Homeఅంతర్జాతీయంపాకిస్తాన్ ను ఉగ్రదాడులతో నిలవనీయకుండా చేస్తున్న టీటీపీ

పాకిస్తాన్ ను ఉగ్రదాడులతో నిలవనీయకుండా చేస్తున్న టీటీపీ

ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు పాకిస్తాన్ నడుం బిగించింది. ముందే హెచ్చరించినట్టు ఆఫ్టనిస్తాన్ లోని అనుమానిత టీటీపీ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దాడులు చేసిన వార్తలను ఖండించింది. అలా ఏం జరగలేదని అవన్నీ పుకార్లేనని వెల్లడించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం దాడుల వార్తలు హల్చల్ చేస్తున్నాయి..

అఫ్ఘానిస్థాన్ లో పాక్ వైమానిక దాడులు జరిగాయనీ, అందులో టీటీపీ అగ్రనేత హఫీజుల్లా హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. అఫ్ఘానిస్థాన్లోని నంగర్ హార్ లో ఉన్నాయంటోన్న టీటీపీ శిబిరాలపై గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టీటీపీ అగ్రనేత హఫీజుల్లా అలియాస్ టూర్ హతమైనట్లు పాక్ నిఘావర్గాలు తెలిపాయి. అయితే పాక్ ప్రభుత్వం ఈ వార్తలను నిరాధారమంటూ ఖండించింది. మరోవైపు ఈ దాడుల్లో పిల్లలతో సహా 40 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర శాంతి పర్యవేక్షణ సంస్థ అయిన ‘ఆఫ్ఘన్ పీస్ వాచ్’ వ్యవస్థాపకుడు హబీబ్ ఖాన్ తెలిపారు. అయితే ఆఫ్గనిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే తాలిబన్లు హెచ్చరించారు.

దాడుల ఘటనపై ట్విటర్‌లో ఖండిస్తూ పీస్ వాచ్ వ్యవస్థాపకుడు ఖాన్ ఈ వార్త నిజమేనని తెలిపింది. గతంలో మొట్టమొదటిసారిగా, పాకిస్తాన్ సైనిక విమానాలు ఆఫ్ఘన్ గడ్డపై తాలిబాన్ ఆధ్వర్యంలో బాంబు దాడి చేసి 40 మందికి పైగా పౌరులను చంపాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ తన ప్రాక్సీ దళాలైన తాలిబాన్ మరియు ముజాహిదీన్ల ద్వారా ఆఫ్ఘన్‌లను చంపుతోంది అని ఖాన్ గతాన్ని గుర్తు చేసారు. అయితే ఇప్పుడు జరిగిన సర్జికల్ దాడుల్లో పాకిస్థాన్ తన అధునాతన ఎఫ్-16 విమానాలతోపాటు.. మానవ రహిత డ్రోన్లను వినియోగించినట్లు చెబుతున్నారు. దక్షిణ వజీరిస్థాన్ లోని తనాయ్ లో ఉన్న టీటీపీ శిబిరాలపై సైన్యం దాడులు జరిపిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో 11 మంది టీటీపీ ఫైటర్లు హతమైనట్లు చెబుతున్నాయి.

ఈ సంఘటన తరువాత, తాలిబాన్ అధికారులు పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను పిలిపించి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆందోళనలను తెలియజేశారు. దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ తాత్కాలిక మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ, తాత్కాలిక డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ అల్హాజ్ ముల్లా షిరిన్ అఖుంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాక్ జాతీయ భద్రత కమిటీ బుధవారం రాత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, టీటీపీతో చర్చలు జరపకూడదని నిర్ణయించింది. . అఫ్ఘాన్ తాలిబాన్లు టీటీపీ వైపు ఉన్నారా? పాకిస్థాన్ వైపా? అనే అంశంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించామని పాక్అం తర్గత వ్యవహారాల మంత్రి రాణా సనాఉల్లా చెప్పారు. అయితే టీటీపీ అస్థిత్వం ఆఫ్గన్ తాలిబన్లతో ముడిపడి ఉందని చెబుతున్నారు విశ్లేషకులు.

అందుకే పాకిస్తాన్ ఈ విషయంపై ముందే తాలిబన్లను హెచ్చరించింది. టీటీపీ సభ్యులు పాకిస్తాన్ లో దాడులు జరిపి ఆఫ్గనిస్తాన్ లో షెల్టర్ తీసుకుంటున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే తామే వైమానిక దాడులు నిర్వహిస్తామని తెలిపింది. దానికి ఆష్గనిస్తాన్ తాలిబన్ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. పాకిస్తాన్ అలాంటి దైర్యం చేస్తే ఫలితాలు మళ్లీ 1971ని పునరావ్రుతం చేస్తామని హెచ్చరించింది. టీటీపీ సంస్థ సభ్యులతో గొడవలుంటే వారితోనే చర్చించుకుని పరిష్కరించుకోవాలనీ, అనవసరంగా ఆఫ్గినిస్తాన్ ను మధ్యలోకి లాగొద్దని సూచించారు. ఇది జరిగిన 23 గంటల్లోనే పాకిస్తాన్ వైమానికి దాడులు జరిపిందనే వార్తలు రావడం గమనించాల్సిన విషయంగా నిపుణులు చెబుతున్నారు.

అయితే టీటీపై వైమానిక దాడులు జరిపేందుకు పాకిస్తాన్ సాహసించదన్నిది నిజమే..ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా టీటీపీశ్రేణులువిస్తరించుకుపోయారు. నిత్యం పాకిస్తాన్ లోని ఏదో చోట ఆత్మాహుతి దాడులు జరుపుతున్నారు. దాడుల్లో పాకీస్తాన్ సైనికులు, పోలీసులు, సామాన్యపౌరులు మరణిస్తున్నారు. ఇప్పుడు వైమానిక దాడులు జరిపితే ఆఫ్గనిస్తాన్ తాలిబన్లు నేరుగా పాకిస్తాన్ పై యుధ్దం ప్రకటిస్తారు. తాలిబన్లు నేరుగా ఎంటరైతే పాకిస్తాన్ కు చాలా కష్టం. సరిహద్దు వివాదం సందర్భంగా వారి ఆగ్రహం ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు బాగా తెలుసు. అందుకే ఎయిర్ స్ట్రైక్స్ జరిగినా జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ నేతలు. అయితే నిజం దాచిపెట్టినా దాగదు. ఒకవేళ పాకిస్తాన్ చెప్పేది అబద్దమైతే తాలిబన్ల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు.

Must Read

spot_img