Homeఅంతర్జాతీయంపాకిస్తాన్‌లో మహిళలకు షాక్ ..?

పాకిస్తాన్‌లో మహిళలకు షాక్ ..?

బయటకు కనిపించని అత్యంత చాందస చాదస్తపు పాకిస్తాన్ దేశంలో మహిళా దినోత్సవం వేడుకలకు అనుమతులు నిరాకరించారు. ఎక్కడ అవకాశం దొరికినా కశ్మీరు ప్రజల కష్టాల గురించి అక్కడి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అంటూ గోల గోల చేసే పాకిస్తాన్ తన స్వంత దేశంలోనే మహిళల హక్కులను కాలరాస్తోంది. ఉగ్రవాదులకు లొంగిపోయి దేశం కడహీన స్థాయికి చేరుకుంది. ఇప్పటికీ తన తప్పేంటో పాకిస్తాన్ కు తెలిసినట్టు కనిపించడం లేదు..

పాకిస్తాన్‌లో మహిళల పరిస్థితి ఇది..అటు ఆఫ్గనిస్తాన్ లోనే మహిళలల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయని అంతా అనుకుంటారు కానీ పాకిస్తాన్ లోనూ లోలోపల అవే జరుగుతున్నాయి. తాజాగా మహిళా దినోత్సవం రోజున మహిళలు తమ హక్కుల కోసం చేయతలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించింది అక్కడి ప్రభుత్వం. తెల్లారిలేస్తే భారత్ లోని కాశ్మీర్ ప్రజల హక్కుల గురించి గగ్గోలు పెడుతుంటుంది దాయాది దేశం పాకిస్తాన్. భారత్ మైనారిటీలను అణిచివేస్తోందంటూ పలు అంతర్జాతీయ వేదికపైనే మొసలి కన్నీరు కారుస్తుంటుంది. కానీ తన సొంత దేశంలోని మైనారిటీల పరిస్థితులను పట్టించుకోదు. ప్రతీ ఏటా హిందూ, సిక్కు అమ్మాయిలను మతం మార్చి, కిడ్నాపులు చేసి ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నారు. దైవదూషణ పేరుతో అమాయకులను చంపేస్తున్నారు.

బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఏటా కొన్ని వందల మందిని పాక్ సైన్యం ఊచకోత కోస్తుంది. అయినా కూడా వీటి గురించి పాశ్చాత్య దేశాలు పెద్దగా పట్టించుకోవు. ఎప్పుడూ ఇండియాను దోషిగా నిలబెట్టేందుకే అభివృద్ధి చెందాం అని చెప్పుకునే వెస్ట్రన్ దేశాలు భారత్ పై అసత్య ఆరోపణలు చేస్తుంటాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో స్వేచ్ఛ అనే పదానికి పెద్దగా అర్థం లేదు. అక్కడ పేరుకే ప్రజాస్వామ్యం నడిచేదంతా సైన్యం పాలన. ఇక మహిళల హక్కులు, స్వేచ్ఛకు అక్కడ అవకాశమే లేదు. చివరకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు కూడా మహిళల ర్యాలీపై నిషేధం విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లో మార్చి8న నిర్వహించ తలపెట్టిన ‘ఔరత్ ర్యాలీ’కి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

భద్రతాపరమైన సమస్యలు, వివాదాస్పద బ్యానర్లు, పోస్టర్లను చూపి అనుమతి ఇవ్వడం లేదని చెప్పింది. ఇదిలా ఉంటే ఇస్లామిక్ విలువల పరిరక్షణ కోసం పిలుపునిచ్చే ”హయా ర్యాలీ”కి మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మహిళలు ఇది తమ హక్కులనను ఉల్లంఘించడమే అని ర్యాలీ నిర్వహకురాలు హిబా అక్బర్ అంటున్నారు. ఔరత్ మార్చ్ ను నిషేధించిన ప్రభుత్వం, హయా ర్యాలీకి ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. విడాకులు, లైంగిక వేధింపులు, రుతుక్రమం వంటి అంశాలపై బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించిన కారణంగా ఔరత్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకులు పాశ్చాత్చ, ఉదారవాద విలువను ప్రోత్సహిస్తున్నారని, మతం, సంస్కృతి గౌరవించడం లేదని ఆరోపించారు. హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాహోర్ నిర్ణయాన్ని ఖండించింది.

మరోవైపు ఇస్లామాబాద్ లో జరిగే ఔరత్ మార్చ్ ను ఓ పార్క్ ప్రాంతంలోకి మార్చారు. ఫిబ్రవరిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ర్యాలీని సిటీ పార్కుకు మార్చింది అక్కడి ప్రభుత్వం. ఇదిలా ఉండగా పాకిస్తాన్ తాజా, మాజీ ప్రధానుల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేయని ప్రయత్నమంటూ లేదు. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ప్రధాని హోదాలో విదేశాల నుంచి వచ్చిన విలువైన బహుమతులకు ఇమ్రాన్‌ఖాన్‌ అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో.. పాకిస్తాన్ తాజా, మాజీ ప్రధానుల మధ్య ముదిరిన వివాదం.. అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెస్టుకు ఛాన్స్ ఉందంటున్నారు.

అవినీతి కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మళ్లీ కష్టాలు పెరిగాయి. లాహోర్‌ ‌ లోని ఇమ్రాన్‌ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ప్రధాని హోదాలో విదేశాల నుంచి వచ్చిన విలువైన బహుమతులకు ఇమ్రాన్‌ఖాన్‌ అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో ఇమ్రాన్‌ను పలుమార్లు విచారించారు. విదేశాల నుంచి వచ్చిన గిఫ్ట్‌లను అమ్మేస్తే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని. కాని ఇమ్రాన్‌ అలా చేయకుడా సొంత ఖాతాల్లో డబ్బును వేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్‌ వారెంట్‌తో ఇస్లామాబాద్‌ పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటికి వచ్చారు. అయితే ఇమ్రాన్‌ఖాన్‌ నివాసానికి భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు కూడా చేరుకున్నారు. పోలీసుల ప్రయత్నాలను వాళ్లు అడ్డుకుంటున్నారు.

Must Read

spot_img