తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి ఒక పెద్ద పండుగ ఆ సీజన్ లో చాలా మంచి మార్కెట్ జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాలు పండుగ సెలవులను టార్గెట్ చేసుకుని రిలీజ్ చేస్తారు. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ కొందరికి సంక్రాంతి హీరోలుగా పేరు కూడా ఉంది. ప్రతిసారి లానే ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వస్తున్నారు టాలీవుడ్ హీరోలు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా వస్తుంటే.. నందమూరి నట సింహం బాలకృష్ణ వీర సింహా రెడ్డిగా వస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రావడం ఫ్యాన్స్ కు పండుగ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఈ రెండు సినిమాలకు అసలు పంచయితీ థియేటర్ల పంపిణీ దగ్గరే వచ్చింది.
క్రేజీ స్టార్ల సినిమాలని ప్రత్యేక వేళల్లో ఫెస్టివెల్స్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించేసిన ఆ టార్గెట్ కు రిలీజ్ కావాలని అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని హడావిడీ చేస్తుంటారు. అయితే అవి కొన్ని సార్లు మేకర్స్ మెడపై కత్తిలా మారుతూ టెన్షన్ పెడుతూ వుంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో మైత్రీ మూవీ మేకర్స్ వారిని చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు టెన్షన్ కు గురి చేస్తున్నాయి.
ఈ రెండు సినిమాలు నిర్మించింది ఒకే ఒక్క నిర్మాణ సంస్థ. అది మైత్రి మూవీ మేకర్స్. అయితే పొంగల్ రేసులో చిరు బాలయ్య సినిమాలకు పోటీగా తమిళ హీరో విజయ్ వారసుడు కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
దిల్ రాజు నిర్మాత అవడం వల్ల వారసుడికి తెలుగులో ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారు. ఏమన్నా అంటే సంక్రాంతి రిలీజ్ తాను ముందు ఎనౌన్స్ చేశానని అంటున్నారు. సంక్రాంతికి వారసుడు రిలీజ్ చేయడం తప్పేమి కాదు కానీ ఇక్కడ స్టార్స్ ని కాదని తమిళ హీరోకి ఎక్కువ థియేటర్లు కేటాయించడం వల్లే అసలు గొడవ మొదలైంది.
వైజాగ్ లాంటి ఏరియాలో ఆరు థియేటర్స్ లో వారసుడు.. చెరి నాలుగు థియేటర్ లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్చే స్తున్నారు. ఇక్కడే ఎంత పెద్ద దెబ్బ జరగబోతుందో అర్ధమవుతుంది. వారసుడు సినిమా దిల్ రాజు నిర్మించారు. ఒక నిర్మాతగా తన సినిమాని ఎక్కువ థియేటర్ లో రిలీజ్ చేయాలని అనుకోవడం తప్పేమి లేదు. కానీ పోటీగా వస్తుంది ఎవరి సినిమాలు అన్నది ఆలోచించాలి.
అంతేకాదు విజయ్ సినిమాలకు తెలుగులో ఒక మోస్తారు మార్కెట్ మాత్రమే ఉంది. కాబట్టి అతని సినిమా కోసం దిల్ రాజు ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు.అయితే సంక్రాంతి సినిమాల ఈ థియేటర్ కొట్లాట హాట్ టాపిక్ గా మారింది. ఇది వాళ్లకి వీళ్లకి కాదు ఆడియన్స్ కి పెద్ద శిక్షగా మారిందని అంటున్నారు. దిల్ రాజుకి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మెగా నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైతే మాత్రం వారసుడికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.
ఆ హీరోల ఫ్యాన్స్ ఒక్కటైతే మాత్రం వారసుడు ఎన్ని థియేటర్ లో వేసినా వాళ్లు ఆ సినిమాకు వ్యతిరేకంగా ట్రోల్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. తెలుగులోనే కాదు దళపతి విజయ్ వారసుడు సినిమాకు స్పెషల్ షోస్ ఏర్పాటు, చేయాలంటే తమిళనాడు సీఎం స్టాలిన్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారట దిల్ రాజు. ఇది అజిత్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. సంక్రాంతికి తెలుగులో అజిత్ తునివు అదే తెలుగులో తెగింపు గా కూడా రిలీజ్ అవుతుంది. మరి వీటన్నిటిలో పొంగల్
విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.