- ఏపీలో స్టిక్కర్ల వార్ నడుస్తోందా..?
- వైసీపీ స్టిక్కర్ రాజకీయానికి జనసేన కౌంటర్ షురూ చేసిందా..?
- అయితే వైసీపీ స్టిక్కర్ ప్లాన్ కు .. సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయా..?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, విపక్షాల మధ్య పోరు పెరుగుతోంది. జనంలోకి వెళ్లి పరస్పరం పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వ బలమైన సంక్షేమాన్ని హైలెట్ చేసేలా తాజాగా అధికార పార్టీ మొదలుపెట్టిన స్టిక్కర్ ప్రచారానికి, విపక్ష జనసేన ధీటుగా మరో స్టిక్కర్ తో సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఈ స్టిక్కర్ వార్ ఎన్నికల నాటికి మరింత తీవ్రమయ్యేలా ఉంది. ఏపీలో గతంలో జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పలు నినాదాలు తెరపైకి వచ్చాయి.
వాటిలో ప్రజలు పలు నినాదాల్ని ఆదరించగా.. మరికొన్నింటిని నిర్ద్వందంగా తిరస్కరించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చే నినాదాలకు జనంలో ఆదరణ బాగానే ఉంటోంది.దీంతో ఈసారి ఎన్నికలకు ఇప్పటి నుంచో ఏపీలో నినాదాలు రెడీ అయిపోతున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీ వైఎస్ జగన్ స్టిక్కర్ నినాదాన్ని రెడీ చేసింది. దీనికి కౌంటర్ గా జగన్ ఫొటోతోనే జనసేన కూడా మరో కౌంటర్ నినాదాన్ని ప్రిపేర్ చేసుకుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో భారీ ఎత్తున చేపట్టిన సంక్షేమాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వైఎస్ జగన్ ఫోటోతో “మా నమ్మకం నువ్వే జగన్ ” స్టిక్కర్ ను ఆ పార్టీ రూపొందించింది. త్వరలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి ఇళ్లకు ఈ స్టిక్కర్లు అంటించనుంది.
తద్వారా జనంలో జగన్ సంక్షేమం గుర్తుండిపోతుందని, అలాగే ఈ స్టిక్కర్లను చూసిన వారికి జగన్ ఎంతమందికి లబ్ది చేకూరుస్తున్నారో కూడా తెలుస్తుందని వైసీపీ చెబుతోంది. దీంతో త్వరలో భారీ ఎత్తున లబ్దిదారుల ఇళ్లకు ఈ స్టిక్కర్లు అంటించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ చేపట్టిన “మా నమ్మకం నువ్వే జగన్ ” స్టిక్కర్ల ప్రచారానికి కౌంటర్ ఇచ్చేందుకు జనసేన సిద్ధమైంది. ఇప్పటికే వైఎస్ జగన్ కు అప్పురత్న అవార్డు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయగా..దానికి కొనసాగింపుగా జనసేన స్టిక్కర్ వార్ కు తెరలేపింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు “మాకు నమ్మకం లేదు దొర..! నిన్ను నమ్మలేం జగన్ ” అంటూ జనసేన ఓ స్టిక్కర్ ను వైరల్ చేస్తోంది. ఇందులో ఓ సామాన్యుడి ఫొటో పెట్టి ఆయన జగన్ ను నమ్మలేం అంటూ చేతులెత్తి బాధపడుతున్న ఫొటోను పెట్టింది. దీంతో జనసేన కౌంటర్ స్టిక్కర్ వార్ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల నాటికి టీడీపీ కూడా ఇలాంటి వార్ మొదలుపెట్టేందుకు సిద్దమవుతోందని తెలుస్తోంది.
- ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అందరికీ షాకిస్తున్నాయి..
మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించి ఉన్న స్టిక్కర్లను పంపిణీ చేస్తున్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఈ స్టిక్కర్లను అంటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్టిక్కర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విధంగా స్టిక్కర్లు అంటించడం విషయంలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మాత్రం జగన్ కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
జగన్ సర్కార్ కు హైకోర్టులో మొట్టికాయలు కొత్త కాదు. మరో వివాదం దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కు ఏపీలోని ప్రజల్లో చాలామంది అభిమానులు అనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎంతోమంది సీఎంలు ఉన్నా ఈ తరహా నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రులు అయితే లేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టిక్కర్ల ద్వారా వైసీపీ పరువు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ స్టిక్కర్లపై వైసీపీ అభిమానులలో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టిక్కర్లు అంటించినంత మాత్రాన వాళ్లు వైసీపీకే ఓటు వేస్తారని చెప్పలేమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ కు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తారో తెలీదు కానీ వాళ్లు మహానుభావులు అని కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ప్రసార మాధ్యమాలనే వినియోగించుకున్న వైసీపీ సర్కారు ఇప్పుడు పథకాల లబ్ధిదారులను కూడా ప్రచారానికి వినియోగించుకోవాలని చూస్తోంది. వారి ద్వారా కావాల్సిన ప్రచారం కల్పించుకోవాలని భావిస్తూ ‘స్టిక్కర్’లను తెరపైకి తెచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.65 కోట్ల ఇళ్లకు తిరిగి వారి తలుపులకు ‘మా నమ్మకం నువ్వే జగన్’అన్న స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వలంటీర్లు, సమన్వయకర్తలు, గృహసారథులతో కలిపి 5.65 లక్షల మంది ప్రైవేటు సైన్యం అందుబాటులోకి వస్తుందని.. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని సూచించింది. అయితే ఒక్క తలుపులకే స్టిక్కర్లు కాదు.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సెల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అతికించాలని స్పష్టం చేసింది. అయితే ఇంటి యజమాని ఫోన్ కే అనుకుంటే పొరబడినట్టే. ఇంట్లో పథకాలు అందుకున్న వారందరి సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించాలని ఆదేశించారు.
- ఏపీలో స్టిక్కర్ల వార్..
అయితే కొన్ని గ్రామాల్లో ఉత్సాహం చూపించే వలంటీర్లు స్టిక్కర్లు అతికించడం ప్రారంభించేశారు. ఇదేం బాధ అంటే .. పట్టించుకునేవారు లేరు. ఎంత పథకాలు ఇస్తే మాత్రం ఇంటికి ఒంటికి కూడా స్టిక్కర్లు అంటిస్తారా అని ప్రశ్నిస్తే ఎక్కడ కేసులు పెడతారో.. ఎక్కడ వచ్చి అల్లరి మూక దాడి చేస్తుందోనన్న భయంతో ప్రజలు కిక్కుమనలేని పరిస్థితి ఏర్పడుతోంది. స్టిక్కర్లు చెరిగిపోతాయని ప్రభుత్వ పెద్దలకు ఆలోచన తడితే ..పచ్చబొట్లు వేయడానికి కూడా వెనుకాడరేమో అని సెటైర్లు పడుతున్నాయి. వైసీపీ సర్కారు ఏపీని మరీ ఆటవిక రాజ్యంగా మార్చేస్తుందన్న విమర్శలు మాత్రం పెరుగుతున్నాయి.
ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసినా.. ఊరికేనే చేయదు. ఎంతో కొంత కూడా కాదు.. భారీ లాభమే చూసుకుని ముందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి అవకాశం చిక్కినా.. వెంటనే దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకు నడుస్తోంది. తాజాగా ఇప్పుడు ఇంటింటికీ స్టిక్కర్ పథకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అయితే.. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. ఈ స్టిక్కర్లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందా? తమ పార్టీ భరిస్తోందా?వెల్లడించాలని ప్రశ్నించారు. ‘ఒక స్టిక్కర్‌కు రూ.30 చొప్పున వేసుకున్నా కోటి స్టిక్కర్లకు రూ.30 కోట్లు అవుతుంది“ అని లెక్కలు కూడా చెప్పారు. ప్రభుత్వ నిధులతో అతికిస్తే వాటిలో ఫ్యాన్ గుర్తు లేకుండా చూసుకోవాలన్న ఆర్ ఆర్ ఆర్.. ఒకవేళ పార్టీ నిధులను వెచ్చిస్తే ఇష్టం ఉన్నవారి ఇంటికి మాత్రమే అతికించాలన్నారు.
వలంటీర్లు బలవంతంగా స్టిక్కర్లను అతికిస్తే, ప్రజలు వీడియో తీసి ఎన్నికల కమిషన్‌కు నివేదించొచ్చని సలహా కూడా ఇచ్చారు. సరే.. రఘురామకు అంటే.. అక్కసు ఉంది.. కాబట్టి స్టిక్కర్లను కూడా రాజకీయం చేస్తున్నారని.. సీఎం జగన్ ను తిట్టిపోస్తున్నారని అనుకుందాం.. కానీ, తటస్థంగా ఉండే.. చాలా మంది నాయకులు.. మాజీ నాయకులు.. ఐఏఎస్ అదికారులు కూడా దీనిని తప్పుబడుతున్నారు. ఇంటింటికీ స్టిక్కర్ అనే పథకం దేశంలో ఎక్కడా లేదని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని చెబుతున్నారు.
మరి దీనిపై జగన్ వెనక్కితగ్గుతారో.. లేక ఏం చేస్తారో చూడాలి..