రభుత్వానికి సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాాత అమెరికా ఏర్పరచిన ఏకధృవ ప్రపంచ క్రమానికి ఇది ప్రత్యామ్నాయమని అన్నారు.

రష్యా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని భారత్, చైనాలతో స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. బహుళ ధ్రువ ప్రపంచ క్రమంలో, పశ్చిమ దేశాలను అనుసరించకుండా స్వతంత్ర మార్గంలో నడవాలనుకునే దేశాలకు రష్యా, చైనా, భారత్ కూటమి కొంత రక్షణను అందించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. లావ్రోవ్, ప్రిమకోవ్ సిద్ధాంతాన్నే బలపరిచారు. ఆయన ఆలోచన బ్రిక్స్ గా రూపాంతరం చెందిందని, ఆర్ ఐ సీ ఇప్పటికీ నడుస్తోందన్న సంగతి చాలా కొద్దిమందికి తెలుసునని, ఈ పొత్తు ఆధారంగానే మూడు దేశాల విదేశాంగ మంత్రులు తరచూ సమావేశమవుతున్నారని లావ్రోవ్ అన్నారు. అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జర్మనీ, జపాన్‌లకు బదులుగా భారత్‌, బ్రెజిల్‌లను శాశ్వత సభ్యులుగా చేయాలని ఆయన ఎందుకు పట్టుబడుతున్నారు? భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో అది ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని ఎందుకు చెప్తున్నారు? నిజానికి భారత విదేశాంగ విధానాన్ని రష్యా ప్రశంసించడం ఇది మొదటిసారి కాదు.

“1955-56, 1971 ఒప్పందాల నుంచి సోవియట్ యూనియన్, భారతదేశాన్ని చాలా ముఖ్యమైన దేశాల జాబితాలో చేర్చింది. అలీన విధానం ఏర్పడినప్పుడు కూడా, సోవియట్ యూనియన్ దానిని గుర్తించింది. అలీన దేశాలకు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని, సోవియట్ యూనియన్ వారితో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని విశ్వసించింది. అలీన దేశాలు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని నొక్కి చెప్పింది. లియోనిడ్ ఇలియిచ్ కాలంలో సోవియట్ యూనియన్ భారతదేశంతో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంది. 1990వ దశకంలో రష్యా కొంతవరకు పశ్చిమ దేశాల వైపు మొగ్గినప్పటికీ, 1996లో ప్రిమాకోవ్ రష్యా, భారతదేశం, చైనా కూటమి గురించి గట్టిగా మాట్లాడారు.

2014లో మొదటిసారిగా రష్యా క్రిమియాపై దాడి చేసినప్పుడు భారత్ దానిని సమర్థించలేదు, ఖండించలేదు. క్రిమియాలో రష్యాకు భద్రతా సమస్యలు, కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చని భారత్ భావించింది. అప్పట్లో క్రిమియా అయినా, ఇప్పుడు యుక్రెయిన్ అయినా, భారత్ విధానం పశ్చిమ దేశ విధానాలకు భిన్నంగా ఉండటాన్ని రష్యా నిశితంగా గమనిస్తోంది. అయితే భారత్ రష్యాకు మద్దతివ్వలేదు, కానీ పాశ్చాత్య దేశాల భాష, విధించిన ఆంక్షలపై స్పందిస్తూ, సమస్య ఈ విధంగా పరిష్కారం కాదని ఆచి తూచి ఎంపిక చేసుకున్న పదాలతో చెప్పింది.

భారత ప్రధ్యాని మోదీ, రష్యా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు, ఇది యుద్ధానికి సమయం కాదని స్పష్టంగా చెప్పారు. కానీ, ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల ఖండనను భారతదేశం సమర్థించలేదు. పై కారణాల వల్ల, పాశ్చాత్య దేశాలకు భిన్నంగా భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని రష్యాకు స్పష్టమయింది. బహుళ ధ్రువ వ్యవస్థకు భారత్‌ కేంద్రమని రష్యా చెప్పడానికి ఇదే కారణం అని అంటున

Must Read

spot_img